" బ్రతకడం మానివేసి జీవించడం మొదలుపెట్టాను "

 

ఈ జన్మకు నా పేరు ఫల్గుణ్. నా హాబీస్ ధ్యానం చేయడం, చేయించడం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం మరి క్రికెట్ చూడటం, ఆడటం. నేను 2003 ఆగస్ట్ నుండి ధ్యానం చేయడం ప్రారంభించాను. నేను మా మామయ్య D.సతీష్ కుమార్ గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది.

నేను ధ్యానం ప్రారంభించిన రోజు నుంచి బ్రతకడం మానివేసి జీవించడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడూ శాశ్వతమైన దానినే ఆలోచించేవాడిని. ధ్యానంలోకి వచ్చాక నాకు అర్థమైంది ఆత్మే బ్రహ్మ, జీవుడే దేవుడు, ఆత్మే శాశ్వతమని. "ఈ మరణంతో ఆగేది కాదు జీవితం, మరణం తర్వాత సాగాలి మన జీవనం" అని తెలుసుకున్నాను.

నాకు ధ్యానం ప్రచారం అన్నా, పౌర్ణమి క్లాసెస్ అన్నా చాలా ఇష్టం. పౌర్ణమి వెళ్ళిపోయిన మరుసటిరోజు నుంచే ఎదురుచూస్తూ వుంటాను "మళ్ళీ పౌర్ణమి ఎప్పుడు వస్తుందా" అని.

ఒకసారి కడప మాస్టర్ ఓబయ్యగారు మాకు "స్పిరిచ్యువల్ రియాలిటీ" C.D.ఇచ్చారు. మా ఇంటిల్లిపాదీ ఆ C.D. చూడడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ... " ఈ C.D. T.V. వున్న ప్రతి ఇంట్లో చూపించాలి" అని.

మా ఊర్లో వున్న "లోకల్ సిటీ ఛానెల్"లో C.D.ప్లే చేయించాను. C.D. చూసిన వాళ్ళంతా అందులో వున్న ధ్యానం ద్వారా లాభాలు, పిరమిడ్ యొక్క శక్తి, ఆ అద్భుతమైన జ్ఞానం విన్న, చూసిన తరువాత వాళ్ళు మాకు C.D. గురించి చెప్తూంటే వాళ్ళ కళ్ళల్లో మేము చూసిన ఆనందం ఎప్పటికీ మరచిపోలేనిది.

"విశ్వసంతోషానికి, ఆనందానికి కారణమైన "ధ్యాన జగత్" కార్యక్రమంలో నా పాత్ర కూడా వుంది" అని నేను గుర్తు చేసుకున్నప్పుడల్లా నా ఆనందానికి అవధులుండవు.

పాఠకులకు నా సందేశం : "రాముడినైనా, కృష్ణుడినైనా కీర్తిస్తూ కూర్చుంటామా, రామా, క్రిష్ణ ఏం సాధించారో గుర్తించుదాం మిత్రమా." 2008 నాటికి ధ్యాన భారత్, 2012 నాటికి ధ్యాన జగత్ కావాలన్న పత్రీజీ గారి సంకల్పానికి నా వంతు కృషి చేస్తున్నాను.

 

S.ఫల్గుణ్
రాయచోటి

Go to top