" మృత్యుంజయురాలిగా బయటపడ్డాను "

 

లూథియానాకు చెందిన మేడమ్ కిరణ్ అగర్వాల్ ధ్యానంలోకి వచ్చిన కొద్దిరోజులలోనే అనేక అనుభవాలు పొందినట్లు తెలిపారు. ముఖ్యమైన అనుభవం ఆమె మాటలలోనే...

"నేను ఆ రోజు అమృతసర్ నుంచి లూథియానాకి బయలుదేరాను. కారులో ప్రయాణం చేస్తున్నాను .. ఒక 10 కిలోమీటర్ల దాటాయి. పత్రీజీ ధ్యానవేణువు క్యాసెట్ పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాను. ఇంతలో నా కారుకు యాక్సిడెంట్ జరిగింది. కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్‌కు చాలా చోట్ల దెబ్బలు తగిలాయి, 100 కుట్లు పడ్డాయి. నాకు మాత్రం ఒక్క చిన్న గీత కూడా పడలేదు. కళ్ళు తెరిచేటప్పటికి అర్థం అయింది 'ధ్యానమే నన్ను రక్షించింది' అని. ధ్యానం వలన మృత్యుంజయురాలిగా బయటపడ్డాను" అని అమితానందంతో తెలిపారు .. మరెన్నో అనుభవాలు కూడా పొందుతున్నట్లు చెప్పారు.

పత్రీజీ ఆమె అనుభవాలు విన్న వెంటనే "మీరు ఒక పుస్తకం మీ భాషలో వ్రాయండి. దానిపేరు 'ధ్యానయుగ్' గా నామకరణం

చేస్తున్నాను" అన్నారు. ఆమె పుస్తకం వ్రాయడానికి వెంటనే ఆనందంగా అంగీకరించింది. ఇదే పత్రీజీ పవర్. మాట పవర్. థాట్ పవర్.

 

కిరణ్ అగర్వాల్
పంజాబ్
లుథియానా

Go to top