" చెడు ఆలోచనలే దెయ్యం "

 

నా పేరు లత. నాలుగు సంవత్సరాలుగా ఆనాపానసతి ధ్యానం చేస్తూ అందరిచేతా చేయిస్తున్నాను. ప్రస్తుతం కడపలో ఉన్నాం. మా వారు బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మా బాబు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అందరమూ ధ్యానం చేస్తాం.

మేము ఆదోనిలో వున్నప్పుడు ప్రేమ్‌నాథ్ సార్, రమేష్ సార్ (ప్రస్తుతం తిరుపతిలో వర్క్ చేస్తున్నారు) ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అనారోగ్యం ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తరువాత అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా వుంటున్నాం. ధ్యానంలో ఎంతోమంది దేవతలు, ఋషులు, యోగులు కనిపించి వారియొక్క సందేశాలు ఇచ్చేవారు. "Meditation is very important in our life" అనీ, "Be confident always" అనీ ధ్యానంలో మొదట కనిపించేవి. తర్వాత ధ్యానంలో యుక్తేశ్వర్‌గిరి కనిపించి "ఈ ధ్యానాన్ని నువ్వు ఎంతెంతగా చేస్తావో అంతంతగా నీకు సత్యాలు తెలియబడతాయి " అన్నారు. రామకృష్ణ పరమహంస కనిపించి " ఈ ధ్యానాన్ని నువ్వు వదలవద్దు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఈ ధ్యానమనుకుని నువ్వు సాధన చెయ్యి" అని చెప్పడం "నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సాధన బాగా చేయి" అని చెప్పారు.

ఇంకా ధ్యానంలో ఇలా వచ్చింది. "ఏ పని అయినా మొదలుపెట్టినప్పుడు విశ్వాసం (నమ్మకం) తో చేయాలి. ఆ నమ్మకమే నీకు చాలా శక్తిని ఇస్తుంది. నమ్మినదానిని వదలవద్దు. అని వినిపించింది."

ఇంకోరోజు ధ్యానంలో "దేవుడు అంటే దేహంలో ఉండేవాడు" అనీ, "పూజ అంటే ధ్యానం" అనీ "పూజ ఎలా అయితే ప్రతిరోజూ చేస్తామో ధ్యానం కూడా అలాగే చేయాలి. తెలిసిన తర్వాత ధ్యానమే పూజ" అనీ వచ్చింది.

ఇంకొకరోజు "దేవుడు - దెయ్యం" అని, "మనం మంచి ఆలోచనలే దేవుడు. మన చెడు ఆలోచనలే దెయ్యం." మనం ఎప్పుడూ దేవుడి (Positive Thinking) తోనే ఫ్రెండ్‌షిప్ చెయ్యాలి కానీ దెయ్యం (Negative Thinking) తో సహవాసం చెయ్యకూడదు. ఏ పని చేస్తున్నా మంచి మనస్సుతో మంచిపని చెయ్యాలి. చెడు మనస్సుతో చేస్తే దెయ్యం పని చేసినట్లు అవుతుంది. కనుక ఎప్పుడూ మంచి ఆలోచనలు, మంచి పనులు మంచి మనస్సుతో చేస్తే దేవుడు మనతో వుంటాడు. దెయ్యం పారిపోతుంది" అని ధ్యానంలో వచ్చింది.

ధ్యానంలో పత్రిసార్ చాలా ఎక్కువుగా వచ్చేవారు. "ఈ విధంగా చెయ్యి. ఈ విధంగా వుండు" అని ధ్యానంలోనే నా అనారోగ్యానికి సార్ డాక్టర్‌గా వచ్చి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. తర్వాత ఆ రోగం పోవడం జరిగింది.

మా బాబు వల్లనే మేము ఈ ధ్యానంలోకి రావడం జరిగిందని ఆదోని మాస్టర్స్ చెప్పారు. మాకు మొదట్లో అర్థం కాలేదు.

మా బాబు ఏడవతరగతి చదివే రోజుల్లోనే "ఓంకారం ఎలా పుట్టింది? ఇప్పుడు నక్షత్రాలుగా ఎవరున్నారు? ఇంకా ఎవరెవరు రాబోతారు. "నా పూర్ణాత్మ, మా వారి పూర్ణాత్మ, నేను పుట్టినప్పటినుంచి ఎన్ని శ్వాసలు తీసుకున్నాను. ఇంకా రాంపా, రామ్తా గురించి చాలా చాలా విషయాలు చెప్పేవాడు. చదువులో యావరేజ్ ఉన్నందుకు మేము ఎక్కువుగా పట్టించుకునేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడిప్పుడు బాబు గురించి అర్థం అవుతోంది.

నాకు ధ్యానంలో ఎన్నెన్నో అనుభవాలు. ఆ అనుభవాలే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. ధ్యానంలోనే, అంతర్వాణి, అంతరాత్మ, ఏడుశరీరాలు విడుదల, ఆత్మశక్తి రిలీజ్ అని, గతజన్మల గురించి, ధ్యానంలోనే పిరమిడ్‌లకు ఆత్మశక్తి ద్వారా ప్రోసెస్‌లు చేయడం ఇంకా చాలా చాలా విషయాలు .. కవితలు, ఆటోరైటింగ్, పాటలు మొదలైనవి తెలియబడేవి.

టోటల్‌గా నా జీవితమే ధ్యాన జీవితం అయ్యింది. ఇంట్లోనే ప్రతిరోజూ ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి. అందరూ ధ్యానం బాగా చేస్తారు. వాళ్ళకు కూడా మంచి మంచి అనుభవాలు ఆటోరైటింగ్ కవిత, ఆత్మక్షేత్రం గురించి, వాళ్ళ పూర్ణాత్మ ఎవరు అన్న విషయాలు ధ్యానం‌లో తెలుసుకోగలుగుతున్నారు. చాలా ఆనందం పొందుతున్నారు. "మీలాగే మేము కూడా ధ్యానం చేస్తూ ధ్యానప్రచారం చేస్తాం" అంటున్నారు.

ఇంతటి ఆనందమయమైన జీవితాన్ని ఇచ్చిన శ్వాసకు ఆ శ్వాసే గురువని తెలిసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి నా నమస్సుమాంజులులు.

 

P.లత
ఓంశాంతి నగర్, కడప
ఫోన్ : +91 94407 68821

Go to top