" ఫాస్ట్ లైఫ్ థెరపీ "

 

నా పేరు నరసింహరావు. బెంగుళూరు: "బుద్ధుడు తన గతజన్మలను చూసుకోవటం వల్ల పరిపూర్ణమైన ప్రజ్ఞ కలిగిందని బుద్ధుని జాతక కథల అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. అయితే నా గతజన్మ అనుభవం ఒక్కటైనా తెలుసుకోవాలని అనుకుంటూ వుండేవాడిని. డాక్టర్ హరికుమార్ గారునిర్వహించిన వర్క్‌షాప్‌లో స్టెప్ బై స్టెప్‌గా నాకు వచ్చిన సుందర ప్రదేశాలలో విహరిస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన అనుభవం: చిన్న వయస్సులోని ఆనందకరమైన సన్నివేశాలు అలాగే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వెచ్చగా ఎంతో హాయిగా లభించటం. .. విశేషమైన ధ్యానసాధన చేసిన జన్మను తిరిగి అనుభవించమన్నప్పుడు .. ఒక మునీశ్వరునిగా వున్న జన్మ చూసుకోవటం ... ఆ జన్మలో ఎంతోమందికి ధ్యాన శిక్షణ ఇవ్వటం .. చాలా చక్కగా చూసుకోవటం జరిగింది. ఆ జన్మలో మరణశయ్యపై నేను వున్నప్పుడు చుట్టూ వందలకొద్దీ గోవులు ఉండటం వాటి కళ్ళలో ప్రేమ, ఆర్ద్రత నా అణువణువునా పరవశింప చేసింది.

"శరీరం నుంచి విడివడి ఊర్థ్వలోకాలకు ప్రయాణం చేయమన్నప్పుడు శరీరం వదిలే ప్రక్రియ చాలా సులువుగా అనిపించింది. ఊర్థ్వలోకాలలో షిరిడీసాయితో జీవితలక్ష్యం గురించీ, మన 'ధ్యాన జగత్' గురించీ, కొన్ని సందేహాలకు సమాధానాలు పొందటం, విశేషంగా మన యాక్టివిటీస్ మెచ్చుకోవటం, తిరిగి ఆ జన్మలోని జ్ఞానాన్నీ, శక్తినీ సకారాత్మకమైన నైపుణ్యాలను ప్రస్తుత శరీరంలోకి తీసుకుని వస్తున్నప్పుడు ఎంతో గాఢమైన ప్రశాంతత ఆనందం శక్తి పొందటం జరిగింది. డాక్టర్ V.హరికుమార్ గారికి కృతజ్ఞతలు."

 

నరసింహరావు
బెంగళూరు

Go to top