" ధ్యాన ఒరిస్సా "

 

నా పేరు వెంకటరమణ. నేను 1997 అక్టోబర్ 1 న ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం నేర్చుకున్న రెండవరోజు నుంచి ధ్యానప్రచారం మొదలుపెట్టాను.

ఎందుకంటే "మనం దేనిగురించి ఎక్కువుగా బోధిస్తుంటామో దాని గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాం." ఈ 'ధ్యాన సాధన', 'ధ్యాన బోధన' క్రమంలో ఎనిమిది సంవత్సరాలు సునాయాసంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని .. జీవితాన్ని రసవత్తరంగా, ఆనందదాయకంగా ... ఎల్లలు దాటి నింగికెగసే పక్షిలా సాగించాను.

గత ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టిన నాకు ఇప్పుడు పత్రీజీ "ధ్యాన ఒరిస్సా" ప్రాజెక్టును అప్పగించినందుకు చాలా ఆనందంగా గర్వపడుతున్నాను. నేను 2006, మే నుంచి కటక్‌‍లో వుంటూ భువనేశ్వర్, కటక్‌లలో ధ్యాన శిక్షణా తరగతులను నిర్వహిస్తూ .. జూలై నెల 21.22 తేదీలలో పత్రీజీ క్లాసులను కూడా నిర్వహించడం జరిగింది.

పత్రీజీ చెబుతూంటారు .. "తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ధ్యానం నేర్పించేవాడు బోధిసత్వుడు." అందరి దగ్గరకు వెళ్ళి ధ్యానం నేర్పించేవాడు "బుద్ధుడు" అని.

ఎంతగా మన పరిధులను విస్తృతపరుస్తామో .. అంతగా మన బుద్ధత్వం వికసిస్తుంది.

నా పిల్లలు .. నా పెళ్ళాం .. పిల్లలకు ఆస్తులను సంపాదించి ఇవ్వాలి ... కొంపలంటుకుంటున్నా ఇంకా ఇదే సొద ...

మనం ఈ భూమి పైకి వచ్చింది మన జీవితాన్ని మనం జీవించడానికి ... మనపిల్లల జీవితాన్ని, మన తల్లిదండ్రుల జీవితాన్ని జీవించడానికి కాదు. మన తర్వాత పుట్టేవాళ్ళంతా మనకంటే ఘనులే .. వాళ్ళ గురించి .. ఆస్తులు ప్రోగేసి మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా వచ్చిన పని చుసుకుంటే .. ఈ జన్మ అయినా ఆఖరిజన్మ అవుతుంది.

ఓషో అంటాడు .. "మీ పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వండి .. ఆస్తులను, జీవన విధానాలను కాదు" అని.

నాకు నా తల్లిదండ్రులు స్వేచ్ఛను ఇవ్వలేదు. చూసి చూసి చివరకు విసుగొచ్చి నేనే స్వేచ్ఛను తీసుకున్నాను. కాబట్టే ఇప్పుడు నా జీవితానికి బాధ్యత వహిస్తున్నాను. నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను.

మీ పిల్లలకు ఆస్తులను, అవధులను ఇవ్వకండి. ఈ భూమిపై అద్భుత పంటలు పండించడానికి, ఎన్నో అద్భుత సంపదలను ఆనందించడానికి మీ పిల్లలు వస్తున్నారు ... మీ అల్పమైన ఆలోచనలతో వారిని కించపరిచి వారి ఆత్మపరిణితికి అవరోధం కాకండి.

"ధ్యాన భారత్ -2008" దగ్గర పడుతోంది. ఆంధ్రరాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో .. భారతదేశంలో సుమారు అన్ని రాష్ట్రాలున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క జిల్లా వారు ఒక్కొక్క రాష్ట్రాన్ని దత్తత తీసుకుంటే .. సునాయసంగా "ధ్యాన భారత్ -2008" విజయవంతమైపోతుంది.

మనం చేసినా చేయకపోయినా ధ్యాన భారత్ - 2012 కల్లా అవుతుంది. 1947 ... భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆగిపోలేదు. కాకపోతే ఆ ఉద్యమంలో పాల్గొన్నవారి జీవితాలు వారి ఆత్మపరిణామ దిశలో ఎంతో ముందుకు సాగిపోయి ఉంటాయి .. పాల్గొనని వారి జీవితాలు ఇంకా అజ్ఞానం లోనే అలరారుతూ ఉంటాయి.

మై డియర్ ఫ్రెండ్స్. పత్రిసార్ మనకెంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. Now the ball is in our court. ఆడదమన్నా ... చూద్దామన్నా మనిష్టమే.

మన దగ్గర ఉన్నది పంచితే.. .లేనిది పెంచబడుతుంది. మీ జిల్లాలో ఉత్సాహవంతులను మిగిలిన రాష్ట్రలకు పంపించండి మీరు వారికి తగిన సహాయ సహకారాలను అందించండి.

పత్రిసార్ 1997 లో చిన్న కాన్సెప్ట్ చెప్పారు .. అదే KEMT... Knowledge, Energy, Money, Time ... ఏ పనికైనా ఈ నాలుగు అవసరం. అందరూ అన్నీ కాకపోయినా .. ఎన్ని వీలైతే అన్ని ఈ నాలుగింటిలో ధ్యాన ప్రచారం నిమిత్తం ఫణంగా పెట్టండి.

ఇప్పుడు ఒరిస్సాలో రాయగడ, బరంపురం, భువనేశ్వర్, కటక్ ... ఇలా చాలా చోట్ల క్లాసులు జరుగుతున్నాయి. ఆంద్రప్రదేశ్ పిరమిడ్ మాస్టర్లందరినీ ఆనందంగా మన "ధ్యాన ఒరిస్సా"కి ఆహ్వానిస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి.

"ధ్యాన ఒరిస్సా" కార్యక్రమంలోనన్ను మొదటి నడిపిస్తున్న వైజాగ్ పిరమిడ్ మాస్టర్లందరికీ శత, సహస్ర ధ్యానాభివందనాలు.

 

P.వెంకటమణ
ఒడిషా
ఫోన్ : +91 93464 66460 (ఎ.పి.),+91 99381 31533 (ఒడిషా)

Go to top