" కేంద్రీయ విద్యాలయంలో ధ్యానం "

 

నా పేరు సుధామణి. నేను కేంద్రీయ విద్యాలయ, పికెట్, సికింద్రాబాద్, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో, కేంద్రీయ విద్యాలయ సంఘటన వారిచే నడుపబడుతున్నాయి. దేశవిదేశాల్లో మొత్తం 900లకు పైగా వున్నాయి. ముఖ్యంగా రక్షణ దళాల, కేంద్ర ప్రభుత్వోద్యోగుల పిల్లలకోసం ఈ విద్యాలయాలు పనిచేస్తున్నాయి.

బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ గురించి, ఆనాపానసతి ధ్యానం గురించి మా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (రిటైర్డ్) శ్రీ N.S.రావు గారి ద్వారా తెలుసుకున్నాను. వారు మా విద్యార్థుల చేతా, ఉపాధ్యాయుల చేతా చక్కగా ధ్యానం చేయించి, ధ్యానం వలన కలిగే లాభాలను కూడా వివరించి చెప్పాను.

గత సంవత్సరం మే నెలలో మా పాఠశాలలో బయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు ఇన్సర్వీస్ కోర్స్ జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండీ ఉపాధ్యాయులు వచ్చారు. ఆ సందర్భంగా శ్రీ రావు గారు వారందరికీ ధ్యానం క్లాస్ తీసుకుని "స్పిరిచ్యువల్ రియాలటీ" C.D. కూడా చూపించారు. 78 సంవత్సరాల వయస్సులో వారు ఆరోగ్యంగానూ, ఓపిగ్గానూ వుండి ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నారంటే అది వారు చేస్తున్న ధ్యాన మహిమే గదా అని తెలుసుకున్నాం.

మా అసిస్టెంట్ కమీషనర్ గారైన శ్రీ నీలాప్ గారు కూడా ధ్యానం విధ్యార్ధులకూ, ఉపాధ్యాయులకూ ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వారి సహాయ సహకారలతో శ్రీ రావు గారు అనేక కేంద్రీయ విద్యాలయాలకు వెళ్ళి విద్యార్ధులకు ధ్యానం నేర్పుతున్నారు. ముఖ్యంగా C.B.S.E. పబ్లిక్ పరీక్షలు వ్రాసిన పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు ఈ ధ్యానం ఎంతో మేలు చేసింది. వాళ్ళంతా పరీక్షలు బాగా వ్రాశారు.

మా విద్యార్ధులకింత గొప్ప మేలు చేసిన శ్రీ రావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తే వారేమన్నారంటే, "అమ్మా, ఇందులో నా గొప్పేమీ లేదు. నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే. అందువల్ల మీ కృతజ్ఞతలు నిజంగా ఎవరికి చెందాలో వారికి అందజేయండి. వారెవరంటే, వేలమంది పిరమిడ్ మెడిటేషన్ మాస్టర్ల ద్వారానూ, 'పైమా' పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్' ద్వారానూ లక్షలాది విద్యార్ధులకు ధ్యాన బోధ చేయిస్తూ, వారిలో శ్వాస విజ్ఞాన జ్యోతిని వెలిగింప జేసిన జగద్గురువులు, బ్రహ్మర్షి పత్రీజీ" అని చెప్పారు.

అందువల్ల, ధ్యానాంధ్రప్రదేశ్ ద్వారా, మా అసిస్టెంట్ కమీషనర్ గారి తరపునా, మా అందరి తరపునా బ్రహ్మర్షి పత్రీజీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

D.సుధామణి
సికింద్రాబాద్

Go to top