" నాకు ఎన్నోజీవిత సత్యాలను నేర్చుకునే భాగ్యం ధ్యానం ద్వారా కలిగింది "

నా పేరు ప్రత్యూష.

మాది ప్రొద్దుటూరు. నేను గత పన్నెండు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ఎన్నో అద్భుతమైన అనుభవాలు నా సొంతం. నాకు థర్డ్ ఐ విజన్స్, ఆస్ట్రల్ ట్రావెల్ వంటి అనుభవాలు లేకపోయినా ప్రతినిత్యం నాకు ఎన్నోజీవిత సత్యాలను నేర్చుకునే భాగ్యం ధ్యానం ద్వారా కలిగింది. " ధ్యాన ప్రచారం చేయాలి " అని సంకల్పించుకున్న వెంటనే, మా ఇంటి కాంపౌండ్‌లోనే పిరమిడ్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఇందుకు సహకరించిన ప్రొద్దుటూరు మాస్టర్స్, మా కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు.

పైమా మాస్టర్ అయిన " కనకరాజు " గారు, చంద్రగిరి మాస్టర్ " రమేష్ " గారు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. 8X8 రెండు స్ట్రక్చర్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఇటువంటి పిరమిడ్ నిర్మాణం జరగడం, అందులో నేను, నా భర్త సతీష్‍కుమార్ భాగస్వాములం కావడం మాకు ఎంతో ఆనందదాయకంగా వుంది. ఈ పిరమిడ్‌కు 2009 డిసెంబర్ 18న బ్రహ్మర్షి పత్రీజీ గారిచే అత్యద్భుతంగా ప్రారంభోత్సవం జరిగింది. సార్ ఈ పిరమిడ్‌కు " శ్రీ సాయిరామ్ పిరమిడ్ ధ్యానకేంద్రం " గా నామకరణం చేయడం జరిగింది. పిరమిడ్‌ను చక్కగా ఉపయోగించుకుని వాటి లాభాలను పొందుతున్న నా ధ్యానమిత్రులందరికీ నా అభినందనలు.

 

ప్రత్యూష
ప్రొద్దుటూరు

Go to top