ధ్యానంలొ నాకు కళ్ళ జబ్బు నయమైంది

 

 

నా పేరు వంశీకృష్ణసాయి.

నేను 16/10/2003 నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ఎప్పుడూ కళ్ళు తిప్పుతూ ఉండేవాడిని. ఇలా మూడునెలల నుంచి జరుగుతూ వుంది. చిన్నపిల్లలు కూడా ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చంద్రకళా మేడమ్ చెప్పారు. ఆ రోజు నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. నాలుగైదు రోజులకే నాకు ఈ కళ్ళ జబ్బు నయమైంది. ఒకరోజు పత్రిసార్ నాకు ధ్యానంలో కనిపించి బాగా చదవమని ప్రోత్సహించారు. 2007 సంవత్సరంలో ఆరోగ్యానికీ, చదువుకూ కలిపి ప్రేమ్‌నాథ్ సార్ మూడుగంటలు ధ్యానం చేయమన్నారు. ఇలా మూడునెలలు చేసాను. చేసిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. అనేకమంది మాస్టర్స్ కనిపించి నాకు చక్కని మెస్సేజెస్ ఇచ్చేవారు. ఇటీవల వచ్చిన అనుభవాలలో ఒకటి, నేను మన పాలపుంత అంతా చూసాను. సూర్యుడి దగ్గరకు కూడా వెళ్ళి, సూర్యుడిని తాకినప్పుడు ఆ వేడి ఇక్కడ నా భౌతిక దేహానికి అనుభవమైంది. గ్రహాంతరవాసులను కలిశాను. నా మిత్రులందరికీ కూడా ధ్యానం చేసుకోమని చెబుతూంటాను. మా అమ్మా, నాన్న కూడా చక్కని మెడిటేటర్స్. మా అమ్మ కూడా ధ్యానప్రచారం చేస్తుంది.

 

వంశీకృష్ణసాయి

Go to top