" ధ్యానం మాకు సంపూర్ణ జీవితాన్ని అందించింది "

 

నా పేరు రాములు.

నేను గత సంవత్సరం మార్చి 7వతేది ఓల్డ్ బోయిన్ పల్లి పిరమిడ్ మాస్టర్ శైలజ మేడమ్ గారి దగ్గర ధ్యానం నేర్చుకున్నాను. అంతకు ముందు నాకు హై-బి.పి. మరి డయాబెటిస్ ఉండడం వల్ల ప్రతిరోజు మందులు వాడుతూ, యోగాసనాలు వేస్తూండేవాడిని. దాంతో అవి కొంతవరకు అదుపులో ఉన్నా.. పూర్తి ఉపశమనం మాత్రం కలుగలేదు!

నాకంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత 20 యేళ్ళ నుంచి బి.పి. థైరాయిడ్, కీళ్ళనొప్పులు, సైనసైటిస్ మరి వెన్నముక నొప్పితో బాధపడుతూన్న నా భార్య అనురాధ అవి మరీ తీవ్రం కావడంతో గత సంవత్సరం ఫిబ్రవరిలో యశోదా హాస్పిటల్‌లో చేరింది.

డాక్టర్లు ఆమెను పరీక్షించి.. "వెన్నముక ప్రక్కన మాంసం పెరిగింది.. ఆపరేషన్ చేస్తే కానీ లాభంలేదు" అని బోలెడు మందులు వ్రాసి..అని వాడుతూ "బెడ్ రెస్ట్" తీసుకోమన్నారు.

కాస్సేపయినా క్రింద కూర్చోలేని నా భార్య అనురాధ.. శైలజ మేడమ్ సలహాతో ధ్యానం చేయడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా ఆమె ఆరోగ్యంలో వస్తూన్న మార్పులను గమనిస్తూన్న నేను ఎంతో ఆశ్చర్యపోయాను. వెన్నుపూస నొప్పి వల్ల పనిచేయకుండా ఆగిపోయిన ఆమె కుడిచేయి కూడా తన స్వాధీనంలోకి రావడంతో.. మెల్లిమెల్లిగా ఆమె తన పనులతో పాటు ఇంటి పనులు కూడా చేసుకోవడం మొదలుపెట్టింది! బి.పి. మరి థైరాయిడ్ కోసం వాడే మందులన్నీ ప్రక్కకు పడేసింది!

ఒక నెలరోజుల తరువాత మళ్ళీ మార్చినెల్లో యశోదా హాస్పిటల్‌కు వెళ్ళి MRI స్కానింగ్ చేయించగా వెన్నముక ప్రక్కగా ఏర్పడిన మాంసం పూర్తిగా కరిపోయిందనీ ఇక ఆమెకు ఎలాంటి ఆపరేషన్ కూడా అవసరం లేదని డాక్టర్లు చెప్పారు! ఆపరేషన్ కోసం ఖర్చు కావలసిన వేల రూపాయల ఆర్థిక భారం కూడా తప్పిపోవడం మాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది!

నా భార్య ఆరోగ్యంలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు స్ఫూర్తిని పొంది.. నేను కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టాను. నాలుగు రోజుల తరువాత ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు విపరీతమైన శక్తిప్రవాహం నా శరీరంలోకి వస్తూ..నా వంటి నిండా చెమటలు పట్టి.. బట్తలు కూడా తడిసిపోయాయి.

ధ్యానం అయిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి బి.పి పరీక్ష చేయించుకోగ "గత కొన్నేళ్ళుగా ఉన్న హై -బి.పి ఇప్పుడులో-బి.పిగా వుంది" అని చెప్పి నాతో గ్లోకోజ్ నీళ్ళు త్రాగించి..రెస్ట్ తీసుకోమని చెప్పారు. నేను బి.పి ట్యాబెట్లు వాడడం పూర్తిగా మానివేసి ధ్యాన సాధనను కొనసాగిస్తూ.. మాంసాహారం పూర్తిగా మానివేసి కుటుంబం అంతా సంపూర్ణ శాకాహారుల్లా మారిపోయాము!

అయిదు నెలల క్రమం తప్పని ధ్యానసాధనతోనే బి.పితో పాటు డయాబెటీస్ మామూలు స్థితికి వచ్చేసింది. గత కొన్ని యేళ్ళుగా నాకు మా ఆవిడకూ కలిపి నెలకు 1800/- వరకు ఖర్చు అయ్యే సొమ్ము మాకు మిగిలిపోయి "ధ్యాన ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న పెద్దల మాటను నిజం చేసింది.

"నాకు ఇంతమంచి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ధ్యాన్నాన్ని అందరికీ అందించాలి" అనే తపనతో మా ఇంట్లోనే 41 రోజుల ధ్యానం తరగతులు మొదలుపెట్టాము! నేను ఉద్యోగం చేసె జీడిమెట్ల‌లోని ఉశా ఇంటర్నేషనల్ కంపెనీలోని రకరకాల విభాగాల్లోని కార్మికులకూ, ఉద్యోగులకూ ధ్యాన శిక్షణా తరగతులను ఏర్పాటు చేసాను! మేము నిర్వహిస్తోన్న ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమాల వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా ఎన్నెన్నో ప్రయోజనాలను పొందిన సిబ్బంది కోరిక మేరకు.. మా కంపెనీ యాజమాన్యం కూడ అక్కడ వున్న A/C కాన్ఫరెన్స్‌హాలు లో ప్రతి శనివారం ధ్యానశిక్షణా తరగతులు నిర్వహించడానికి మాకు అనుమతిని ఇచ్చింది!

నా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, నా సామాజిక జీవితంలో కూడా ఇంత ఉన్నతమైన మార్పును తెచ్చుకోగలిగే ధ్యానాన్ని మాకు అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ..కి మా కుటుంబ సభ్యులం అందరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం!!

 

రాములు
సికింద్రాబాద్

Go to top