" పిరమిడ్ శక్తితో నేను కోలుకున్నాను "

 

నా పేరు వెంకన్న.

నా వయస్సు 80 సంవత్సరాలు. నాకు మూత్ర సంబంధ వ్యాధితో పాటు నరాల బలహీన వల్ల నా నోరు, నా ముఖం అంతా తిమ్మరి మంటగా వుండేది. పూర్తిగా నీరసంతో రోజంతా మంచం పైనే ఉండేవాడిని; చాలా హాస్పిటల్స్ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టనా తగ్గలేదు. ఒకరోజు మా ఊరి డాక్టర్ రామకృష్ణ గారు నాకు ట్రీట్మెంట్ చేయడానికి మా ఇంటికి వచ్చి నాకు "శ్వాస మీద ధ్యాస" ధ్యానం నేర్పించి..2X2 పిరమిడ్ నా మంచం పైన కట్టారు. రోజూ ఉదయం ఒక గంట ధ్యానం సాయంత్రం గంట ధ్యానం మరి రాత్రికి అలాగే మంచం పై పిరమిడ్ క్రింద పడుకునేవాడిని.

15 రోజుల తర్వాత ఒకరోజు నా శరీరంలో పెద్ద మార్పు! రాత్రి పూట ధ్యానంలో అంజనేయస్వామి నన్ను పిలవడం.. మరి నేను మధ్యరాత్రి గుడికి వెళ్ళి.. అక్కడే ఒక గంట ధ్యానం చేసి వచ్చాను!

ఆరోజు నుండి నాకు నా శరీరంలో క్రొత్త శక్తి ప్రవహించి నేను పూర్తిగా కోలుకున్నాను! ఎందరో డాక్టర్లు నయం చేయలేని నా జబ్బును పిరమిడ్ శక్తి తగ్గించివేసింది!

 

వెంకన్న
మెహబూబ్‌నగర్

Go to top