" ధ్యాన మందిరాన్ని నిర్మించి ధన్యుడను అయ్యాను "

 

నా పేరు వెంకటేశ్వర్‌రావు.

నేను చిన్నతనం నుంచి దేవుని పట్ల విపరీతమైన భక్తి భావనతో పెరిగి పెద్దయ్యాను. 36 సంవత్సరాలు RTC సంస్థలో ఉద్యోగం చేసి 1998లో పదవీ విరమణ చేసాను. ఆ తరువాత నా సమయాన్నంతా "భక్తి మార్గం" వైపు పూర్తిగా మళ్ళించి.. మా కాలనీలోనే తొమ్మిది ఆలయాల నిర్మాణంలో ముఖ్యపాత్రను వహించాను!

2005 సంవత్సరంలో మా మేనల్లుడు "ధూళిపూడి చంద్రశేఖర్" ద్వారా "ధ్యానమార్గం" లోకి వచ్చి ..నా అన్ని సంవత్సరాల జీవితంలో పొందిన ఆనందం కంటే రెట్టింపు ఆనందాన్ని రోజులో కొంతసేపు చేసిన ధ్యానంలో పొందగలిగాను. ఇక వెంటనే ఆ ఆనందాన్ని అందరికీ అందించాలని నేను నిర్మాణం చేయించిన ఆలయాల ప్రాంగణంలోనే 40 రోజుల ధ్యానశిక్షణా తరగతి నిర్వహించాము.

2006లో శ్రీమతి ప్రమీల వెంకటరత్నం గారు అనే ఒక భక్తురాలు "శ్రీ కృష్ణమందిరం" కట్టాలి అన్న సంకల్పంతో నా దగ్గరికి రాగా నేను వారికి ధ్యానం నేర్పి..పిరమిడ్ శక్తి గురించి తెలియజేసాను. కేవలం ఒకే మతానికి చెందిన వారికి పనికివచ్చే విధంగా ఉన్న ఆలయం కంటే.. అన్ని మతాల ప్రజలకు సక్తిని పంచే "శక్తిక్షేత్రం" ..పిరమిడ్‌ను కట్టడం అసలైన దైవ కార్యం అన్న సంగతిని ఆవిడ కూడా గుర్తించడంతో 4X4 సైజులో ఉన్న 36 చిన్న చిన్న పిరమిడ్‌లతో శ్రీ క్రుష్ణ ధ్యానమందిరాన్ని ..హయత్ నగర్ లోని RTC కాలనీలో నిర్మించడం జరిగింది!

ఈ "ధ్యానమార్గం" లోకి రాకముందు నా కొడుకుతో కలిసి 25 సంవత్సరాల పాటు నాగపూర్‌లో కోళ్ళఫారాలను నిర్వహించాము. మాంసాహారంలో ఉన్న అనర్థాలను తెలుసుకున్న తరువాత.. శుద్ధ శాకాహారిగా మారి.. నా కొడుకు జీవనోపాధిగా ఎంచుకున్న ఆ నాగపూర్ కోళ్ళఫారాలను నష్టం వచ్చినా సరే మూసివేసి పాపప్రక్షాళన చేసుకున్నాము. ప్రస్తుతం నా కొడుకు జనార్థన్.. ఇంతవరకు కోళ్ళఫారాలు నిర్వహించిన ఆ నాగపూర్‌లోనే.. విస్తృత ధ్యాన శాకాహార ప్రచారాలు చేపడుతున్నాడు!

నాకు ప్రస్తుతం 73 సంవత్సరాలు! అంతకుముందు నేను ఎన్నో ఆలయాలను నిర్మించిన పరమభక్తుడిలా ఉన్నా.. మరెన్నో ప్రాణాంతకమైన రోగాలతో బాధపడేవాడిని. ఆ అనార్థాలకు కారణం మేం ఇతరజీవులను చంపి మా పొట్టలు నింపుకుంటున్న కోళ్ళ వ్యాపారం ప్రభావం అని మాకు తెలియదు. కానీ ధ్యానం చేస్తూ కోళ్ళఫారం బిజినెస్ మానివేసి ధ్యానప్రచారం మొదలు పెట్టిన తర్వాత నుంచి నా ప్రాణాంతక రోగాలన్నీ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఈ వయస్సు‌లో కూడా నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారాను.

నా తుది శ్వాస వరకు వారి ఉద్యమంలో భాగస్వాముడిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.

 

వెంకటేశ్వర్‌రావు
రంగారెడ్డి జిల్లా

Go to top