" శాశ్వతనిధి "

 

నా పేరు సునీత. నేను నాలుగేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేయకముందు " నేను ", " నాది " అనే భావన .. కోపం, భయం, మానసిక ఆందోళన ఎక్కువగా వుండి జీవితాన్ని ఆస్వాదించలేక అశాంతితో ఉండేదాన్ని. అనారోగ్యం (గైనిక్ ప్రాబ్లమ్) తో కూడా బాధపడేదాన్ని. ఎంతమంది డాక్టర్లను కలిసినా ఆపరేషన్ అవసరమని చెప్పారు.

ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత నాలో అంతర్ముఖంగా మార్పులు చోటుచేసుకుని ఆందోళనలు తగ్గి అందరితో ఆత్మీయంగా ఉండగలుగుతున్నాను. జీవితాన్ని ఆనందించ గలుగుతున్నాను. నా అనారోగ్యాన్ని కూడా ధ్యానం ద్వారానే తగ్గించుకోగలననే గట్టి నమ్మకంతో ఉండేదాన్ని. 2009 లో ధ్యానం చేస్తుండగా ఒకరోజు ఆస్ట్రల్ ఆపరేషన్ జరిగిన అనుభవం పొందాను. అప్పటినుంచి ఆరోగ్య సమస్య తీవ్రత తగ్గడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏ ఆపరేషన్ లేకుండానే పూర్తి ఆరోగ్యంతో వున్నాను. ధ్యానం చేయడమే కాకుండా ఆత్మజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకూ సంబంధించిన పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం కూడా నాలోని ఈ మార్పుకు కారణం. ప్రస్తుతం ధ్యాన ప్రచారంలో భాగంగా ధ్యానం క్లాసులు చెప్పడం, ఇంట్లో క్లాసులు కండక్ట్ చేయడం, తెలిసినవాళ్ళకు పుస్తకాలు, CD లు కొని ఉచితంగా పంచిపెట్టడం చేస్తున్నాను.

" ధ్యానంధ్రప్రదేశ్ " మాసపత్రికనూ, పిరమిడ్ సొసైటీ యొక్క ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలనూ క్రమం తప్పకుండా చదువుతున్నాను.

" ధ్యానాంధ్రప్రదేశ్ " లోని బ్రహ్మర్షిపత్రీజీ సందేశాలు, సీనియర్ మాస్టర్స్ ఇంటర్వ్యూలు, ధ్యానానుభవాలు, క్రొత్త పుస్తకాల గురించిన విశ్లేషణలు చదవడం ద్వారా అన్ని కోణాలలో జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఆధ్యాత్మికంగా ఉన్నతమార్గంలో పయనిస్తున్నాను.

" ధ్యాన జగత్ " ధ్యాన ప్రచారంలో భాగంగా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందజేస్తోన్న " ధ్యానాంధ్రప్రదేశ్ "కి నా వంతు సహాయం అందజేయాలని 25,000/- విరాళంగా ఇచ్చాను. ఈ పత్రికను అందరూ చదివి, ఆత్మజ్ఞానం పొందడం ద్వారా ప్రేమతత్వాన్ని పొంది, జీవితాన్ని ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 

G. సునీత
కూకట్‌పల్లి, హైదరాబాద్
సెల్ : +91 94410 41580

Go to top