" మనకు మనమే గురువులం "

 

నా పేరు పరిణితా పత్రి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ధ్యానం చేస్తున్నాను. రోజుకు రెండు గంటలు తక్కువ కాకుండా ధ్యానం చేసేదాన్ని. నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి. అందులో ముఖ్యమైనవి మాస్టర్ రజనీష్ మరి మాస్టర్ జీసస్ లతో.

ఒకరోజు మాస్టర్ రజనీష్ ధ్యానంలో కనిపించి "డిసెంబర్ 25, 1993 రోజు జీసస్ నీకు కనిపిస్తాడు" అని మెస్సేజ్ ఇచ్చారు. ఆ రోజు అంటే డిసెంబర్ 25, 1993 రోజు కర్నూలు బుద్ధా పిరమిడ్‌లో కింగ్స్ ఛాంబర్ పై కూర్చుని ధ్యానం చేస్తూంటే మాస్టర్ జీసస్ వచ్చారు. సంభాషణ అంతా ఇంగ్లీషులో ఇలా సాగింది.

ప్రశ్న : "నా మూడవకన్ను ఎప్పుడు ఉత్తేజితం అవుతుంది?"

జీసస్ : "నీ జీవిత ధ్యేయం అది కాదు. మూడవకన్ను అనేది తగిన సమయంలో తనంతట తాను ఉత్తేజితం అవుతుంది."

ప్రశ్న : "మరి నా జీవిత ధ్యేయం ఏమిటి?"

జీసస్ : "నీ జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసి నువ్వు ఎన్‌లైటెన్‌ అయ్యి మిగిలినవారిని ఎన్‌లైటెన్ చెయ్యాలి."

ప్రశ్న : "పత్రిసార్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?:"

జీసస్ : "ఆయన తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితం చేసి ఎంతో అద్భుతంగా బోధిస్తున్నాడు. ఒకవేళ నేను జన్మంటూ తీసుకోవల్సి వచ్చి వుంటే ఆయన ఏం చేస్తున్నాడో నేనూ అలాగే చేసి వుండేవాడిని."

పిరమిడ్ ధ్యానులందరికీ నా సందేశం ఏమిటంటే ధ్యానంలో కనిపించిన మాస్టర్స్ అందరితో విధిగా మాట్లాడలి. మాస్టర్స్‌తోనే అన్ని సందేహాలు అడిగి తెలుసుకోవాలి. మన గురువులు మన లోపలే వున్నారు.

 

పరిణితా పత్రి

Go to top