" పుట్టపర్తిలో ఆనాపానసతి "

 

నా పేరు S.M.వలీ. మాది ధర్మవరం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తిలో ఆనాపానసతి ధ్యాన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలనీ, అదీ భగవాన్ పుట్టపర్తి సాయిబాబా గారి జన్మదిన వేడుకలలో నిర్వహించాలనీ చాలా కోరికగా వుండేది. ఇదే విషయాన్ని ప్రశాంతి నిలయంలోని కార్యనిర్వహకులలో ముఖ్యులు శ్రీ M.N.రెడ్డి గారికి తెలియజేశాను. వారు వెంటనే సమ్మతించి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో "గోపురం రోడ్"లో ఆనాపానసతి ధ్యాన అభ్యాసం కోసం ఒక హాల్‌ని కేటాయించారు.

18-11-2006 న ప్రముఖ కార్డియాలజిస్ట్ Dr. గోపాలరెడ్డిగారు ధ్యాన శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఎనిమిదిరోజులపాటు నిర్వహించిన శిక్షణా శిబిరంలో 25,000 మంది ధ్యాన శిక్షణా శిబిరాన్ని సందర్శించి ఆనాపానసతి ధ్యానభ్యాసం చేశారు. ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సహకారంతో శిక్షణా శిబిరం దిగ్విజయంగా జరిగింది. ధ్యాన శిక్షణా శిబిరానికి వచ్చిన దేశ, విదేశీయులలో కొందరి ధ్యానానుభవాలు ...


" దేనికోసం అయితే వెదుకుతున్నానో అది దొరికింది "

"నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక అన్వేషణలో వున్నాను. అదృష్టం కొద్దీ పుట్టపర్తిలో ఉచిత ధ్యాన శిక్షణా శిబిరాన్ని సందర్శించాను. ప్రస్తుత వర్తమాన మానవుడికి అత్యవసర వస్తువు ధ్యానం తప్ప మరేదీ లేదని నిక్కచ్చిగా తెలుసుకున్నాను. ఇప్పటినుంచే ధ్యానం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. దేనికోసం అయితే వెదుకుతున్నానో అది దొరికింది. మీరు లూథియానా వచ్చినప్పుడు మా గ్రామాన్ని కూడా దర్శించగలరు."

సురేష్ షాహి, లూథియానా


" పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానం అద్భుతం "

"నేను నా భార్య గత ఎనిమిది సంవత్సరాల నుంచి పుట్టపర్తిలో వుంటున్నాం. T.V.లో 'పిరమిడ్ స్పిరిచ్యువల సొసైటీస్'వారి ప్రకటన చూశాను. వెంటనే వెళ్ళి ధ్యానం గురించి, పిరమిడ్ శక్తిని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. అక్కడే ధ్యాన శిక్షణ తీసుకున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరంలోంచి ఏదో బయటికి రావాలని ప్రయత్నిస్తున్న ఉలికిపాటు అనుభవాన్ని పదే పదే పొందడం జరిగింది. పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానం అద్భుతం. వెంటనే పిరమిడ్, క్యాసెట్స్, బుక్స్ కూడా కొన్నాను.

 యాండ్రీ


" స్పిరిచ్యువల్ ఇండియా' మ్యాగజైన్ చాలా బాగుంది "

"పిరమిద్ ధ్యానం అద్భుతం. దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఇది అద్భుత మార్గం. ధ్యానం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో చాలా సూటిగా పాంఫ్లెట్స్‌లో వున్నాయి. ఇటువంటి విషయాలు అందరికీ చాలా అవసరం. 'స్పిరిచ్యువల్ ఇండియా' మ్యాగజైన్ చాలా బాగుంది."

 ధనా, హాలెండ్


" ఆధ్యాత్మికతలో మరింత ఉన్నతిని సాధించాలన్న తపన కలుగజేసింది "

"నా పేరు విలియం రిచర్డ్స్. 'పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్'వారు నిర్వహించిన ఉచిత ధ్యాన శిక్షణా శిబిరాన్ని సందర్శించాను. అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు రెండు కనుబొమల నడుమ ఏదో తెలియని ఒత్తిడి, మసక మసకగా కలర్స్... రూపాలు... ఉన్నట్లుండి ప్రతీదీ స్పష్టంగా కనబడసాగింది. ఆశ్చర్యం.. అద్భుతం... క్రొత్త క్రొత్త ప్రదేశాలు. ఎప్పుడూ చూడనివి... నిజంగా పిరమిడ్ శక్తి అద్భుతం. పిరమిడ్ శక్తి యొక్క అవగాహన, ధ్యానం యొక్క అవశ్యకత ప్రతి ఒక్కరికీ ఎంతైనా అవసరం. ఈ అనుభవం నాలో ఆధ్యాత్మికతలో మరింత ఉన్నతిని సాధించాలన్న తపన కలుగజేసింది."

 విలియం రిచర్డ్స్, రష్యా


" ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది "

"నేను న్యూజిలాండ్‌లో వుంటున్నాను. పుట్టపర్తిలో బాబా దర్శనానికి వెళుతున్నప్పుడు అక్కడ నిర్వహించిన ఉచిత పిరమిడ్ ధ్యాన శిక్షణా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ధ్యానం నాకు మహా ఆనందాన్ని కలుగజేసింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శరీరం తేలికగా అనిపించడం శక్తిప్రవాహం యొక్క అనుభవాన్ని పొందడం జరిగింది. ఇంకా అక్కడ ప్రదర్శించిన 'స్పిరిచ్యువల్ రియాలటీ' షో పూర్తిగా చూశాను. ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది."

మెరీనా, న్యూజిలాండ్


" ధ్యానం ద్వారా ఏ రోగాన్నైనా నయం చేసుకోవచ్చునని "

"బాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చినప్పుడు 'ధ్యాన శిక్షణా శిబిరాన్ని' చూశాను. నాకు అలర్జీ ఉంది. ఊపిరి ఆడదు. గత రెండు సంవత్సరాల నుంచి అవస్థ పడుతున్నాను. ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు శ్వాస సహజంగా ఆడడం జరిగింది. నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది... ధ్యానం ద్వారా ఏ రోగాన్నైనా నయం చేసుకోవచ్చునని."

ప్రదీప్ శర్మ, ఉత్తర్‌ప్రదేశ్


" ధ్యానంలో ఒక మెస్సేజ్ వచ్చింది "

"నేను మెడిసిన్ చదువుతున్నాను. బాబా దర్శనానికి పుట్టపర్తి వచ్చాను. ధ్యానం పాంఫ్లెట్స్ చదివాను. విషయాలు చాలా బాగా అనిపించాయి. శిబిరంలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో ఒక మెస్సేజ్ వచ్చింది. ఏమిటంటే 'Activate the body endorphins' (endorphins means body`s own healing mechanism)."

 శోభాలాల్, కోల్‌కత్తా


" ఆనాపానసతి ధ్యానం చాలా సులభంగా వుంది "

"నేను హృదయం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేదాన్ని. 'నో మైండ్ స్టేట్'కి వెళ్ళడం చాలా కష్టంగా వుండేది. కానీ ఈ ధ్యానం చాలా సులభంగా వుంది. దీని ద్వారా ఆలోచనారహితస్థితికి చేరుకోవడం చాలా సులభం. నాకు తెలిసిన వారందరికీ హృదయం మీద ధ్యాస పెట్టి అభ్యాసం చేయించేదాన్ని. ఇక నుంచి నలుగురికీ దీన్నే నేర్పిస్తాను."

Y.లైలా
చెన్నై


" ధ్యానంలో నేను బాబాను దర్శించాను "

"బాబా దర్శనానికి వచ్చాను. ధ్యానం పాంఫ్లెట్స్ చూశాను. ఇంకా వివరంగా తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో నేను బాబాను దర్శించాను. నా ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి ధ్యాన జ్ఞాన అవగాహనా సదస్సులు, శిబిరాలు మా ఒరిస్సాలో కూడా నిర్వహిస్తే మా మిత్రులందరికీ తెలుస్తుంది."

తపన్క్‌నాయక్
ఒరిస్సా


 

K. రమేష్‌బాబు
ధర్మవరం

Go to top