" కర్మలు తీసుకోగలవా? "

 

మాస్టర్ జీసస్ క్రైస్ట్‌‍తో నాకున్న అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు హీలింగ్ నేర్పించిన వారు జీసస్ క్రైస్ట్. నేను ధ్యానం మొదలుపెట్టిన ఆరు నెలల తర్వాత ఆయనే స్వయంగా వచ్చి హీలింగ్ చెయ్యడంలో వుండే మెలకువలన్నీ నేర్పించారు. అంతకుముందు ఆయన నన్ను ఈ విధంగా ప్రశ్నించారు.

"నువ్వు ఎదుటివాళ్ళకు హీలింగ్ చేసేటప్పుడు వాళ్ళ కర్మలను తీసుకోగలవా?"

"అటువంటి కర్మలు తీసుకున్నప్పుడు వచ్చే పర్యవసానాలకు భయపడకుండా వుండగలవా?"

ఈ ప్రశ్నలకు నేను "సరే" అన్నాను. నేను అప్పటికి నేర్చుకున్న జ్ఞానం వల్ల, ధ్యాన అనుభవాల వల్ల భయపడే అవసరం లేదనిపించింది. ఆ మరుసటి రోజు ధ్యానంలో మళ్ళీ జీసస్ వచ్చి హీలింగ్ గురించి మరింతగా విశదీకరించారు.

 

స్వర్ణమాలా పత్రి

Go to top