" ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఐర్లండ్ "

 

నా పేరు లీలావతమ్మ. గొంట్ల శివప్రసాద్ మరి ఉషారాణి గార్ల ద్వారా 1998 సంవత్సరంలో ధ్యానంలోకి ప్రవేశించాను. ధ్యానంలోకి రాకముందు శివబాలయోగి గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. ఆయన సమాధి తర్వాత ఆయన పత్రి గారి రూపంగా మరి నన్ను అనుసరించమని చెప్పారు. ఆ రోజు నుంచి పిరమిడ్ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం ద్వారా నేను అనేక లాభాలు పొందాను. అందులో ముఖ్యమైనవి:

* ఆరోగ్యం బాగుపడింది. అంతకుముందు B.P. వుండేది. అది పూర్తిగా తగ్గిపోయింది.

* కాళ్ళవ్రేళ్ళు, చేతి వ్రేళ్ళు పగిలి రక్తం వచ్చేది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది.

* మనశ్శాంతిగా, ఆనందంగా వుంది.

* అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలి. అందుకు తుది శ్వాస వరకు అందరికీ శ్వాస మీద ధ్యాస ఉంచమని చెప్తాను.

* నాకు అద్భుతమైన దివ్యనేత్ర అనుభవాలు వచ్చాయి. అనేకమంది మునులను ఋషులను దేవతలను దేవుళ్ళను చూసాను. వారి ద్వారా ఎన్నో సందేశాలను విన్నాను.

* అమర్‌నాథ్, మానససరోవరం, కైలాసం, నక్షత్రలోకం, సూర్యలోకం, గిజాపిరమిడ్‌లను ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా చూసాను.

* దివ్యనేత్ర అనుభవాలు, ఆస్ట్రల్ ట్రావెల్ అనుభవాలు నాకు ఎంతో ఎదుగుదలను, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇచ్చాయి.

* ఒకే సిట్టింగ్‌లో ఐదు గంటలు ధ్యానం చేస్తాను. తప్పనిసరిగా ప్రతిరోజు ఐదు గంటలు ధ్యానం చేస్తాను.

* నేను చదివిన ప్రతి పుస్తకం ఇతరలకు ఇచ్చి చదవమని చెప్తాను.

* నేను వెళ్ళిన ప్రతిచోటా ధ్యాన కరపత్రాలను పంచుతాను.

శివబాలయోగి పిరమిడ్ ధ్యానమందిరంలోని ధ్యానుల అనుభవాలు :

* ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఒకరికి, ఐదు సంవత్సరాల నుంచి ఒకరికి సంతానం కలగలేదు. ధ్యానం ద్వారా వారికి సంతానం కలిగింది.

* ఒకసారి మా అమ్మాయిని చూడాలనిపించినప్పుడు పత్రిసార్ ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా ఐర్లండ్ తీసుకెళ్ళి మా అమ్మాయిని చూపించారు. నేను మా అమ్మాయి వేసుకున్న డ్రస్.. చుట్టూ హాస్పిటల్‌లో వున్న పరిసరాలు.. ఇంగ్లీష్ డాక్టర్లు వాళ్ళందరినీ చూసి తర్వాత మా అమ్మాయికి ఫోన్ చేసి తాను వేసుకున్న డ్రస్ చుట్టూ వున్న పరిసరాల గురించి తెలిపాను. అన్నీ కరెక్టుగానే వున్నాయి. అప్పుడు నాకు కలిగిన ఆనందం వర్ణించలేనిది.

* ప్రతిరోజు ఉదయం 11.00 నుంచి 12.00 వరకు సాయంత్రం 7.00 నుంచి 8.00 వరకు ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నాం.

* మేము ధ్యానం చేయడమే కాక అందరం కలిసి ధ్యాన ప్రచారం చేస్తున్నాం.

 

 

లీలావతమ్మ
తాడిపత్రి

Go to top