" పిరమిడ్‌లో ధ్యానం చేస్తే రోగాలు తొందరగా తగ్గుతున్నాయి "

 

నా పేరు రాజసింహారెడ్డి. నేను L.I.C లో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా సికింద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతోంది. ధ్యానంలోకి రాకముందు మూడు సంవత్సరాలక్రితం డిస్కవరీ ఇంగ్లీష్ ఛానెల్‌లో హంటింగ్ ... వేటాడటం... ప్రోగ్రామ్ చూడటం వలన జంతువుల పట్ల ప్రేమ కలిగింది. ఆ రోజు నుంచి మాంసాహారం మానివేసాను. అప్పటినుంచి నాలో ఏదో మార్పు వచ్చింది. ఈ జన్మలో ఏదో చేయాలని. సెప్టెంబర్ 15, 2002 లో పత్రిసార్ క్లాస్‌కి అటెండ్ అయ్యాను. ఆ రోజే నా జీవితానికి సరియైన మార్గం దొరికింది. ధ్యానం అంటే ముసలితనంలో టైమ్‌పాస్ కోసం అనుకున్నాను. కానీ, ధ్యానం అన్నది మూడు సంవత్సరాల వయస్సు నుంచే అందరికీ తప్పనిసరి అని తెలుసుకోగలిగాను. ఈ ధ్యానం అందరికీ అవసరం. జీవితం ఆనందంగా గడపాలన్నా, కష్టసుఖాలను సమానంగా అనుభవించాలన్నా ప్రతిఒక్కరూ ధ్యానం తప్పనిసరిగా చేయాలి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి సంపాదించాను. నాకు ప్రతి సంవత్సరం జలుబు కానీ, జ్వరం కానీ వస్తూండేది. నేను రెగ్యులర్‌గా ధ్యానం చేయడం వలన ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను.

ఎవరి రోగాలకు వారే కారణం అని తెలుసుకోగలిగాను. మానవజన్మ విలువ తెలుసుకోగలిగాను. అన్ని ప్రాణులకంటే మానవజన్మ గొప్పది మరి ఉత్తమమైనది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకోగలిగాను. అంతకుముందు నేను 'రాజసింహారెడ్డి' అనుకునేవాణ్ణి. తర్వాత నేను 'నేను ఆత్మపదార్ధం' అని తెలుసుకోగలిగాను. మనం మన డ్రెస్‌ని మూడు సంవత్సరాలు తొడిగి వదిలిపెట్టినట్లు ఆత్మ కూడా శరీరాన్ని కొన్ని సంవత్సరాలలో వదిలిపెట్టేసి క్రొత్తశరీరం తీసుకుంటుంది. అది చేసిన కర్మల ఆధారంగా తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. శరీరాన్ని సుఖపెట్టడానికి ఎంతో కష్టపడుతున్నాం. ఇరవైనాలుగు గంటలూ సమయం వెచ్చిస్తున్నాం. ఇది అశాశ్వతం అని తెలిసింది. ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆత్మకు సంబంధించిన పనులు చెయ్యాలి.

నేను పత్రిసార్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నేను ఉద్యోగంలో ఎక్కువ గంటలు పనిచేయగలుగుతున్నాను. పని పైన ఏకాగ్రత పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతున్నాను. మా డివిజన్‌లో డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అందరికీ ఒక కాంపిటేషన్ పెడితే, ఆ కాంపిటీషన్‌లో నేను ఒక్కడినే గెలిచాను. నాకు అప్పుడు అర్థమైంది ధ్యానం ద్వారా 'A to Z' లాభాలు పొందవచ్చని.

నేను ధ్యానంలోకి వచ్చిన మరుసటిరోజు నుంచే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. మొదటగా మా తల్లిదండ్రులను ధ్యానం క్లాసుకు తీసుకువెళ్ళాను. మా అమ్మకు ఎన్నో రోజుల నుంచి తగ్గని కాళ్ళ మరి కీళ్ళ నొప్పులు రెండురోజుల్లో తగ్గిపోయాయి. మా నాన్నగారు కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. అప్పటినుంచి రోజూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. నాకు భార్య, ఇద్దరు కుమారులు. మాది ధ్యాన కుటుంబం. మా కుటుంబం మొత్తం మాంసాహారాన్ని మానివేసాం. స్వగృహం సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో వుంది. పిరమిడ్ కూడా కట్టించాం. దానిపేరు "ధర్మా పిరమిడ్ ధ్యానకేంద్రం". పిరమిడ్‌లో ధ్యానం చేస్తే రోగాలు తొందరగా తగ్గుతున్నాయి. ధ్యానం కూడా బాగా కుదురుతుంది. పిరమిడ్ ప్రతి ఇంటికీ, ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరమని తెలిసింది. ఇక్కడ ధర్మా పిరమిడ్ ధ్యానకేంద్రంలో అరవై శనివారాలు, అరవైమంది సీనియర్ మాస్టర్లతో క్లాసులు నిర్వహిస్తున్నాం.

 

V. రాజసింహారెడ్డి
హైదరాబాద్
సెల్ : +91 92465 07819

Go to top