" నేను నీకు అండగా వుంటాను "

 

నా పేరు నాగరత్నమ్మ, మాది తాడిపత్రి. ధ్యానంలో పెద్దరాయి తలమీద పడబోతూ వుంటే నేను అలాగే కూర్చున్నాను. బండ తలకు చాలా దగ్గరగా వచ్చింది. నేను లేవలేదు. తర్వాత నా తలకు బండకు మధ్యలో ఏడుశిరస్సుల నాగేంద్రడు అడ్డంగా వచ్చాడు. ఆయన రెండో శిరస్సు మీద నుంచి బండ క్రింద పడిపోయింది. "మాస్టర్, మీకు దెబ్బ తగిలిందా" అని అడిగాను. ఆయన "నాకేం తగలదు. నువ్వు ఇలాగే ధ్యానం చెయ్యి. నేను నీకు అండగా ఉంటాను" అని చెప్పారు. ఈ అనుభవం నాకు లీలావతి మేడమ్ ఇంట్లో శివబాలయోగి పిరమిడ్ కేంద్రంలో కలిగింది. నాకు ధ్యానం ద్వారా జరగబోయే ప్రమాదాలు కూడా తప్పాయి. ధ్యానం ద్వారా నేను ఆరోగ్యంగా, ఆనందంగా కూడా వున్నాను.

 

నాగరత్నమ్మ
తాడిపత్రి

Go to top