" నా జన్మ తరియించె "

 

నా పేరు విమలకుమారి. ఏలూరు పట్టణం, పశ్చిమగోదావరి జిల్లా. నేను నా సహాధ్యాయిని T.విజయలక్ష్మి గారి ద్వారా 2005 ఫిబ్రవరి నుంచి ధ్యానంలోకి రావటం జరిగింది. పత్రీజీ ఏలూరు వచ్చినప్పుడు వారి సందేశం వినడం జరిగింది. మొదటిసారి 45 నిమిషాలు ధ్యానం చేయించారు. తర్వాత నాలుగైదుసార్లు పత్రీజీ క్లాసులకు వెళ్ళటం, ధ్యానం చేయడం జరిగింది. "ఆయనే నెను వెతుకుతున్న గురువు గారు" అనిపించింది. ఈ రెండు సంవత్సరాల ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందటం జరిగింది.

ధ్యానం చేస్తున్న మొదట్లోనే సోక్రటీస్‌ను చూడటం జరిగింది. మొదట్లో పది నిమిషాలు ధ్యానం చేయడం జరిగింది. ప్రస్తుతం రెండు గంటలు చేస్తున్నాను. ధ్యానం వలన నా మోకాలి నెప్పులు తగ్గాయి. మనశ్శాంతిని పొందాను. పత్రీజీతో ఎక్కువుగా మాట్లాడాలని వుంటుంది. సార్‌ని చూడగానే మాట్లాడలేకపోతాను. ఇంత గొప్ప ధ్యానం అందరికీ తెలియజేసిన పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ద్వారకాతిరుమలలో మూడురోజుల సంగీత ధ్యానయజ్ఞంలో పాల్గొన్నాను. అంతులేని ఆత్మజ్ఞానాన్ని పొందాను. ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చాలా జ్ఞానాన్ని బోధించారు. చాలా ఆనందాన్ని పొందాను. ఇంత మంచి ధ్యానయజ్ఞం నిర్వహించి ఎందరికో ఆత్మజ్ఞానాన్ని, ఆనందాన్ని అందించిన పత్రీజీ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ధ్యానం మొట్టమొదట అయిష్టంగా పది నిమిషాలు చేసేదాన్ని. కానీ, తర్వాత దాని విలువ తెలుసుకుని"ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత ఎక్కువ ఆత్మజ్ఞానం వస్తుంది" అని గ్రహించాను. డబ్బు మీద అసలు వ్యామోహం లేకుండా.. ధ్యానం తాము ఒక్కరే చేసుకోకుండా... అందరూ ధ్యానం చేసుకుని ఆత్మజ్ఞానం పొందాలనీ, అందరూ బాగపడాలనే కాన్సెప్ట్‌తో ధ్యానప్రచారమే తన జీవిత పరమావధిగా భావించిన నిస్వార్ధ సేవాతత్పరుడైన పత్రిసార్‌కి శతకోటి నమస్కారాలు. పుత్రశోకం, మానసిక అశాంతి వున్న నాకు ఈ ధ్యానం ఎంతో శాంతిని ప్రసాదించింది. నా తోటివారికి ధ్యానం చెప్తూ, ప్రచారం చేయిస్తున్నాను. పత్రీజీ చెప్పిన విషయం అరటిపండు వొలిచి పెట్టినట్లుగా అర్థమవుతుంది. ఆయన వేణువు వాయిస్తూంటే వచ్చే అనుభూతి చెప్పనలవి కాదు. నా జీవితమంతా ధ్యానం చేస్తూ, ధ్యానం చెప్తూ గడుపుతాను. ధ్యానయోగి, జ్ఞానయోగి, సంగీతయోగి, బ్రహ్మర్షి పత్రీజీకి కోటానుకోట్ల వందనాలు.

పుత్రశోకం, మనశ్శాంతి లేక నేను

సద్గురువుకూ వెదుకుచుండగా

బ్రహ్మర్షి పత్రీజీ గురువుగా లభించె

ఆహా, ఏమి నా భాగ్యము.

నేటికి నా జన్మ తరయించె.

 

 

J.విమలకుమారి
C/o.j.రామగోపాలం, ఫైర్ స్టేషన్ స్ట్రీట్ ఎదురుగా, N.R.పేట
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా

Go to top