" నేనే భగవత్ పదార్థం "

 

ధ్యానంలోకి రాకముందు "నేనే అంటే కేవలం మనిషిని" అనుకునేదాన్ని! కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమయింది, "నేనే భగవత్ పదార్థం" అనే విషయం. నేను ధ్యానం చేయకముందు ఏం చేయాలన్నా "నేనేం చేయగలను?"అనుకునేదాన్ని. ఇప్పుడు నాలో నేను జరిపే అద్భుతాలు చూసి ఆశ్చర్యం వేస్తోంది.

నేను ధ్యానం చెయ్యటం మొదలుపెట్టాక ఆరోగ్యసమస్యలు, మానసిక ప్రశాంతత, ఇలాంటి కొన్ని మార్పులతో పాటుగా, ముందెన్నడూ వేటిద్వారానూ పొందని ఆనందం నాలోంచి ఉప్పొంగేది. జాలి, దయ లాంటివి కలిగి, కఠినత్వం పోయింది. తర్వాత "నేనెవరో తెలుసుకోవాలి" అన్న తపన మొదలైంది. గంటలకొద్ధి ధ్యానస్థితిలో గడిపేదాన్ని! నాలో ఎన్నో ప్రశ్నలు. అన్నింటికీ సమాధానాలు నాలోనే దొరికాయి. ఈ వాక్కు సమయం అనే వాటిని చాలా చక్కగా వినియోగించుకోవాలి తెలుసుకోగలిగాను.

అన్నింటితో స్నేహం చేస్తూ స్వాగతం చెవుతూ నిర్గుణస్థితికి చేరుకున్నాను! ఇప్పుడు నా జీవితం నా చేతిలో ఉంది అని తెలుసుకున్నాను!

నేను "పరాధేనత" నుంచి "స్వాధీనత, స్వతంత్రం"వైపుకు వచ్చి "స్వశక్తిమీద అద్భుతంగా జీవించగలను!" అని తెలుసుకున్నాను.

మన ఉనికితో వర్తమానంలో ఉండగలగటమే సర్వస్వం అనే జ్ఞానం పొందాను. ఇంతటి గొప్ప విద్య అయిన "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి ఆనంద పత్రీజీ గారికి నా ఆనంద ప్రణామాలు!

ఆధ్యాత్మికంగా ఎదిగేవాళ్ళ అనుభవాలు వింటూంటే ఆయన కళ్ళల్లో ఆనందం చూసి అనుకున్నాను.. ప్రతి ఒక్కరూ ఆయనికిచ్చే బహుమానం ఆత్మజ్ఞానులుగా ఎదగడమే అని! పత్రీజీగారు చేస్తున్న ఈ ధ్యాన జైత్రయాత్రలో నేనొక శకలమైనందుకు నాకు ఆనందంగా వుంది.

 

 

లత
పుత్తూరు

Go to top