" ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి "

 

మారం శివప్రసాద్ : "స్త్రీలు పురుషులను అధిగమించే కాలం వచ్చిందని అనిపిస్తోంది ప్రస్తుతం" యువతరం పోకడ" చూస్తుంటే..కామెంట్ ప్లీజ్!"

శ్రీనివాసరెడ్డి : "వచ్చేకాలం అంతా Divine Feminine Energy డివైన్ ఫిమినేన్ ఎనర్జీ! అయితే వేల సంవత్సరాలుగా మాస్క్యులైన్ ఎనర్జీ ఫిమినైన్ ఎనర్జీని డామినేట్ చేసింది. చరిత్ర అంతా దాదాపు అంతే!"

మారం శివప్రసాద్ : "భగవంతుడు.. ఈ స్ఠితి పైన మీ నిర్వచనం?"

శ్రీనివాసరెడ్డి : "‘భగవంతుడు’ అంటే ‘అంగీకారం’ ‘అహంకారాన్ని’ ను త్యజించి వున్న స్థితి అంతా "దైవం"! అహం అంటే దేవుని మరచిపోవడం! ‘నేను’..‘నాది’ ‘నా కంట్రోల్’ అని భగవంతుడిని మరచి ప్రవర్తించడం అంటేనే ‘అహం’ అంటే!"

మారం శివప్రసాద్ : "మహాయోగులు ప్రజలు కర్మలను తమకు ట్రాన్స్ఫర్ చేసుకునే స్థితిని కలిగి వుంటారా?"

శ్రీనివాసరెడ్డి : "కర్మలను తీసివేయడం అనేదే రాంగ్ పాయింట్! అంతే!"

మారం శివప్రసాద్ : "యోగీశ్వరుల, మహర్షల, బ్రహ్మర్షుల వాక్కు ప్రతిఫలిస్తుంది అని అనుకోవచ్చా!"

శ్రీనివాసరెడ్డి : "మాస్టర్స్ యొక్క సామర్థ్యం, పౌనఃపున్యం, శక్తిస్థాయిలు అన్నవి ఎంత ఎక్కువగా ఎదుగుతూ వుంటే వాళ్ళు అంతగా నేచర్‌తో అనుసంధానం అయివుంటారు.

"నిర్దోషం గా వుంటుంది ఆ వాక్కు! మైండ్‌తో ఆలోచిస్తే కుదరదు అక్కడ! అసలు ‘మైండ్ ప్లే’ వుండదు అక్కడ! పరిమితం నుంచి అపరిమితాన్ని ఎప్పటికీ తెలుసుకోలేం."

మారాం శివప్రసాద్ : "వాక్కులు నిర్దోషం గా వుండడానికీ, ప్రకృతితో అనుసంధానంగా వుండడానికీ అంటే ప్రకృతిలో ఏకత్వంలో వుండడానికీ, ఏఏ సూత్రాలు ఫాలో అయివుంటారు ఈ మాస్టర్స్?"

శ్రీనివాసరెడ్డి : "గురువు ఏం చేశాడో అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. గురువు చెప్పింది చేస్తూ వుండాలి." మూడు విషయాలను సాధకులు పాటించాలి.

1. గౌరవం : గురువు ముందు, వెనక, లోపల, బయట అంతరం & బాహ్యంలో గురువును గౌరవించాలి. అన్ని సందర్భాలలో కూడా! ఎక్కడా గురువు గురించి పొరపాటుగా కాని, తప్పుగా కాని మాట్లాడకూడదు. ఇన్నర్‌లో కూడా అంగీకారంలో వుండాలి కానీ, ఎందుకు ఇలా చెప్పారు అనే ప్రశ్నలు వుండకుండా, చెప్పింది చేస్తూ పోవాలి!

2. ప్రతిస్పందన : అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. గురువుకు దూరంగా వుండి ‘గురువు ఏమీ చేయలేదు’ అనకుండా, నువ్వు అర్థం చేసుకోవాలనుకున్న విషయాన్ని వినయంగా అడిగి, తెలుసుకోవాలి! ఎప్పుడూ దేనికీ గురువును నిందించడం కానీ, విమర్శంచడం కానీ వుండకుండా జీవించాలి!

3. నిజమైన వ్యక్తీకరణ: ఏదీ.. గురువుని ‘ఎదురుగా వున్నాడు’ అని అడగడం కాకుండా, నిజంగా నీకు కావలసింది ‘గురు ముఖతః’ తెలుసుకోవాలి. ‘నా ప్రశ్నలలో ఇది నన్ను వుక్కిరి బిక్కిరి చేస్తోంది.నాకు దీని గురించి స్పష్టత కావాలి’ అని చక్కగా, వినయంగా అడిగి తెలుసుకోవాలి.

అప్పుడు పరస్పర అనుబంధం శాశ్వతంగా వుంటుంది. గురువుల దగ్గర మనం ఇలా ప్రవర్తిస్తే!"

మారం శివప్రసాద్ : "సంకల్పశక్తి గురించి చెప్పండి!"

శ్రీనివాసరెడ్డి : "విశ్వశక్తి అన్నది మనస్సు యొక్క జీరో స్టేటస్ ద్వారానే మనలోకి ఆవాహనం అవుతుంది. మెడిటేషన్‌ని సాధారణంగా మనలోకి ఫ్లో అయ్యే ఎనర్జీ పోల్చుకుంటూ వుంటారు. అయితే ఎనర్జీ ఫ్లో అయ్యేది వృధా కాకుండా చూసుకోవాలి మనం. లీక్స్ వుండకూడదు. మనం ఏదైనా సంకల్పాన్ని చేసినప్పుడు, ఆ సంకల్పం కార్యరూపం దాల్చాలంటే విశ్వశక్తి అన్నది వృధా కాకుండా చూసుకోవాలి. అలా శక్తి నష్టం కాకుండా, లీకేజ్ లేకుండా వుండాలంటే అనవసరమైన వాగ్దానాలు చేయకుండా వుండాలి! ఉబుసుపోక కబుర్లు మానాలి. అప్పుడు గాప్స్ తగ్గిపోయి, సంకల్పాలు సిద్ధిస్తాయి.

"ఎప్పుడూ అనవసరమైన వాటికి వర్రీ అవుతూంటారు మనుష్యలు. మనిషి జరిగిపోయిన దాని గురించి కానీ, భవిష్యత్ గురించి కానీ అదేపనిగా ఆలోచిస్తూ వుంటే, ఎనర్జీ వృధా అవుతూ వుంటుంది.

"ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి. మన సంకల్పాలు అప్పుడు వెంటవెంటనే ఫలిస్తూ వుంటాయి. అప్పుడు టైమ్ గ్యాప్ తగ్గిపోతూ, సంకల్పాలు సిద్ధిస్తాయి. 2012 లో చూడండి! మీరు ఆలోచించే ఆలోచన వెంటనే కార్యరూపం దాలుస్తుంది. ఎందుకంటే ఎనర్జీ లెవల్ అప్పుడు ఎక్కువగా వుంటుంది కనుక. మనస్సు యొక్క కేంద్రీకరణ అన్నది సరిగ్గా వుంటే, సంకల్పం స్పష్టంగా వుంటే, గ్యాప్ మరింత తగ్గిపోతూ, సంకల్పాలు సకలం సిద్ధిస్తూ వుంటాయి."

మారం శివప్రసాద్ : "‘డబ్బు’ అదే ‘మనీ’ పైన మీ అభిప్రాయం?

శ్రీనివాసరెడ్డి : "‘మనీ’... మన అవసరాలకు సరిపోయే డబ్బు మనకంటే చాలు! డబ్బుని ఆధ్యాత్మిక దృక్పథంతో చూడాలి."

మారం శివప్రసాద్ : "‘జడ్జిమెంట్’ గురించి ఒక ఉదాహరణ ఇవ్వండి సార్!"

శ్రీనివాసరెడ్డి : "ఒక ఫామ్ హౌస్ లో ఒక తండ్రి,కొడుకులు వుంటారు. వారివద్ద ఒక గుర్రం వుంటుంది. ఒకరోజు ఆ గుర్రం ఆ ఫార్మ హౌస్‌లో నుండి దగ్గరలో వున్న అడవిలోకి పారిపోతుంది. కొడుకు దిగులు చేస్తూ వుంటాడు, దురదృష్టం అనుకుంటాడు. తండ్రి మాత్రం "పోతే పోనీరా! ఏం చేస్తాం! దాన్ని స్వీకరించు!" అంటాడు.

"ఒకవారం తరువాత ఆ గుర్రం మరొక అయిదు గుర్రాలను వెంటపెట్టుకుని వస్తుంది. ఆ కొడుకు ఆనందానికి మేరలేదు. తండ్రి మాత్రం నిమిత్తమాత్రం గానే వున్నాడు. కొడుకు అదృష్టం అనుకుంటాడు.

"మరికొన్ని రోజుల తర్వాత ఆ కొడుక్కు కాలు ఫ్రాక్ఛర్ అవుతుంది. కొడుకు దిగులు పడుతూ వూంటాడు. మళ్ళీ దురదృష్టం అని అనుకుంటాడు. తర్వాత ఆ రాజ్యం పైకి మరొక శత్రురాజు పెద్దసైన్యంతో దండెత్తి వస్తాడు. అపుడు రాజు రాజ్యంలో వున్న యువకులందరూ యుద్ధంలో పాల్గొనాలని శాసిస్తాడు. రాజభటులు ఇల్లిల్లూ తిరిగి యువకులను తీసుకెళతారు. ఈ ఫార్మ హౌస్ యువకుడికి కాలు ఫ్రాక్చర్ అయినందుకు యుద్ధం చేయడానికి అనర్హుడని వదలి వెళతారు. అదృష్టం అనుకుంటాడతను. మరి నిన్నటి దురదృష్టం, ఇవాళ అదృష్టం అయింది.

"మంచి, చెడు అనేది మన అభిప్రాయాల్ని బట్టి వుండేదే! మనం మన ఫ్యామిలీని మేనేజ్ చేయడం ఒక ఎత్తు. మనవి మనం మేనేజ్ చేసుకోవడం ఒక ఎత్తు. ఒక సంస్థని లేదా కొన్ని వేలమందిని మేనేజ్ చెయ్యడం ఒక ఎత్తు. అన్నీ అనుభవానికి రావాలి. అప్పుడే తెలిసేది. ఒకడు మానవతావాది అయివుంటాడు. ఒకడు అహంభావిగా వుంటాడు. అందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క రోల్‌ప్లే చేసేవాడుంటాడు."

మారం శివప్రసాద్ : "మీరు ఆధ్యాత్మికత లోకి వచ్చిన తర్వాత అప్పటికి, ఇప్పటికి మీలో మీరు గమనించిన తేడా, మీరు పొందిన ప్రగతి మీ మాటల్లో?"

శ్రీనివాసరెడ్డి : "సహనం కష్టాలు వచ్చినపుడు గట్టిగా నిలుచున్నానని మరేమో అని కాదు కాని ఈ సహనం అనేది నేను పొందిన బిలియన్ డాలర్స్ సంపద."

మారం శివప్రసాద్ : "పత్రి మేడమ్" చెప్పారొకసారి! తనకు ఎప్పుడైనా ఏ విషయంలోనైనా క్లారిఫికేషన్ కావాలంటే మీతోనే డిస్కస్ చేస్తాను అని. సాధారణంగా ఎలాంటి చర్చలు వస్తూ వుంటాయి మీ ఇద్దరి భేటీల్లో!"

శ్రీనివాసరెడ్డి :" పత్రిమేడమ్‌వి అన్నీ ప్రాక్టికల్ అనుభవాలు. అన్నీ చూసేసింది ఆవిడ. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తేనే చెపుతాను. పత్రీజీ లా అన్ని విషయాలు మేము డిస్కస్ చేయం. ఫ్యామిలీ విషయాలైతే చాలా ముఖ్యమైనవి అయితే, మా చేతులు దాటిపోతే మాత్రమే ఆయనతో చెపుతాం. ఆయన సలహాలు కూడా చాలా అద్భుతంగా వుంటాయి. సాధారణంగా ఈ మధ్య ఆయన దృష్టికి తీసుకెళ్ళే సందర్భాలు తక్కువ. "

మారం శివప్రసాద్ : "ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు?"

శ్రీనివాసరెడ్డి : "నేను ఎన్నో పుస్తకాలు చదివాను. స్పిరిచ్యుయాలిటీ పై ఎంతో రీసెర్చ్ చేశాను. అయితే ఇదంతా నేను ఒక ప్రణాళికతో ఏమీ చేయలేదు. జస్ట్ అలా చదువుతూ, గమనిస్తూ, నోట్ చేస్తూ, నా కంప్యూటర్‌తో ఫీడ్ చేస్తూ పోయానంతే."

"ప్రస్తుతం పత్రీజీ మరి మా బావ న్యూటన్ -వీళ్ళ దృష్టి అంతా స్పిరిచ్యుయల్ యూనివర్సిటీ పైన వుంది.

" నా దృక్పథమంతా శాస్త్రీయమే! ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలను మొదలు పెట్టినట్లయితే నెను సిలబస్ మీద నా పని చేస్తాను. అన్నింట్లో నా విధానాన్ని ని నేను అందించగలను.

"కోర్సుని తయారు చేయడం గాని, వివిధ విభాగాలను ని తయారు చేయడం గాని, రూపుకల్పన చేయడం కానీ ఇలా!"

మారం శివప్రసాద్ : "ఒక" "స్వాధ్యాయ స్పెషలిస్ట్" గా ధ్యానులకు, ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సాధనా ఫల సారాంశాన్ని చెప్పండి!"

శ్రీనివాసరెడ్డి : " ఒక మేజర్ బుక్ రీడర్‌గా నేను ప్రజెంట్ మూమెంట్‍లో వుండడం నేర్చుకున్నాను. పాఠకులకు, ధ్యానులకు నేను చెప్పే ముఖ్యమైన అంశం కూడా ఇదే ...

1. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి! వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహనతో వుండండి!

2. ప్రతిరోజు మన దినచర్యను ధ్యానంతోనే ప్రారంభించాలి. మరల నిద్రించేటపుడు ఆత్మావలోకనం - మన గ్రోత్ ఎలా వుంది? ప్రగతి ఎలా వుంది అని మనలోపల మనం శోధించడం చేయాలి. ఈ రోజు సంతృప్తి వుందా! అలాగే ఈ రోజు ఏదైనా సమస్యని నీ స్వంత శక్తితో పరిష్కారం చేసుకున్నావా! నీ బలం ఏమో నీకు తెలియాలి. అపుడు నీగ్రోత్ ఎలా వుందో నీకు అర్థమవుతుంది. మన గురించి ఎవరైన ఏమైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్ పోతుంది క్రమంగా -దాంతో మనం ఒకరిపట్ల చేసే జడ్జిమెంట్ తగ్గిపోతుంది.

"ఎరుక ప్రేరణలు వుధృతమవుతాయి క్రమంగా. ఇది నా నిత్యసాధనలో పొందుతున్న అనుభూతి.

"మనం మన జ్ఞాపకశక్తిని ఉపయోగించుకోవాలే కాని, మన జ్ఞాపకాలు మనల్ని ఉపయోగించుకోకూడదు."

మారం శివప్రసాద్ : "చాలామంది పిరమిడ్ మాస్టర్లతో ధ్యానం చేస్తున్నాము కదా! ఇంకా బుక్ రీడింగ్ ఎందుకు అనే అపోహ వుంది. మీరు క్లారిపై చేయండి సార్!"

శ్రీనివాసరెడ్డి : "పుస్తకపఠనం వల్ల అందరి పాయింట్ ఆఫ్ వ్యూస్ తెలుస్తాయి. మెడిటేషన్ ఎంత ముఖ్యమైనదో, బుక్ రీడింగ్ అంత ముఖ్యం. ఓపెన్ మైండ్‌నెస్ రీజన్‌ని కరెక్టుగా ట్రేస్ చేయడం, రిఫైన్ చేయడం సాధ్యం అవుతుంది బుక్ రీడింగ్ వల్ల. ఇంటలెక్ట్, ఇన్‌ట్యూషన్ కరెక్టు వేలో వెళుతూ వుంటాయి. ఇవన్నీ కరెక్టుగా పనిచేసినా, ఇంటలెక్ట్ ఒకటి ఆప్సెంట్ అవుతే, మీగతావన్నీ మిస్ అవుతాయి. బుక్ రీడింగ్ వల్ల ఇంటలెక్ట్ మిస్ కాకుండా వుంటుంది. ధ్యానం సమగ్రమయ్యేది, బాలెన్స్ అయేది, పూర్ణమయేది బుక్ రీడింగ్ వల్లనే."

మారం శివప్రసాద్ : "న్యూఏజ్ స్పిరిచ్యువల్ బుక్స్" రీడింగ్ గురించి మరింత వివరంగా చెప్పండి సార్!"

శ్రీనివాసరెడ్డి : "ఒకచోట ఒక మాస్టర్ చెపుతాడు- ఓల్డ్ ఏజ్ స్పిరిచ్యువాలిటీ అంటే ‘గ్రహించటం’. న్యూఏజ్ స్పిరిచ్యువాలిటీ అంటే ‘ఇవ్వడం.. ఇవ్వడం’ న్యూ ఏజ్ బుక్స్ అంటే "న్యూ ఎనర్జీ"!

"ఉదాహరణకు -దీపక్‌చోప్రా చదువుతున్నాడు. ఒక 40 సంవత్సరాలు రీసెర్చ్ చేసివుంటాడు ఆయన. ఆయనకు ఒక లేటస్ట్ బుక్ వుందనుకోండి. ఆయన నలభై సంవత్సరాల "అవగాహనాసారం" అంతా ఆ పుస్తకం ప్రతిబింబిస్తూ వుంటుంది.

"మెడిటేషన్ - మరి న్యూఏజ్ పుస్తకాలు ఈ రెండు కూడా మానవజీవన వికాసం అత్యంత త్వరితగతిన చేకూరడానికి వుపయోగపడే లిఫ్ట్ మరి కంప్యూటర్లు అని చెప్పవచ్చు. అలాగే ఒక పిరమిడ్ యొక్క శక్తిని వుపయోగించుకోవడం ఒక మైక్‌లాంటిది.

"న్యూఏజ్ పుస్తకాలు చదివడం వల్ల ఎన్నో పాయింట్ ఆఫ్ వ్యూస్ ఓపెన్ అవుతాయి. వారి వారి అనుభవాలు, ప్రేరణలు, సాధనల జస్ట్ అంథా అనుభవాల, ప్రేరణల, సాధనల సారం అంతా దొరుకుతుంది మనకు!"

మారం శివప్రసాద్ : "మీరు ఏఏ న్యూఏజ్ మాస్టర్ పుస్తకాలు చదివారు ఎక్కువగా?"

శ్రీనివాసరెడ్డి :"నీల్ డొనాల్డ్ వాల్ష్, సోనియా ఛాక్విటీ, మార్టిన్ బ్రోక్‌మ్యాన్, సిల్వియ భ్రౌని, గుర్జీఫ్, జౌస్‌పెన్సీ ఇంకా ఇండియన్ మాస్టర్స్ -దీపక్ చోప్రా, ఓషో రజనీష్! ఓషో రజనీస్ "Master Sead" చాలా బాగా నచ్చింది. జీసస్ టీచింగ్ అది (ఎ సోల్స్ జర్నీ) ఔపీటర్ రిచెలీ! ఈ బుక్ చాలా గొప్పది. జేమ్స్ రెడ్ ఫీల్డ్! చాలా గొప్ప పుస్తకాలు ఆయనవి.

"మన పరమహంస యోగానంద -నిజమైన న్యూఏజ్ మాస్టర్ ఈయన. న్యూఏజ్ స్పిరిచ్యువాలిటీ స్టార్ట్ అయినపుడు వెస్టర్న్ మాస్టర్స్ అందరికీ నిజమైన ఇన్స్పిరేషన్ పరమహంస యోగానంద వ్రాసిన Autobiography of a yogi ఒక యోగి ఆత్మకథ! అంత గొప్ప పుస్తకం అది. అంతగా అందరినీ అలరించింది అది."

మారం శివప్రసాద్ : "మీరు పొందిన గొప్ప ధ్యానానుభవం- అనుభూతి! మరి మీరు ధ్యానంలో ఏఏ మాస్టర్లను చూశారు?"

శ్రీనివాసరెడ్డి : "అన్నీ కలగలిపిన ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్ గురించి చెపుతాను. 1998, 99 ప్రాంతాల్లో నెల్లూరు దగ్గర మైపాడు బీచ్‌లో పత్రీజీ ప్రోగ్రాం సముద్రం ఒడ్డున జరిగింది. మధ్యాహ్నం నెల్లూరు టౌన్‌లో జరిగిన క్లాసులో "ఆదిశంకరాచార్యులు" వచ్చి వెళ్ళారని మాస్టర్స్ తరు అనుభవాల్ని చెప్పారు. వైబ్రేషన్స్ చాలా బాగా వుండినాయి.

"ఇక సాయంత్రం బీచ్‌కు అందరం బస్సుల్లో వెళ్ళాం. అక్కడ ధ్యానం చేసిన తర్వాత నాకు ఎందుకో పిచ్చిపిచ్చిగా వుండింది. వెళ్ళి పత్రిసార్‌కి చెప్పాను. కూర్చొని మెడిటేషన్ చేయమని చెప్పారు పత్రిసార్. ఒక అరగంటలో డీప్ స్టేటస్‌కి వెళ్ళిపోయాను. సముద్రం ఒడ్డున! బాగా రాత్రి అయింది! 2 గం|| అలా దాదాపు ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాను. సముద్రం ఒడ్డున! బాగా రాత్రి అయింది! 2 గం || అలా దాదాపు ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాను! ఒక దృశ్యాన్ని చూస్తూ వున్నాను ధ్యానంలో! ఒక మాస్టర్ రాయిలాగా దగ్గరికి వస్తూ వున్నాడు. ఆ విగ్రహం దగ్గరికి వస్తూనే పేలిపోయి ప్రేమగా ఆ మాస్టర్ నా దగ్గరికి వసున్నాడు. అలా సిరీస్ ఆఫ్ మాస్టర్స్ - ఒక ఎనభైమంది.. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే వున్నారు. అందరూ వున్నారు గొప్ప గొప్ప యోగీశ్వరులంతా! శంకరాచార్యులు, మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద ఇంకా ఇంకా ఎందరో మహానుభావులు.

"ఫైనల్గా అందరూ చుట్టూ సర్కిల్లో కూర్చున్నారు. పత్రీజీ వాళ్ళమధ్య కూర్చొని వున్నారు. ఒక్కొక్క మాస్టర్ నుంచి కాంతిపుంజం వస్తోంది. పత్రీజీలో కలుస్తోంది. అలా ప్రతి మాస్టర్ నుండి కాంతితరంగాలు విడుదలయి పత్రీజీలో కలుస్తున్నాయి. క్రమంగా ఆ "లైవ్లీ ఎక్స్‌పీరియన్స్" పూర్తి అయిన తర్వాత నేను ట్రాన్స్‌లోంచి బయటపడ్డాను. లేచిన తర్వాత శరీరం, రెండు ఫుల్ బాటిల్స్ మందు తాగితే ఎంతకిక్ వుంటుంది అలా వుంది ఒళ్ళంతా, తూలుతుంది. వచ్చి పత్రీజీకి చెప్పాను ఎక్స్‌పీరియన్స్. వెళ్ళి బస్సులో పడుకున్నాను. మార్నింగ్ లేచి నెల్లూరులో రూమ్‌కి వెళ్ళిన తర్వాత కూడా అనుభూతి వదల్లేదు."

మారం శివప్రసాద్ : "బ్రహ్మర్షి పత్రీజీ గురించి మీ ఫైనల్ ఫైండింగ్ చెప్పండి!"

శ్రీనివాసరెడ్డి :"బుద్ధుడు-జీసస్ -క్రిష్ణుడు- వీరందరి ఎనర్జీ కాన్షియల్ లెవెల్స్ స్టడీ చేస్తే వీరి ఎనర్జీ -1000.

"పవర్ వర్సెస్ ఫోర్స్ - Dr. డేవిడ్ హాకిన్స్ మాస్టర్ వ్రాసిన పుస్తకంలో ఎనర్జీ కౌంట్ గురించి ఒక ఛార్జ్ ఇచ్చారు. ఆ ప్రకారం పై ముగ్గురి కౌంట్ ఒక్కొక్కరిదీ 1000, పత్రిసార్ కౌంట్ 1000కి 1000 వుంది.

"పత్రీజీ క్యాలిబ్రేషన్స్ 100% వున్నాయి. 1000 పాయింట్స్ వచ్చాయి. పత్రీజీ చెప్పారు I am the gist of all the masters అని. వీరి ముగ్గురి కలయికలోని ఎసెన్స్ పత్రీజీ అనుకుంటాను నేను!"

మారం శివప్రసాద్ : " మీ ఫైనల్ మెస్సేజ్ !"

శ్రీనివాసరెడ్డి : " రిఫైన్ కావాలంటే, మైండ్ ఓపెన్‌గా వుండాలంటే బుక్ రిడింగ్ అవసరం. ధ్యానానికి స్వాధ్యాయాన్ని జోడిస్తే, వూపుకు తావి అద్దినట్లు వుంటుంది. మనిషి ఓపెన్‌గా అయినా వుంటాడు. క్లోజ్‌గా ఐనా వుంటాడు. ఓపెన్‌గా వుండడమంటే నేచర్‌కి క్లోజ్‌గా వుండడమే! ప్రకృతితో వుండాలి ! మనతో మనం వుండాలి ! ఇదే నా సందేశం ! "

మారం శివప్రసాద్ : " ఎవరి నోటినుండి ఏ ముత్యాలు రాలినా ఏరుకోవడానికి నేను సిద్ధంగా వుంటాను అన్నారామధ్య "పత్రీజీ". మీ నోటి నుండి ముత్యాలే కాకుండా నవరత్నాలే జారాయి. వాటన్నిటినీ ఏరుకుని, పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందించగలగడం నా భాగ్యం. మీకు, అమ్మాయి మున్నీకి నా సాదర శుభాకాంక్షలు, కృతజ్ఞతలునూ!

"మీ ఫైనల్ మెస్సేజ్!"

శ్రీనివాసరెడ్డి : "రిఫైన్ కావాలంటే, మైండ్ ఓపెన్గా వుండాలంటే బుక్ రీడింగ్ అవసరం. ధ్యానానికి స్వాధ్యాయాన్ని జోడిస్తే, వూపుకు తావి అద్దినట్లు వుంటుంది. మనిషి ఓపెన్గా అయినా వుంటాడు. క్లోజ్గా ఐనా వుంటాడు. ఓపెన్గా వుండడమంటే నేచర్కి క్లోజ్గా వుండడమే! ప్రకృతితో వుండాలి! మనతో మనం వుండాలి! ఇదే నా సందేసం!"

మారం శివప్రసాద్ : "ఎవరి నోటినుండి ఏ ముత్యాలు రాలినా ఏరుకోవడానికి నేను సిద్ధంగా వుంటాను అన్నారామధ్య "పత్రీజీ". మీ నోటినుండి ముత్యాలే కాకుండా నవరత్నాలే జారాయి. వాటన్నింటినీ ఏరుకుని, పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అందించగలగడం నా భాగ్యం. మీకు, అమ్మాయి మన్నీకి నా సాదర శుభాకాంక్షలు, కృతజ్ఞతలూనూ!

Go to top