నేను "ఏది" చేయడానికైనా ముందంజ వేస్తున్న శక్తి.. పత్రీజీ "

 

 

మా అమ్మ.. క్రిస్టియన్.. మానాన్న..ముస్లిం..నాకెప్పుడూ తలనొప్పి - జ్వరం-ఎవరితో మాట్లాడాలన్నా భయం..ఆందోళన.. ఇంట్లో మాంసాహారం మనస్సులో ప్రశ్నల సమాహారం..

"మనం పుట్టకమునుపు ఎక్కడున్నాం?", "చనిపోయాక ఏమవుతాం?","ఈరోగాలు.. రోదనలు. ఏమిటి?", "ఆనందం..ఎందుకు కరువైంది?", "బ్రహ్మ -విష్ణువు -శివుడు -జీసస్- అల్లా.., వీళ్ళంతా దేవుళ్ళైతే.., ఆ దేవుళ్ళు ఎలా పుట్టారు?"

ఈ ప్రశ్నల్ని ఇంట్లో వాళ్ళను అడిగితే కస్సుమంటారు. బైటవాళ్ళను అడిగితే బుస్సుమంటారు.. మైండ్ డిస్టర్బ్ అయిపోతూవుండేది ఎప్పుడూ.. ఇదంతా..నేను తాడిపత్రి, విద్యార్థి విద్యాలయం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లో..

జరిగిన కథ..

మా స్కూల్లో ‘ధ్యానం’ నేర్పడానికి పత్రీజీ వచ్చారు.. స్టోరీ..టర్నింగ్..అయిపోయింది. ఆరువందలమంది స్టూడెంట్స్ మెడిటేషన్ ఎలా చెయ్యాలో చెప్తూ చేయించారు...పత్రీజీ!

క్లాస్ అయిపోయింది పత్రీజీని కలిశాను.. "మీతో మాట్లాడాలి.." అన్నాను అదే నేను తొలిసారి ధైర్యం చేసిన సంఘటన. పూరీ తింటున్న పత్రీజీ నన్ను చూశారు.పూరీ మొత్తం తినేసేవరకూ’ అలాగే చూశారు.

నాలో దడ వణుకు ఎందుకలా చూస్తూన్నారో ఏమంటారో..?

లేచారు పత్రిసార్. "నాతోపాటు ధర్మవరం వచ్చేయ్" అన్నారు..

ధర్మవరం క్లాస్‌లో "‘ధ్యానం శరణం గచ్ఛామి’, ‘వసిష్ఠామృతం..’, ‘జోనాధన్ లివింగ్‌స్టన్ సీగల్’, ‘భగవద్గీత..’పుస్తకాలు చదవండి.."

అని పత్రీజీ ఉపన్యాసంలో చెప్పారు. ఆ పుస్తకాలు తీసుకున్నాను. ఆ పుస్తకాలన్నీ చదివాను. ఏది చదివినా.. "పత్రీజీ చెప్పినవే" అనిపిస్తోంది!

ధ్యానం చెయ్యడం మొదలెట్టాను. ఇంట్లో వాళ్ళు అవమానించడం - అరవడం - "పిచ్చెక్కిందా?" అనడం..

"మాంసాహారం మానేశావ్..! మరింకేం తింటావ్? - ఆకులు అలములా!?" అమ్మదీ అదే ప్రశ్న. నాన్నదీ అదే దటాయింపు!

తలనొప్పి తగ్గిపోయింది. ప్రశ్నలకు సమాధానాలు అందాయి. మనస్సు నిమ్మళించింది. భయం మాయం అయింది. జ్వరం పారిపోయింది. ఇంట్లో వాళ్ళకు నా ‘బాధ’ అర్థం అయ్యింది. వాళ్ళు కూడా ధ్యానం చేసే పరిస్థితి వచ్చేసింది ఇదో లెవల్. "పత్రీజీ పిచ్చి" బ్రహ్మాండంగా పట్టేసింది! ఆయన ఏ ఊరు వెళ్ళితే ఆ వూళ్ళో నేను ప్రత్యక్షం. అనంతపురంలో, శివరాత్రి ధ్యానయజ్ఞం..జరుగుతోంది సడెన్‌గా పత్రీజీ. నన్ను వేదిక మీదికి పిలిచి. "నీ అనుభవాలను చెప్పు" అన్నారు. అరగంట..చెప్పాను..ఏం చెప్పానో తెలీదుగానీ. "వ్రేలెడంత లేడు..వీడు చెప్పేది నిజమా?". అనిపించిందట అందరికీ.. ఆ తర్వాత ఎన్నో సభల్లో మాట్లాడించారు పత్రీజీ!

ఓసారి పత్రీజీతో రెండునెలలు కంటిన్యూగా వున్నాను ఆయన చెప్పే ప్రతిదాన్లో పద్ధెనిమిది ఆదర్శసూత్రాలతో సహా ఆయన జీవించే తీరు. అమోఘం! రోజుకు 20 గంటలపాటు నిరంతరంగా..అఖండంగా ఆయన శ్రమించేతీరు..అనన్య సామాన్యం! మిగిలిన పనుల్లో..ఎంత అలసిపోయినా ఎంత రాత్రియినా మంచి పుస్తకాలు శ్రద్ధగా సీరియస్ చదివే తీరు! మై గుడ్‌నెస్..!! జనారణ్యంలో తిరగాడుతున్నఅవిశ్రాంత శ్రామికుడైన ఋషి పుంగవుడ్ని చూస్తున్నానేమో?! ఆ ఇన్‌స్పిరేషన్‌తో నా జీవితం రూపురేఖలే మారిపోయాయి! ఇంకేముంది?! "టెలిపతీ.." థర్డ్ ఐ..", "ఆస్ట్రల్ ట్రావెల్..", "‘ఆరా’ దర్శనశక్తి..", ఇవన్నీ తెలిశాయి!

మా ఇల్లే ధ్యానకేంద్రంగా మారింది! మా కాలనీ ధ్యాననిలయం అయింది! తాడిపత్రిలోని ప్రతి కాలనీలో ధ్యానం గురించి చెప్పడం, చేయించడం మొదలెట్టాను. తాడిపత్రి మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి బోధించాను. "ధ్యాన రాయలసీమ" ప్రోగ్రాంలో పాల్గొన్నాను. అనంతపురంలో కొన్ని వందలస్కూళ్ళల్లో ధ్యానం నేర్పించాను. ఇతర జిల్లాలకు నా దూరప్రయాణం కొనసాగించాను. చెన్నైకి బయలుదేరాను. ఎన్నో రైళ్ళలో ప్రతి కంపార్ట్‌మెంట్‌లో ‘ధ్యానం’ స్టిక్కర్స్ అతికించాను. శబరిమలైలో స్వాములకు ధ్యానం చెప్పించాను.

ముంబైలో 8 రోజుల ధ్యాన ప్రచారం. ఇవన్నీ నేను "చదువుకుంటూనే" చేశాను. "9వ తరగతి"లో పత్రీజీ కనిపించారు. ఇప్పుడు " M.B.A." చదువుతున్నాను! మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్‌బెల్ట్ సంపాదించాను. డాన్స్ నేర్చుకుంటున్నాను. క్రికెట్- ఫుట్‌బాల్-టెన్నీస్ ఆడుతున్నాను.

"ప్రపంచమంతా ధ్యానప్రచారం చేయాలి" అన్నదే.. నా ఆశయం.. ఇప్పుడు.. "ధ్యానాంధ్రప్రదేశ్", "స్పిరిచ్యువల్ ఇండియా", మేగజైన్స్‌ను కనీసం లక్ష కాపీలు, సర్క్యులేషన్ చేయడమే నా ధ్యేయం! అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించాను. పని మొదలుపెట్టాను. ప్రతి జిల్లా నుండి కొంతమందిన ఈ పనిగా ఇన్‌స్పైర్ చేద్దామని.. ముందుగా నేను..

2008, మార్చి 22 నుంచి మార్చి 26 వరకు తాడిపత్రిలో మాత్రమే తిరిగి అక్కడి పిరమిడ్ మాష్టర్ల విశేష సహకారంతో 110 మందిని ధ్యానాంధ్రప్రదేశ్ చందాదారులుగా చేర్పించగలిగాం! ఎవరితోనైనా మాట్లాడ్డానికే భయపడే నేను.. "ఎవరైతోనైనా" మాట్లాడగలిగే స్థితి. ఏదిచేయడానికైనా వెనుకంజవేసే. నేను "ఏది" చేయడానికైనా ముందంజ వేస్తున్న శక్తి.. ఎలా వచ్చిందో.. అర్థమైందికదా..దటీజ్.. పత్రీజీ.!!!

 

ఆనంద్
హైదరాబాద్

Go to top