"ఫాస్ట్‌లైఫ్ రిగ్రేషన్... బ్రెత్ వర్క్"

 

 

"నాలుగు నెలలు నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ మరి పిక్కలలో క్రాంప్స్ వున్న నేను వార్ధాలో పత్రి గారికి 'లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్" అవార్డు ప్రధానం సందర్భంగా కాన్ఫరెన్స్‌లో పాల్గొనటం జరిగింది. 17వ తేదీ ఉదయం డాక్టర్ హరి సలహా మేరకు 'బ్రెత్‌వర్క్' చేస్తూండగా కొద్ది నిమిషాలకు కస్తూర్‌బా గాంధీ గారికి సంబంధించిన కొన్ని దృశ్యాలు శరీరంలోని ఆస్ట్రల్ బాడీ పైకి రావడం గమనించాను. తరువాత మెడనొప్పి రాగా దానిలోకి రిథమిక్‌గా శ్వాసను గైడ్ చేయడం వల్ల కొద్దిసేపటికి నొప్పి తగ్గి అనూహ్యమైన రీతిలో గాఢమైన ప్రశాంతత పొందటం జరిగింది. ఎంతో గాఢమైన ధ్యాన స్థితిలో పొందే ఇటువంటి అనుభవం నాకు కేవలం 30 నిమిషాల వ్యవధిలో లభించడం ఓ అద్భుతం. ఎంతోమంది రోగులకు 'డాక్టర్ హరి' చే ఈ 'పాస్ట్‌లైఫ్ థెరపీ' పై అవగాహన కల్పించాలని నేను నిశ్చయించుకున్నాను."

డాక్టర్ సత్యనారాయణమూర్తి
M.S., జనరల్ సర్జన్, జగిత్యాల


"తల్లి గర్భంలో మళ్ళీ జీవించడం, ప్రసవ దశలో నేను పొందిన అనవసరమైన భయాలను దూరం చేసుకోవటం, నీళ్ళలో దిగాలంటే భయం వున్న నాకు గతజన్మలో గల మూలకారణాన్ని తిరిగి అనుభవించి పరిష్కారాన్ని కనుగొనటం జరిగింది. ఎత్తు ప్రదేశాలంటే భయం, బల్లులంటే భయం, చావంటే భయం ఇలా రకరకాల సమస్యలు P.L.R. తో దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్స్‌లాంటి వ్యసనాలను దూరం చేసుకోవచ్చు."

డాక్టర్ శివ
M.D. సైకియాట్రిస్ట్, హైదరాబాద్


 "మొదట శరీరం అంతా భారమవుతూ తల భాగంలో నొప్పి వచ్చింది. కొన్ని నిమిషాల తర్వాత నాలో నుంచి ఆనందంతో కూడిన నవ్వు నా ప్రయత్నం లేకుండానే చాలావరకు బయటికి వచ్చింది. నేను గతజన్మలలో 'బెంగాలో స్త్రీ'గా అలాగే 'చైనీస్ అమ్మాయి'గా చూసుకున్నాను. బెంగాలీ స్త్రీగా వున్నప్పుడు దుర్గామాత దేవాలయంలో హారతి ఇస్తూ వుండగా 8-10 మంది దుండగులు నన్ను చుట్టుముట్టి తల పైన వెదురుకర్రలతో కొట్టడం, ఎడమవైపు గాయం కావడం, మరణించడం జరిగింది. ప్రస్తుతం నాకు వున్న ఎడమవైపు తలభాగంలో నొప్పి తీవ్రంగా తరచూ వస్తూ వుండటంతో సి.టి. స్కాన్ మొదలైన పరీక్షలు చేయించుకున్నాఏమీ లేదని నిపుణులు చెప్పడం జరిగింది. నేను అనుభవిస్తున్న తలనొప్పికి కారణం 'ఫాస్ట్‌లైఫ్ రిగ్రెషన్' ద్వారా తెలుసుకున్నాను. ప్రతిరోజూ ధ్యానం చేస్తున్నాను."

డాక్టర్ అంజు సాంగ్వాన్
M.Sc. క్లినికల్ సైకాలజిస్ట్, పూనె


 "ఛాతీ అంతా బరువెక్కటం, ఆ భారాన్ని శ్వాస యొక్క శక్తి చేత దూరం చేసుకోవటం, మాటలలో వర్ణించలేని ఆనందాన్ని రిలాక్సేషన్‌ను పొందటం వర్క్‌షాప్‌లో పాల్గొన్న నాకు లభించింది. సరి అయిన నిర్ణయాన్ని తీసుకోలేక ఆందోళనతో వున్న నాకు ధ్యానం బాగా కుదిరేందుకు సూచనలు, నా లక్ష్యాన్ని చేరుకోగలనన్న ఆత్మవిశ్వాసం లభించాయి."

డాక్టర్ లెనిన్
B.H.M.S., హోమియోపతి స్పెషలిస్ట్, వైజాగ్


 "స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్ లోని ఆర్టికల్ చూసి డాక్టర్ హరి గారిని వర్క్‌షాప్‌లో కలిసాను. చిన్నవయస్సులో తరుచుగా వచ్చే బ్రాంకోనిమోనియా ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌లో వున్న సంఘటనను చాలా స్పష్టంగా తిరిగి అనుభవించాను. తల్లి గర్భస్థ దశ తరువాత టన్నల్ ద్వారా ప్రయాణిస్తూ ఒక రైతుగా వున్న జన్మ చూసుకున్నాను. సుమారు 80 సంవత్సరాల వయస్సులో రైతుగా వున్న నేను మా కుటుంబీకులతో మాట్లాడుతూ వుండటం... చనిపోయిన దృశ్యం, తరువాత ఊర్థ్వలోకాల నుంచి శక్తిని ప్రస్తుత శరీరంలోకి తీసుకునిరావడం... చాలా అద్భుతంగా వుంది నా అనుభవం. నాకు తరచుగా వచ్చే పిక్కలలో నొప్పిని కారణం ఆ రైతు జన్మలో తిరిగి అనుభవించడం... శ్వాస యొక్క శక్తి చేత సైనసైటిస్ మరి మోకాళ్ళ ప్రాంతంలో వున్న నొప్పిని మొదటి సెషన్‌లో తగ్గించుకున్నాను. తరువాత ధ్యానంలో త్వరగా ఆలోచనా రహితస్థితి వచ్చి ఎక్కువసేపు చేయగలిగాను.

డాక్టర్ అనిల్
E.N.T. సర్జన్, ఇమేజ్ హాస్పిటల్


 

పేషెంట్లు, మాస్టర్ల అనుభవాలు

"మొదటిరోజు బ్రెత్‌వర్క్ సెషన్‌లో శరీరం అంతా తిమ్మిరి ఎక్కటం, విపరీతమైన వైబ్రేషన్స్ లోపల ఓ కరెంట్ లాగా శక్తి ప్రవహించడం జరిగింది. ఐదు నెలల నుంచి బాధపడుతూన్న నా ఎడమ మడిమ నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. రెండవరోజు 'పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్' సెషన్‌లో నా తల్లి ఒడిలో చూసుకోవటం, చేతికి నల్లపూసలు, అమ్మ వేసుకున్న డ్రస్, అక్కడి వాతావరణం అంతా కరెక్ట్ అని మా అమ్మకు ఫోన్ చేసి తెలుసుకున్నాను. థైరాయిడ్ మరి వెంట్రుకలు విపరీతంగా రాలడం సమస్యలు థెరపీ వల్ల తగ్గాయి.

"సోరియాసిస్‌తో బాధపడుతున్న మా అబ్బాయికి 60%-70% తగ్గిందని చెప్పవచ్చు. తన గతజన్మలో ఇల్లు కూలిపోగా అందులో ఇరుక్కుపోయి మరణించినట్లుగా చూసుకోవడం జరిగింది. చాలా ఉబ్బుగా, ఎర్రని పొడలు పొడలుగా వున్న సొరియాసిస్ ప్రస్తుతం ఒక నెల రోజులలో ఇబ్బంది లేని తెల్లని మచ్చలుగా మారింది."

"ఇంకొకరోజు సెషన్‌లో మాస్టర్స్ హీలింగ్ చేయటం, ఆ అదృశ్య చేతుల స్పర్శ ఇప్పటికీ మరచిపోలేను. అన్నీ వున్నా ఏదో వెలితి. ఈ అనుభవం తరువాత 'నన్ను ఎప్పుడూ కాపాడే మాస్టర్లు నా వెంటే వున్నారు' అన్న భద్రతాభావం బలపడింది. "థెరపీ వల్ల మా వారికి త్వరగా కోపం రావటం, గట్టిగా అరవటం, అనవసరంగా భయపడటం తగ్గి నాతో నెమ్మదిగా మాట్లాడటం, గొడవపడటం తగ్గింది."

స్వరణ్‌మయి
హైదరాబాద్


 "మారం శివప్రసాద్ గారి సూచన మేరకు రెండు సంవత్సరాలుగా జీవితంపై విపరీతమైన విసుగు, తీవ్రమైన స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న నాకు 90-95% తగ్గి అనవసరమైన ఆలోచనలు తగ్గి ధ్యానం చక్కగా చేసుకోగలుగుతున్నాను. డాక్టర్ హరి గారికి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ గారికి కృతజ్ఞతలు."

రాజేందర్
హైదరాబాద్


 "రెండవ సెషన్‌లో విపరీతమైన దుఃఖం, మా తల్లి చనిపోయిన సన్నివేశం అలాగే నన్ను బాగా దూషించి అవమానించిన నా శత్రువు కనిపించడం, నా లోంచి భారం అంతా అలా పైకి వెళ్ళిపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా వున్న నాకు విపరీతంగా దగ్గు రావటం, శ్వాస చికిత్సతో దగ్గును దూరం చేసి శ్వాస యొక్క గొప్పతనం తెలిసింది. ఈ సమస్యల నుంచి దూరం కావడం కోసం నాలుగు నెలలుగా ఐదుగంటలకు పైగా ధ్యానం చేస్తున్నా కుదరక కష్టపడుతున్న నాకు 40 నిమిషాలలో ఈ ప్రత్యేక అనుభవం కలిగింది. ఇంతకుముందు నా శత్రువును చూస్తే కోపం వచ్చే నాకు అతడు ఎదురయినా ఏమాత్రం కోపం రాకపోవడం విశేషం.

గంగాధర్
సిద్దిపేట


 

 

డాక్టర్ హరి కుమార్, హైదరాబాద్

Go to top