"కారాగారంలో పరివర్తన ప్రభంజనం"

"మానసిక ఆందోళన తగ్గింది"

 

"నాది దుర్గి మండలం ముటుకూరు గ్రామం. హత్య కేసులో గత ఏడు నెలలుగా జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాను. ధ్యానం నేర్చుకోవడానికి ముందు మనసంతా తెలియని ఆందోళనతో స్థిమితంగా వుండేది కాదు. ప్రస్తుతం ధ్యానం చేస్తున్నందున మానసిక ప్రశాంతత లభిస్తోంది.

బీబీ సాహెబ్
ముటుకూరు


" పాత జీవితానికి పూర్తిగా స్వస్తి చెబుతాను "

"నా పేరు కోటేశ్వరరావు. మనస్సు అనేది లేకుండా మనిషిని కొడతాను. ఇళ్ళల్లో పడి దోచుకోవటం అనేది జరుగుతూ వుంటుంది. నేను ఎన్నో దోపిడీలు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో మానభంగాలు, ఎన్నెన్నో చేసాను. ఆఖరికి నా జీవితంలో ఏదీ నాకు సహాయపడలేదు. జీవితంలో ఉపయోగపడేది ఒక్కటే. మంచితనం, మానవత్వంతో ఎవరి దగ్గరైతే వుండగలిగానో ఆ మంచితనం, మానవత్వమే నన్ను కాపాడింది. నేను ఇప్పుడు మంచిగా మారడానికి కారణం ఏమిటంటే ... మన సుబ్బరాజు గారు ఎంతో మంచివారు. నాకు మైండ్ పనిచెయ్యక జైలులో తలను గోడకేసి పగలగొట్టుకున్నాను, కసి, ఆవేశం ఎక్కువ నాకు. మనిషికి ఏదైనా చెయ్యాలంటే ఆలోచన చెయ్యకుండా ఆ క్షణంలో చేసేస్తాను."

"నీ బాధేంటి?"

"వీరు నాకు కౌన్సెలింగ్ చేసారు. 'నీ బాధేంటి?' అని నన్ను అడిగారు. 'నా బాధ ఇది, నేను ఇలా, నా జీవితం ఇది' నువ్వు బాగుపడు, ఇతరుల్ని బాగుపెట్టు. నువ్వు మారి నీకు చేతనైనంత సహాయం మిగతావాళ్ళకి చెయ్యి. నీకు తెలిసింది నువ్వు జనాలకి చెప్పు' అన్నారు. "నేను ఎవ్వరి మాట వినను అసలు. ఎందుకంటే 'నాదే నెగ్గాలి, నేను చేసిందే వేదం, నేను చేసిందే చట్టం' అనేవాడిని నేను. అలాంటిది సూపరింటెండెంట్ గారు చెప్పిన మాటకి మైండ్ పోయింది అసలు. ఒకసారి మా అమ్మ గుర్తొచ్చింది. సూపరిటెండెంట్ గారికి చెప్పాను ‘ అయా మా అమ్మ గుర్తొస్తుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు'. అప్పుడు ఆయన అన్నారు 'నా సొంత డబ్బులతో, చార్జీలతో మా స్టాఫ్‌ని పంపించి మీ అమ్మను పిలిపిస్తాను ఇక్కడికి' అని. అందుకే సూపరింటెండెంట్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా."

"పనికొచ్చింది ఒక్కటే...ధ్యానం"

" ' నా జీవితాన్ని మార్చుకున్నాను' అని ఆయనకు చెప్పాను. నేను గత 50 రోజుల్నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. ఫస్ట్ నేర్చుకున్న విద్య 'వేగం', తర్వాత 'ఆత్మ రక్షణ' విద్య, మూడవది 'కుంగ్‌ఫూ' నాలుగవది 'ధ్యానం'. అంతకుముందువేవీ పనికిరాలేదు నాకు. పనికొచ్చింది ఒక్కటే... 'ధ్యానం'. ధ్యానంలో మంచి అనుభవాలు పొందాను. ఎన్నో లోకాలని చూసొచ్చాను. "చిన్నప్పటి నుంచి ప్రయోజనం లేని పని ఏదీ చెయ్యను నేను. నాకు మా అమ్మగారు నేర్పించిన సంస్కారం అలాంటిది. కాకపోతే నేను స్నేహితుల వల్ల ఇలా మారిపోవాల్సి వచ్చింది. నేను ఐదు జైళ్ళు తిరిగాను. కానీ ఈ జైల్లో సూపరింటెండెంట్ గారి వల్ల నేను చాలా మారాను. ఒక అమ్మాయి 'నేను నిన్ను మారుస్తాను' అని ఛాలెంజ్ చేసింది. కానీ మార్చలేకపోయింది. మన సూపరింటెండెంట్ గారు మార్చారు నన్ను. అయితే నన్ను కొట్టి, తిట్టి మార్చలేదు. ప్రేమతో మార్చారు. మనిషి లొంగేది ప్రేమకు మాత్రమే.

"చాలా ప్రేమగా చూస్తారు"

"నన్ను మాత్రమే ఎందుకు మార్చాలనుకున్నారంటే నేను చాలా దుర్మార్గుణ్ణి. నేను మారితే నా వల్ల చాలామందిలో మార్పు వస్తుందని ఆయన ఆలోచన. నాకు పడిన కేసులో కూడా నేను నిజాయితీ, ఆత్మవిశ్వాసంతో నా తప్పుల్ని ఒప్పుకుని నిలబడడంతో మెజిస్ట్రేట్ గారు నా తప్పుల్ని క్షమించి వదిలేశారు. ఎవ్వరికీ దండం పెట్టను నేను. ఎందుకంటే నాకు అహంకారం ఎక్కువ. అలాంటిది సూపరింటెండెంట్ సార్ 'రౌండ్' వస్తే మాత్రం చేతులు కట్టుకుని అలాగే నిల్చుంటాను. ఎందుకంటే మంచితనం, మానవత్వం వున్నది కనుక. ఇదంతా ఎలా వచ్చిందంటే ఈ జైల్లో మన సూపరిటెండెంట్ గారు ఖైదీలని గానీ, నన్ను గానీ చాలా ప్రేమగా చూసుకుంటారు. ఖైదీలని ఇంత మాట కూడా అననివ్వరు సార్. స్టాఫ్ కూడా చాలా మంచివాళ్ళు."

"ధ్యానంలో సత్యం వుంది"

"ధ్యానంలో నా అనుభవాలు చెప్తాను. ఫస్ట్ నాకు ధర్మచక్రం కనిపించింది. రెండవది 'శిలువ' కనిపించింది. మూడవది 'శివలింగం' కనిపించింది. ఇంకా ఎన్నో రంగులు కనిపించాయి. ఆ రంగులు కనిపిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయాను అసలు. ఎన్నో లోకాలకు వెళ్ళి తిరిగివచ్చాను. ధ్యానంలో కూర్చుంటే నాకు అస్సలు టైమ్ తెలీదు. అంటే 'ధ్యానంలో ఒక సత్యం వుంది' అని తెలుసుకున్నాను. అంటే ధ్యానం ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకోగలిగాను. దానికి కారణం మన సూపరింటెండెంట్ గారు. దీని ద్వారా నా జీవితాన్నినేను మార్చుకున్నాను. మీరు కూడా ధ్యానం చేసి మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ దేశానికి ఉపయోగపడండి. అసలు డబ్బు సంపాదించి ఏం చేస్తారు? నేను లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించాను, దోచుకుని. కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఆఖరికి ఎందుకూ పనికిరాకుండా అయిపోయా. ఈ జైలుకి వచ్చి 'నాకూ జీవితం వుంది' అని తెలుసుకున్నాను.

"ఇంక మరొకరికి హాని చేయను"

"నేను ఏదైనా ఖరీదైన వీధిలో నిలబడి ఒక్కసారి అన్ని ఇళ్ళవైపు చూసి నవ్వుకునేవాడిని. ఈ రాత్రికి ఈ ఇళ్ళన్నీ నా దోపిడీకి గురువుతాయని మనస్సులో నవ్వుకునేవాడిని. కనీసం పదిమంది అడ్డువచ్చి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించినా వారందరినీ చిత్తు చేసి పారిపోగల సమర్ధుడను. నా వయస్సు 26 సంవత్సరాలు, పది సంవత్సరాల వయస్సు నుంచే దోపిడీలకు పాల్పడ్డాను. ప్రస్తుతం ధ్యానంలోకి దిగాక గత చరిత్ర గురించి ఆలోచిస్తే నవ్వు తెప్పిస్తోంది. జైలు నుంచి బయటపడిన తరువాత కాయకష్టం చేసుకుని అయినా బ్రతుకుతాను. ఇంక మరొకరికి హాని చేయను."

ఇత్తడి కోటేశ్వరరావు
కందుకూరు


" ఆలోచనలో మార్పు వస్తుంది "

“ నా పేరు రామరాజు. నేను మర్డర్ కేసులో ఇక్కడికి వచ్చాను. నేను గ్రాడ్యుయేట్‌ని. ఆర్మీలో పది సంవత్సరాలు పనిచేసాను. ఒక ఆఫీసర్‌ని నరకడం వల్ల నన్ను ఆర్మీలో నుంచి తీసేసారు. దాంట్లో నేను శిక్షింపబడి బయటకి వచ్చేశాను. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. ఎవరైనా నన్ను కొడితే వాళ్ళు నా మైండ్‌లో వుండిపోయేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడల్లా కొట్టాలనిపించేది. అలాంటి పరిస్థితి నాది.”

“ఆత్మ-మనస్సు-శరీరం”

“ మనిషిలో ‘ఆత్మ’, ‘మనస్సు,’ ‘శరీరం’ అనే మూడు పార్ట్స్ వుంటాయి... ఒకానొక గ్రుడ్డులో మూడు భాగాలు వున్నట్లు ... అయితే అంతా కలిపితే గ్రుడ్డే కదా. ఈ మూడింటినీ ఒక మంచి దారిలోకి తీసుకురావడానికి ధ్యానం అనేది ఉపయోగపడుతుందని నేను తెలుసుకున్నాను. నాలో వున్న ఆవేశాన్ని నేను తగ్గించుకోగలిగాను. ఈ ధ్యానం నేర్పించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మనకు ఈ కక్షలు కానీ, ఆశలు కానీ, ఆలోచనలు కానీ, బాధలు కానీ ఎందుకొస్తున్నాయంటే మితిమీరిన కోరికల వల్లే. ఇవన్నీ ధ్యానంతో తగ్గించుకోవచ్చని చెప్పగలను నా అనుభవంతో. ఈ ధ్యానం ద్వారా నలుగురితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ప్రేమించబడాలి అని తెలుసుకున్నాను.

“ఇక్కడ వాతావరణం ప్రత్యేకం”

“పదమూడేళ్ళుగా దొంగతనాలు చేస్తున్నాను; దొరికిపోతున్నాను. రాజమండ్రి, చిత్తూరు, ఏలూరు, తెనాలి, అదిలాబాద్, నెల్లూరు, నరసరావుపేట తదితర జైళ్ళన్నింటినీ చూసాను. అయితే గుంటూరు జైల్లో వున్న వాతావరణం ఎక్కడా వుండదు. ఖైధీల పరివర్తనకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా గజల్ శ్రీనివాస్ పాటలు నా మనస్సుకు హత్తుకుపోయాయి. ఈ సారి జైలు నుంచి విడుదలయ్యేకా ఎలాంటి నేరాలూ చేయకూడదని నిర్ణయించుకున్నాను.

- దాట్ల సీతరామరాజు


“ఇకపై ఎవరినీ హింసించను”

“ ‘మరాల్’ పేరు చెబితేనే తోటి ఖైదీలు సైతం గజగజ వణుకుతారు. చేతిలో వున్న చిన్నపాటి బ్లేడుతో ప్రత్యర్ధిని పూర్తిస్థాయిలో గాయపరచి క్షణాల్లో దోచుకోగల సమర్థుడను. కానీ ఇప్పుడు నేను పూర్తిస్థాయి శాకాహారిని. ఇక ఎదుటి వ్యక్తిని గాయపరచను. గతంలో చేసిన నేరాలకి చింతిస్తున్నాను.

“ఆ ఫోలీసును చంపాలనుకున్నాను్”

“గతంలో చోరీలకు ఎక్కువుగా పాల్పడేవాదిని. ఇప్పుడు జైలుకు వచ్చిన నేరం నేను చేసింది కాదు. అక్రమంగా నాపై బనాయించారు.”

- ఏలూరి రామకృష్ణ, వసంతరాయపురం, గుంటూరు


 

శివప్రసాద్

Go to top