"తలనొప్పి లేదు! నీరసం లేదు!"

 

నాకు గత అయిదు సంవత్సరాల నుంచి ఒకవేపు తలనొప్పి "మైగ్రేన్" వుండేది. చాలామంది డాక్టర్‌లను సంప్రదించాను. డాక్టర్‌కు చూపించినప్పుడు తగ్గేది, అయితే మళ్ళీ వచ్చేది. నెలరోజుల క్రిందట బాగా తలనొప్పి వచ్చింది. ఒక దశలో "ఆత్మహత్య చేసుకుందాం" అనిపించింది. అప్పుడు మా "సువర్ణ అక్క" కు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాను. అక్క ఇంటికి రమ్మని, తేది 17-02-2008 న ధ్యానం గురించి నాకు పరిచయం చేసింది. అప్పుడు మా ఇంటివద్ద వున్న లీలావతి మేడమ్ ఇంట్లో ధ్యానం చేశాం. ధ్యానం గురించి మేడమ్, సార్ (మేడమ్ భర్త) చెప్పారు. ధ్యానం చేసిన రెండురోజుల్లో కొంచెం తలనొప్పి తగ్గింది. మనస్సు చాలా ప్రశాంతంగా వుంది. తరువాతి తేదీ 21-02-2008 బుగ్గపట్నం లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ట్రెక్కింగ్‌కు వెళ్ళాం. ఆ రోజు పౌర్ణమి. ఆ రోజు మొత్తం ధ్యానం, ఆధ్యాత్మిక విషయాలు గురించి కంచి రఘురాం మాస్టర్ చాలా విషయాలు చెప్పారు. నేను గత అయిదు సంవత్సరాలలో రాత్రి మొత్తం మేలుకొని ఉండడం అదే! ఒకవేళ మేలుకుంటే ప్రొద్దున తలనొప్పి, నీరసం వచ్చేది. కానీ విచిత్రంగా ఆ రోజు ఉదయం తలనొప్పి లేదు! నీరసం లేదు! మనస్సు చాలా ప్రశాంతంగా వుంది! అప్పుడు నాకు ధ్యానం మీద బాగా నమ్మకం కుదిరింది. ఆరోజు నుంచి ఈరోజు వరకు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాం. తలనొప్పి పూర్తిగా తగ్గింది. మార్చి 6వ తేదీ శివరాత్రి రోజు కూడా రాత్రి మొత్తం ధ్యానం చేశాం. ఆ రోజు పత్రీజీ సార్‌ను దర్శించుకున్నాను.

 

మా సువర్ణ అక్కకూ, లీలావతి మేడమ్‌కూ, మాస్టర్లందరికీ, పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ పత్రీజీ గురువు గారికీ అందరికీ కృతజ్ఞతలతో...మీ ధ్యాని.

 

N.S. చంద్రశేఖర్
గుంటూరు

Go to top