" ధ్యానం వల్ల ఖైదీల్లో అద్భుతమైన పరివర్తన "

 

నా పేరు జయరామిరెడ్డి. నేను ప్రస్తుతం చంచల్‌గూడ జైలుకు..జైలర్‌గా నా ఉద్యోగబాధ్యతలను నిర్వహిస్తూన్నాను. ఒక జైలు అధికారిగా ఎందరెందరో కరుడుగట్టిన నేరస్థులతో కలిసిఉండే నేను "ఖైదీలను బెదిరించడం ద్వారానే వారిలో మార్పును తీసుకునిరాగలం" అనుకునేవాడిని. "ధ్యానం చేయడం ఇంత సులభం" అనీ మరి "ఆ ధ్యానం ద్వారా మాత్రమే వ్యక్తి అంతరంగంలో అద్భుతమైన మార్పుని తీసుకుని రాగలం" అనీ నాకు 2003 వరకూ తెలియదు.

కర్నూల్లో 2003 నుంచి 2007 వరకు జిల్లా జైలుకు జైలర్‌గా పనిచేసినప్పుడు పిరమిడ్ మాస్టర్ డా|| V. హరికుమార్ గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని మా జైలులోని ఖైదీలతో 40 రోజులు ధ్యానం గురించి తెలుసుకుని మా జైలులోని ఖైదీలతో 40 రోజులు ధ్యానం చేయించాము. తక్కువ సమయంలోనే వారిలో మానసిక ప్రశాంతతతోపాటు.. వారు దైవికపరమైన ధ్యాన అనుభవాలను పొందడం జరిగింది. అక్కడ నేను నా ఉద్యోగం బాధ్యతలను నిర్వహించినన్ని రోజులూ నిరంతర ధ్యాన సాధన తప్పనిసరిగా జరిగేది.

ప్రస్తుతం నేను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు జైలరుగా బదిలీఅయ్యాను. వచ్చీరావడంతోనే ఇక్కడ కూడా పిరమిడ్ మాస్టర్లద్వారా ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా కార్యక్రమాలు జరుపబడుతూండడం చూసి ఎంతో ఆనందించాను.

నిరంతరం కోపం, ద్వేషం, అసూయ, అపరాధపు భావనల్లో మ్రగ్గుతూవుంటే ఖైదీలు.. ఆత్మలోని అభయం, ఆత్మలోని శాంతం, ఆత్మయుత స్వేచ్ఛతో కూడిన ఆనందం మరి ఆరోగ్యాలను పొందాలి అంటే కేవలం ధ్యానం ఒక్కటే మార్గం ..

పిరమిడ్ మాస్టర్లతో పాటు డా|| న్యూటన్ కొండవీటి మరి డా|| v. హరికుమార్ గార్లు సరియైన ఆరోగ్యాన్ని పొందడంలో వైద్యుడి అవసరం ఏ మాత్రం లేదనీ.. ఎవరి ధ్యానసాధనే వారికి దివ్య ఔషధం అనీ.. జీవితంలో ప్రతి ఒక్క సంఘటన కూడా ఒక శిక్షకాదు.. శిక్షణ అనీ ఎన్నెన్నో ప్రోత్సాహకరమైన ఆత్మజ్ఞాన సందేశాలను ఇచ్చేవారు. తమలో అపరాధభావాన్ని తొలగించుకున్న ఖైదీలు చక్కటి పరివర్తన ఖాళీ సమయం దొరికినప్పుడంతా ధ్యానసాధనలో మరి ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూనో, బ్రహ్మర్షి పత్రీజీ సి.డి. లు వింటూనో గడుపుతూన్నారు.

సమాజాన్ని ఒక వసుధైక కుటుంబంలా మార్చడానికి బ్రహ్మర్షి పత్రీజీ చేస్తోన్న విశేష కృషిలో నేను కూడా పాలుపంచుకుంటున్నందుకు గర్వపడుతున్నాను ..

 

జయరామిరెడ్డి
చంచల్‌గూడ
హైదరాబాద్

Go to top