" నాకు ధ్యానం ద్వారా మైగ్రేన్ పూర్తిగా తగ్గిపోయింది "

 

నా పేరు రాధిక. మేము చిత్తూరు పట్టణంలో లిటిల్ రోజ్ టెక్నోస్కూల్ నిర్వహిస్తున్నాము.

మా పాఠశాలలో పనిచేస్తున్న టీచర్.. మురళీమోహన్ గారి ద్వారా 7వతరగతి చదువుతూన్న మా కుమారుడు లోహిత్ కుమార్ 2007 వ సంవత్సరంలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. ప్రారంభించిన మూడో రోజే వాడికి దివ్యచక్షువు ఉత్తేజితమైంది. ఆ తరువాత మా బాబు స్పూర్తితో నేను, మా వారు కూడా ధ్యానం చేయడం ప్రారంభించాము.

నేను గత పది సంవత్సరాలుగా మైగ్రేన్ తల నొప్పితో బాధపడేదాన్ని! ఎంతో మంది డాక్టర్లకు చూపించి, ఎంతో ఖర్చుపెట్టాను కానీ... తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వతంగా నయం కాలేదు. మా బాబు సలహా మేరకు రోజుకు నాలుగైదుసార్లు నాలుగైదు గంటలు చొప్పున పూర్తి సంకల్పంతో ధ్యానం చేయడం ప్రారంభించాను. ధ్యాన సాధన పెరిగే కొద్దీ మైగ్రేన్‌నొప్పి ఎక్కువ కావడం ప్రారంభించింది. "ధ్యానం మానేద్దాం" అనుకుంటూన్న సమయమ్లో మా బాబు.. "ధ్యానంలో నొప్పి ఎక్కువై తరువాత క్రమంగా పూర్తిగా తగ్గిపోతుంది కనుక ధ్యానం మానవద్దు అని సలహా ఇచ్చాడు. అంతేకాక "చిన్న మాత్ర పైన వుండే నమ్మకం నీకు ధ్యానం పైన లేదా?" అని ప్రశ్నించాడు?

ఆ మాటలు నాకు బాగా స్పూర్తినిచ్చాయి. బాబు సలహామేరకు ఆ నొప్పిని భరిస్తూనే ధ్యానసాధన సమయాన్ని పెంచుకుంటూ వచ్చాను. రెండు మూడురోజుల తర్వాత ఆ నొప్పి తగ్గడం ప్రారంభించి 21 రోజులలో పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికి అయిదు సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి ఎప్పుడూ నాకు మైగ్రేన్ నొప్పిరాలేదు.

మా వారు గోపాలక్రిష్ణమూర్తి గారికి 2008వ సంవత్సరంలో విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది. కదలలేని పరిస్థితిలో డాక్టర్ దగ్గరకెళ్ళి X-Rayతీయిస్తే.. వెన్నెముక పగులు వచ్చిందనీ, రెండు నెలలు బెడ్‌రెస్ట్ తప్పనిసరిగా వుండాలనీ సలహా ఇచ్చారు. ఈ విషయం మా బాబుకు చెప్పితే "మీరేం భయపడద్దు! నమ్మకంగా ఇష్టంగా రోజుకు నాలుగుసార్లు 40 రోజులు ధ్యానం చెయ్యి డాడీ అదే తగ్గిపోతుంది" అన్నాడు. అలాగే ధ్యానం ప్రారంభించాను. ఆ సందర్భంలోనే బ్రహ్మర్షి పత్రీజీ క్లాస్ చిత్తూరులో పెట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన బాధ్యతలను చిత్తూరు మాస్టర్లు పూర్తిగా మా వారికి అప్పగించారు.

"నేను బెడ్‌రెస్ట్ తీసుకుంటే పత్రీజీ గారి ప్రోగ్రామ్ ఎలా జరిపించగలను? ఏదైతే అలా అవుతుందిలే" అని మా వారు ధ్యానంపైన పత్రీజీ పైన పూర్తిగా భారాం వేసి అహర్నిషలు ధ్యానం ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

నొప్పి ఉన్నా కూడా ఏ మాత్రం విశ్రాంతి లేకుండా పట్టణం మొత్తం సుడిగాలిలా పర్యటిస్తూ, కరపత్రాలు పంచుతూ, ధ్యానప్రచారం ప్రారంభించారు. రెండు మూడు రోజులు గడిచాక వెన్నునొప్పి ఎలా తగ్గిందో ఏమో.. తనతోపాటు ప్రచారం చేస్తున్నవాళ్ళు అడిగితే తప్ప.. తనకి వెన్నునొప్పి తగ్గిపోయిన విషయం వారికి గుర్తుకు రాలేదు. ఇలా మా కుటుంబంలో అందరం ధ్యానం ద్వారా ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నాం!

ఈ ఆనందాన్నీ.. ఆరోగ్యాన్నీ..సంతోషాన్నీ... సమాజంలో అందరికీ పంచితే బాగుంటుందనే విషయాన్ని మా వారికి చెప్పగా.. ఏ మాత్రం ఆలోచించకుండా దాదాపు 12 లక్షల రూపాయల స్వంత నిధులతో ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత అద్భుతంగా సెంట్రలైజ్డ్ ఎ/సి సదుపాయాలతో గౌతమ బుద్ధా ఎ/సి పిరమిడ్ హెల్త్‌కేర్ సెంటర్ జూలై 7, 2011 సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రీజీ అమృత హస్తాల మీదుగా మా పాఠశాలలోనే ప్రారంభించి ధ్యాన జగత్ కు అంకితం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పత్రీజీ "ధ్యాన విధ్యార్థి ప్రాజెక్టుకు ఈ కేర్ సెంటర్ హెడ్ క్వార్టర్స్‌గా ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ తప్పకుండా ఇందులో ధ్యానం చేయాలి" అని హితబోధ చేసారు.

ఇప్పుడు ప్రతిరోజు కొన్ని వందల మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారి జీవితాలను సుఖమయం చేసుకుంటున్నారు.

దాదాపు 750 మంది విద్యార్థులు క్రమం తప్పకుండా రోజుకు రెండు పర్యాయాలు ఈ కేర్ సెంటర్లో ధ్యానం చేసుకుంటూ అధికమైన మార్కులు సంపాదిస్తున్నారు; విద్యార్థులు మరి తల్లిదండ్రులు చాలా వరకు శాకాహారులుగా మారి.. ధ్యానం చేయడం ప్రారంభించారు.

ఇలా సమాజానికి మా వంతు కర్తవ్య సేవ చేసే మహాభాగ్యాన్ని మాకు అందించిన సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, బ్రహ్మర్షి పత్రీజీకి వినయపూర్వక ధన్యవాదాలు.

 

రాధికా గోపాల కృష్ణమూర్తి
చిత్తూరు
సెల్ : +91 9490906653

Go to top