" అంతా ధ్యానమయం, ధ్యాన ఆరోగ్య జగత్ 2012 "

 

"అందరికీ 2020 నాటికి ఆరోగ్యం" అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నినాదం. అయితే "ఆరోగ్యంతో పాటు 2012 నాటికి అందరికీ ధ్యానం ద్వారా ఆనందం మరి ఆత్మజ్ఞానం కూడా" అన్నది బ్రహ్మర్షి పత్రీజీ నేతృత్వంలో పిరమిడ్ డాక్టర్స్ యొక్క దృఢ సంకల్పం మరి నిశ్చయం. ఇందులో భాగంగా హైదరాబాద్ తదితర ప్రాంతాలలోని పలు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు మరి విద్యాసంస్థలలో ధ్యాన ఆరోగ్య జగత్ 2012 వర్క్‌షాప్‌లు నిర్వహించడం జరుగుతూ వుంది.

"వైద్యుల అనుభవాలు"

'శ్వాస మీద ధ్యాస' ధ్యాన శిక్షణా సేవ అద్భుతమైనదీ

"భక్తి మార్గంలో ఉంటూ ధ్యానం పై విశ్వాసం వున్న నేను పత్రీజీ మరి డాక్టర్ హరి గారు మా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్లకు మరి స్టాఫ్‌కు నిర్వహించిన ధ్యాన శిక్షణలో చాలా తక్కువ సమయంలోనే మనస్సు ప్రశాంతంగా అవటం, శారీరక అలసట తగ్గటం, నుదుటి భాగంలో కాంతి ఇలా... చక్కటి అనుభవం కలిగింది. "ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ అనవసరమైన మందులు, సర్జరీలు దూరం అవుతాయని ప్రగాఢంగా విశ్వసించే వైద్యులలో నేనూ ఒక్కణ్ణి. "పత్రి గారు ఆరోగ్య ప్రపంచాన్ని సృష్టించడంలో పైసా ఖర్చులేని 'శ్వాస మీద ధ్యాస' ధ్యాన శిక్షణా సేవ అద్భుతమైనదీ, అనిర్వచినీయమైనదీ. "డాక్టర్ హరికుమార్ తదితర పిరమిడ్ డాక్టర్స్ లాగా వైద్యులు అందరూ శారీరక, మానసిక మరి ఆధ్యాత్మికపరమైన సమతుల్యతను అందించే ధ్యానాన్ని పేషెంట్‌లకు నేర్పించనట్లయితే 2012 నాటికి అందరూ అరోగ్యాన్ని పొందగలరని నా దృఢ విశ్వాసం.

డాక్టర్ D.N.రావ్
M.D. డైరక్టర్ M.N.J. క్యాన్సర్ హాస్పిటల్

హైదరాబాద్


" ధ్యానం చేసినప్పుడు శరీరం అంత కూల్‍గా, మనస్సు ఎంతో ప్రశాంతంగా తయారయింది "

"ప్రపంచ ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ / సైకో సైబర్నెటిక్స్ గ్రంథంలో మాక్స్‌వెక్ 'అంతర్ సౌందర్యం పొందనంతవరకు బాహ్య సౌందర్యంలో ఎన్ని మెరుగులు దిద్దినప్పటికీ అసంపూర్ణమే' అని తెలిపారు. "ధ్యానం చేసినప్పుడు శరీరం అంత కూల్‍గా, మనస్సు ఎంతో ప్రశాంతంగా తయారయింది. హాస్పిటల్ వాతావరణంలో మొట్టమొదటిసారిగా నేను ఎక్కడ వున్నానో మాటలలో తెలియజేయలేని అనుభూతిని పొందాను.

"నా ప్రమేయం లేకుండా నా చేతులు మరి కాళ్ళు తల్లి గర్భంలో వున్న శిశువు శరీరం ముడుచుకుని వుండే విధంగా తయారై శ్వాస తీసుకునేందుకు వున్న కష్టాన్నీ పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ సెషన్‌లో అధిగమించాను. "కేవలం శరీరం మాత్రమే చికిత్స చేసే మాలాంటి డాక్టర్లకు జబ్బులకు మూలం మనస్సులోని నెగెటివ్ ఆలోచనలలోనే వుందనీ, గతజన్మలలో వాటి మూలం వుందన్న విషయాన్నీ థెరపీ సెషన్‌లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు వారి బాధలకు మూలం వారి గతజన్మలను చూసుకుంటూ... దూరం చేసుకుంటూ వుండటం నేను గమనించాను. నేను కూడా ఈ పిరమిడ్ ధ్యానాన్ని చేస్తూ మరి అందరిచేతా చేయించాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. "ముఖ్యంగా క్యాన్సర్ ఇతర స్ట్రెస్‌తో కూడుకుని వున్న దీర్ఘకాలిక వ్యాధులకు 'ధ్యానం అద్భుతమైన మెడిసిన్' అని నా అభిప్రాయం".

 

డాక్టర్ సుదర్శన్
ప్రొఫెసర్ ప్లాస్టిక్ సర్జరీ M.N.J.క్యాన్సర్ హాస్పిటల్
హైదరాబాద్


డాక్టర్ హరి కుమార్
హైదరాబాద్

Go to top