" pss.org వెబ్‌సైట్ "

 

నా పేరు హిమబిందు. నా భర్త సాయికృపాసాగర్. మాది బెంగుళూరు. మా ఇద్దరికీ పత్రిసార్ పరిచయం ద్వారా "www.pss.org" వెబ్‌సైట్ వర్క్ చేసే మహా అదృష్టం కలిగింది. మేము మా క్లోజ్ ఫ్రెండ్స్ వాణి & చంద్రశేఖర్ ల ద్వారా ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లోకి రావడం జరిగింది. మీకు తెలిసే వుంటుంది శ్రీ చంద్రశేఖర్ గారు పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ యొక్క సెక్రటరీ అని... వాళ్ళ ద్వారానే పత్రిసార్‌ని కలిశాం. నాకు నార్మల్‌గా చాలా కలలు వస్తూంటాయి. ఫిబ్రవరి 2005 లో ఒకసారి కలలో నాకు వెబ్‌సైట్ వర్క్ ఏదో అలాట్ అయినట్టు... నేను అది చేయాలి అన్నట్టు ... వచ్చింది. అప్పుడు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అందుకని దాని గురించి అంతగా పట్టించుకోలేదు.

ఫస్ట్ టైమ్ పత్రిసార్‌ని పిరమిడ్ వ్యాలీలో క్లాస్‌లో చూశాను. ఆయన క్లాస్ నాకు చాలా నచ్చింది. అప్పుడు ఆయనతో కలిసి పర్సనల్‌గా మాట్లాడలేదు. కానీ, తర్వాత చాలాసార్లు "నా కలలో పత్రిసార్ రావడం", "మెడిటేషన్ టెక్నిక్స్ నేర్పించడం", "ఎన్నో విషయాల గురించి విడమరచి చెప్పడం", "సార్ మా ఇంటికి వచ్చి మాతో స్టే చేసినట్లు" వచ్చేవి. నాకు మొదటి నుంచి వెబ్ డిజైనింగ్ అన్నా... యూజర్ ఇంటర్‌ఫేస్ డెవలప్ చేయాలన్నా... చాలా ఇంటరెస్టింగ్‌గా వుండేది. ఒకరోజు చంద్రశేఖర్ గారు క్యాజువల్‌గా ... "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌కి వెబ్‌సైట్ వుంది www.pss.org. దాన్ని మీరు టేకప్ చేసి రీడిజైన్ చేయవచ్చు కదా" అన్నారు. నాకు అది ఇంటరెస్టింగ్ వర్క్‌గా అనిపించి వెంటనే (అంటే మే 2005 లో) టేకప్ చేశాను. నేను, నా భర్త సాగర్ ఇద్దరం www.pss.org కి వెళ్ళి చూశాం. దాంట్లో వున్న కంటెట్ చదివి చాలా ఇంప్రెస్ అయ్యాం. పత్రిసార్ అనుమతి ఇస్తే ఆ వర్క్ చేయాలని అనుకున్నాం. పత్రిసార్ O.K. చేశారు. నేను, సాగర్ కూర్చుని దాన్ని స్టడీ చేసి first we decided to give ita a new look & feel. దాన్ని రివ్యూ చేయడానికి పత్రిసార్‌ని మా ఇంటికి ఆహ్వానించాం. ఫస్ట్‌టైమ్ పత్రిసార్ మా ఇంటికి వచ్చినప్పుడు we were thrilled and excited. "ఇది కలా, నిజమా?" అనిపించింది. "అంత పెద్దాయన, అంత గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం ఏంటి? మాతో స్పెండ్ చేయడం ఏంటి? ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో" అనిపించింది.

ఫస్ట్ రివ్యూ సెషన్ చాలా బాగా జరిగింది. www.pss.org ని ఇంప్రూవ్ చెయ్యడానికి సార్ చాలా ఐడియాస్ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి నెలా బెంగుళూరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మినిమమ్ నాలుగైదు గంటలు వెబ్‌సైట్‌మీద సార్ టైమ్ స్పెండ్ చేసేవారు... బెంగుళూరు వచ్చినప్పుడల్లా.. వెబ్‌సైట్‌లో వుండే కంటెంట్‌ని రిఫైన్ చేస్తారు. అలా కంటెంట్‌ని రిఫైన్డ్ చేసి చేసి బాగా కాచి వడగట్టి మళ్ళీ ఆ రిఫైన్డ్ కంటెంట్‌ని వెబ్ లోకి అప్‌లోడ్ చేసేవాళ్ళం. మన pss.org వెబ్‌సైట్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వెబ్‌సైట్ కావాలి అని పత్రీజీ యొక్క ఉద్దేశ్యం. ఫైనల్‌గా... నూతన వెబ్‌సైట్‌ని 2005 సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేశాం. విడుదల చేశాక చాలా ప్లేసెస్ నుంచి మాకు e-mails వచ్చాయి. ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్‌ నుంచి, అమెరికా నుంచి, ఇండియాలో చాలా ప్లేసస్ నుంచి "వెబ్‌సైట్ చాలా చాలా బాగుంది" అని, ఒకరు e-mail వ్రాశారు... "www.pss.orgవల్ల నేను సింగపూర్‌లో వున్నా కూడా 'ధ్యానాంధ్రప్రదేశ్' చదవగలుగుతున్నాను. థ్యాంక్స్ టు ది వెబ్‌సైట్ టీమ్" అని.

అలాంటి e-mails చదివినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడలేని ఎనర్జీ, ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం తోటి వెబ్‌సైట్‌ని ఇంకా ఇంకా చాలా డెవలప్ చేయాలనీ, చాలా ఫీచర్స్ యాడ్ చెయ్యాలనీ, ప్రతిసారీ సరిక్రొత్త యాంగిల్స్ ఇవ్వాలనీ అనిపిస్తుంది. ఈ సరిక్రొత్త వెబ్‌సైట్ launch చేయకముందు 2005 లో ప్రపంచం మొత్తంగా మన www.pss.org ని 54,166 మంది చూశారు. మన www.pss.org ని new look తోటి + extra ఫీచర్స్ తోటి + అడిషనల్ ఇన్‌ఫర్మేషన్ & మోర్ కంటెంట్ తోటి లాంచ్ చేశాక ... 2006 లో ప్రపంచం మొత్తంగా ... 3,52,347 మంది విజిట్ చేశారు www.pss.orgని. ప్రతి నెలా కొన్నివేలమంది www.pss.org ని చూస్తారు. వీళ్ళందరికీ మాగ్జిమమ్ ఇన్‌ఫర్మేషన్ వెబ్ ద్వారా అందచేయాలనే మా తాపత్రయం. పత్రిసార్ బోధనలు, సందేశాలు, ఆడియోస్, వీడియోస్, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ కార్యక్రమాలు, మ్యాగజైన్స్... "స్పిరిచ్యువల్ ఇండియా", "ధ్యానాంధ్రప్రదేశ్", "ధ్యాన తమిళనాడు", "ధ్యాన కర్ణాటక" ... ఇవన్నీ ప్రపంచంలో నలుమూలల వాళ్ళకి అందుబాటులో వుండాలి అన్నదే మన www.pss.org యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

"పిరమిడ్ రేడియో"

ఈ మధ్యనే'పిరమిడ్ రేడియో'అన్నదానిని వెబ్‌సైట్‌లో క్రొత్తగా పెట్టాం. మా క్లోజ్ ఫ్రెండ్ వొన్నా రాజశేఖర్ గారు ఈ పిరమిడ్ రేడియోని కనిపెట్టి వెబ్‌సైట్‌కి చాలా చాలా హెల్ప్ చేశారు. నార్మల్ రేడియోలో షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ వచ్చినట్టు పిరమిడ్ రేడియోలో స్పిరిచ్యువల్ ప్రోగ్రామ్స్ వస్తాయి. మేము ఇప్పుడు పత్రిసార్ ఫ్లూట్ మెడిటేషన్, ధ్యాన వేణువు, ఇంగ్లీష్ ఆడియోస్, తెలుగు ఆడియోస్, హిందీ ఆడియోస్ ఇరవై నాలుగుగంటలూ వినిపిస్తున్నాం. త్వరలో ప్రోగ్రామ్స్‌ని కూడా షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్‌ని వెబ్‌లో పెడతాం. అప్పుడు ఎవరు ఏ ప్రోగ్రామ్ వినాలంటే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ టైమింగ్‌కి పిరమిడ్ రేడియోని సెట్ చేసుకుంటె వినవచ్చు.

సాగర్ గారు ఆన్‌లైన్ షాపింగ్ ప్రోగ్రామ్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అతిత్వరలో అది కార్యరూపం దాల్చగలదు. ఆన్‌లైన్ స్టోర్ పెట్టిన తర్వాత... మ్యాగజైన్ సబ్‌స్క్రిప్షన్ రెన్యువల్ చేయాలన్నా, న్యూ సబ్‌స్క్రిషన్ తీసుకోవాలన్నా.. లైఫ్ మెంబర్‌షిప్ తీసుకోవాలన్నా... కాటేజ్/రూమ్ స్పాన్సర్‌షిప్ చేయాలన్నా.. మనీ డొనేట్ చేయాలన్నా ... పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్‌కి గానీ, మైత్రేయ బుద్ధా పిరమిడ్‌కి గానీ, లేకపోతే... బుక్స్, C.D.'s, క్యాసెట్స్. VCD's/DVD's కొనాలన్నా just ఇంటర్నెట్ ద్వారా www.pss.org కి వెళ్ళి అన్నీ దాంట్లోనే చేయవచ్చు. అందరూ www.pss.org ని విజిట్ చేసి దాంట్లో ఫీచర్స్‌ని, ఫెసిలిటీస్‌ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాం. నేను, నా భర్త సాగర్ ఇద్దరమూ ప్రతిక్షణం ఈ కార్యక్రమంలో ఎంత ఆనందం పొందామో చెప్పలేం. పత్రిసార్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక ప్రక్క వంటలు వండుతూ మరోప్రక్క వెబ్‌సైట్ చూస్తూంటారు. ఆయన దగ్గరి నుంచి ఎన్నో వంటలు నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతాలలో అద్భుతం పత్రిగారికి ప్రత్యేక ధన్యవాదాలు.

 

P.హిమబిందు
బెంగళూరు

Go to top