" జై ధ్యాన జగత్ "

 

నా పేరు ఆనం వాసుదేవయ్య. వయస్సు 35 సంవత్సరాలు. మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రక్కన గల చిగురుపాడు గ్రామం. నాకు గత ఐదు సంవత్సరాలుగా B.P. వుంది. దానికి టాబ్లెట్స్ వాడేవాడిని. 2006 నవంబర్ నుంచి పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి, నోరు పడిపొయ్యాయి. మూత్రవిసర్జనకు కూడా ట్యూబ్ అమర్చారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో పిరమిడ్ మాస్టర్ చక్రిసార్ నాకు పిరమిడ్ క్యాప్ ఇచ్చి ధ్యానం చేయడం నేర్పారు. ఆ తర్వాత పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ సార్ నాతో దాదాపు నెలరోజులు ఉదయం సాయంత్రం 45 నిమిషాలు ధ్యానం చేయించారు. నేనిప్పుడు చక్కగా నడవగలుగుతున్నాను. పూర్తిగా బాగా మాట్లాడగలుగుతున్నాను. చేయి కూడా నెమ్మదిగా యాక్టివ్ అవుతోంది. చెన్నై విజయలక్ష్మి మేడమ్ గారు మా గ్రామంలో క్లాసు నిర్వహించారు. ఊహించని క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన పిరమిడ్ ధ్యానానికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరని అందుకు నేను ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలియజేస్తూ...

జై ధ్యాన జగత్.

 

A.వాసుదేవయ్య
నాయుడుపేట

Go to top