" శేష జీవితం అంతా ధ్యాన ప్రచారమే "

 

నా పేరు సునాదమ్మ. మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట. మొదటినుంచీ సత్యం తెలుసుకోవాలనే ఆరాటంతో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల గడపలు ఎక్కాను దిగాను. చివరకి కల్కి భగవాన్ సత్సంగంలో చేరాను. అక్కడ కూడా నాలో ఎదో తెలియని వెలితి. అప్పుడే మా ఇంటి దగ్గరలోని 'సదానందయోగి పిరమిడ్ ధ్యానకేంద్రం' పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసగాంధీ గారిని కలవడం పిరమిడ్ ధ్యానం గురించి తెలుసుకుని ఆచరించి అచ్చెరువొందాను. ఎందరో డాక్టర్స్‌ను కలిసినా తగ్గని నా తలనొప్పి ఈ మెడిటేషన్ ప్రారంభించిన కొద్దికాలంలోనే బాగా తగ్గిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. బ్యాక్ పెయిన్ కూడా తగ్గుముఖం పడుతోంది. ఈ ఉత్సాహంతో, నాలాగా ఎవరికీ సమయం వృధా కారాదని భావించి నెల్లూరు సీనియర్ మాస్టర్ M.ఆనందరావు గారిచే రామ్తా పిరమిడ్ ధ్యానకేంద్రం మా ఇంటి వద్దనే ప్రారంభించి గ్రామంలో అందరికీ ఉచిత ధ్యానశిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాను. నా శేషజీవితం ధ్యానం ప్రచారంతో ధన్యత పొందాలని ఆశిస్తూ.. ధ్యాన ప్రచారమే ధన్య జీవితం.

 

T.సునాదమ్మ
నాయుడుపేట

Go to top