" మనకు మనమే డాక్టర్లం "

 

నా పేరు గీత. మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట. ధ్యానంలోకి రాకముందు నాకు గొంతులో గడ్డ(థైరాయిడ్ ప్రాబ్లమ్) వుంది. "ఆపరేషన్ చేసి తీయాలి" అని పెరంబూర్ డాక్టర్స్(చెన్నై) చెప్పారు. ఆ సమయంలో పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ, నాయుడుపేట, కలిసి "పదిరోజుల్లోధ్యానం ద్వారా థైరాయిడ్ తగ్గుతుంది" అని తెలిపారు.

పదిరోజుల్లో నాకు కలిగిన అనుభవాలు :

మొదటిరోజు నేను ధ్యానంలో మాస్టర్‌తో "నాకు థైరాయిడ్ తగ్గితే డాక్టర్ దగ్గరికి పోను లేదంటే డాక్టర్‌నే నమ్ముతాను" అని చెప్పి శ్వాస మీద ధ్యాస వుంచాను. ఎంతో ఎనర్జీ నాలోకి రావడం అనుభూతి చెందాను. మూడవరోజు ధ్యానంలో మాస్టర్స్ పిరమిడ్ చూపించి దానిని వాడమన్నారు. పిరమిడ్ క్యాప్ పెట్టుకుని ధ్యానం చేస్తూంటే థైరాయిడ్ తొందరగా తగ్గింది. ఏడవరోజు ఆస్ట్రల్‍గా మాస్టర్స్ నాచే ధ్యానం చేయించారు. చివరిరోజు ధ్యానం చేస్తున్నప్పుడు ఎనర్జీ నాలో అపారంగా ఫ్లో అవుతూ థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగా పోవడం నాకు క్లియర్‌గా తెలిసింది. అప్పటినుంచి నేను ధ్యానం చేస్తూ వున్నాను. ఈ అనుభవం ద్వారా నాకు తెలిసిన సత్యం "మనకు మనమే డాక్టర్లం" అని. కనుక మనందరం ధ్యానం చేస్తూ అందులోని ఆనందాన్ని అనుభవిస్తూ, జీవిత సత్యాలను నేర్చుకుంటూ అందరికీ నేర్పిస్తూ పత్రీజీ గారి సుందరస్వప్నం ధ్యానజగత్ కోసం కృషిచేద్దాం.

 

A.గీత
నాయుడుపేట

Go to top