" స్పిరిచ్యువల్ సేవ ఎంతో తృప్తినిస్తోంది "

 

పేరు మధుసూదన్. 1996 సంవత్సరంలో B.Tech. కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న రోజులు. 1996 లోనే కర్నూలు బుద్ధా ధ్యానకేంద్రానికి పోయి పిరమిడ్ ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం నేర్చుకున్నది కర్నూలు పిరమిడ్‌లో శ్రీ చంద్రశేఖర శర్మ గారి దగ్గర. ఆయన నన్ను సమీర్ బాబా సమాధి మీద కూర్చోబెట్టి ధ్యానం నేర్పించారు. నేను ఆయనను ఏం ప్రశ్నలు వేసిందీ, నాకు ఏం ఎక్స్‌పీరియన్స్ కలిగిందీ, పిరమిడ్‌లో నేను ఎక్కడెక్కడ తిరిగిందీ అంతా గుర్తుంది. అయితే, నేను మా ఇంటి నుంచి పిరమిడ్ దగ్గరకు ఎలా వెళ్ళాను? ఎందుకు వెళ్ళాను? ఎవరి ప్రోత్సాహంతో ధ్యానం నేర్చుకోవటానికి వచ్చాను? ఇవన్నీ.. అంతుపట్టని ప్రశ్నలు.

"పిరమిడ్ జగత్"

1996 నుంచి అప్పుడప్పుడు ధ్యానం చేసేవాడిని. అది కూడా మా ఇంట్లోనే. పిరమిడ్ మాస్టర్స్‌తో పెద్దగా పరిచయాలు వుండేవి కావు. అలాంటిది 2003 నా జీవితంలో మెగా టర్నింగ్ పాయింట్. 2003 ఫిబ్రవరిలో పత్రిసార్‌ని కలిసినప్పుడు నాకు ఓ చిన్న బాధ్యత అప్పజెప్పారు. అది ఏమిటంటే "ప్రపంచంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో పిరమిడ్ వుండాలి.. నాకు పిరమిడ్ జగత్ కావాలి" అని చెప్పారు. దాంతో నేను ఆశ్చర్యానికి లోనై ఏదో "సార్ చెప్పారు కదా" అని తల ఊపాను.

" ఉద్యోగానికి రాజీనామా "

అంతే, అంవరకు ఒక కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న నేను స్పిరిచ్యువల్ వర్క్ చెయ్యాల్సిన టైమ్ వచ్చిందో ఏమో ఆఫీస్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా వుండటం, పిరమి డ్లు నిర్మించాలన్న చాలా బలమైన కోరిక నాలో మొదలవడం... దాంతో నేను 2003 మార్చి 31 న ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ గ్రామాలలో, వివిధ రాష్ట్రాలలో సుమారు 80 పిరమిడ్లు నిర్మించాను. ఇంకా 24 పిరమిడ్లు నిర్మాణదశలో వున్నాయి.

"దేవాలయాలన్నీ పిరమిడ్ ధ్యానాలయాలు"

ప్రతి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌లో కానీ, టెక్నాలిజీలో కానీ తేడా వుంటుంది. దేశంలోనే మొదటిసారి పిరమిడాలజీ ప్రకారం ధ్యానం కోసం పూర్తిస్థాయి 'పిరమిడ్ హౌస్'ను రాజమండ్రిలో నిర్మించటం జరిగింది. ఇప్పటివరకు అనేకానేక పిరమిడ్లు ఇంటి పైన, స్కూల్స్‌లో, హాస్పిటల్స్‌ల్, ఆఫీసుల్లో, షాపింగ్ కాంప్లెక్స్‌లపై నిర్మించటం జరిగింది. పత్రీజీ చెప్పిన ప్రకారం "దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారతాయి" అన్న దానికి ఋజువుగా ఇప్పటివరకు 12 దేవాలయాల్లో పిరమిడ్ నిర్మించటం జరిగింది. చివరకు తమిళనాడులోని ఈరోడ్‌లో 70'X70' పిరమిడ్ క్రిమటోరియం (స్మశానం)లో కూడా నిర్మాణం జరుగుతోంది. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో ఓ స్కూల్ ఆవరణలో 25'X25' పిరమిడ్ నిర్మించి రోజులో ఒక పీరియడ్ కంపల్సరీగా పిల్లలచేత ధ్యానం చేయిస్తున్నారు.

"ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా"

ధ్యానం గురించి, పిరమిడ్ల నిర్మాణం గురించి కేవలం పిరమిడ్ సొసైటీయే కాకుండా ఇప్పుడు ఇతర ఆధ్యాత్మిక సంస్థల వారు కూడా విశేషంగా పిరమిడ్ ధ్యానకేంద్రాలు స్థాపిస్తున్నారు. ఉదాహరణకు యుక్తేశ్వరి గురుపీఠ్, వర్ధా వాళ్ళు 60'X60' పిరమిడ్, జైన గురువులు ప్రీతిసుధ మహరాజ్ పూణెలో 33'X33' పిరమిడ్, ఓషో ధార వ్యవస్థాపకులు స్వామి అఖిల్ సరస్వతీజీ హైదరాబాద్ యాప్రాల్‌లో 70'X70' పిరమిడ్, బ్రహ్మకుమారీస్ వాళ్ళు హుబ్లిలో 60'X60' పిరమిడ్‌లు.

ధ్యాన అనుభవాలు... నాకు ఎప్పుడైనా ఏ పిరమిడ్ కైనా డిజైన్ చేస్తున్నప్పుడు కష్టంగా ఫీలైతే దానికి మాస్టర్స్ నుంచి పరిష్కారంగా విజన్ రూపంలో ధ్యానంలో వస్తుంది. నేను నెలకు మూడువారాలు పిరమిడ్ల నిర్మాణానికై దేశమంతా తిరిగిన ఈ స్పిరిచ్యువల్ సేవ ఎంతో ఎంతో తృప్తినిస్తుంది.

 

P.మధుసూదన్
B.Tech

ఫ్లాట్ నెం. 002,ఇం.నెం.16-107,అజయ్ రెసిడెన్సీ, మిర్జాలగూడ
మసీదు ఎదురుగా, మల్కాజ్‌గిరి, హైదరాబాద్-500047
సెల్ : +91 93913 31757, ఫోన్ : +91 040 32991757

Go to top