"జగిత్యాల సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పొందిన పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపి అనుభవాలు"

IMA ఆధ్వర్యంలో డాక్టర్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో, జగిత్యాల

 

 

 


" చాలాకాలంగా తగ్గని నా కాలునొప్పి ఒక్క సెషన్‌లో పూర్తిగా తగ్గటం విశేషం "

"గొప్ప గొప్ప జడలతో ఓ మహర్షి అందరికీ ఆయుర్వేద వైద్యాన్ని చేస్తూ వున్న ఒక జన్మ చూసుకోవడం జరిగింది. ప్రస్తుతం నాకు అందరికీ ఆరోగ్యం పట్ల మరి ధ్యానం అవగాహన కలిగించాలన్న కోరిక ఈ జన్మ నుంచి ప్రారంభమైందన్న విషయం స్పష్టమయింది. "సప్త ఋషులలో ఒకరైన నా పూర్ణాత్మతో అనుసంధానం జరిగి అంతా విష్ణుమయం మరి అంతా నేనే అన్న భావం చాలా కొద్దిసమయంలో పొందాను. చాలాకాలంగా తగ్గని నా కాలునొప్పి ఒక్క సెషన్‌లో పూర్తిగా తగ్గటం విశేషం."

వూటూరి చంద్రశేఖర్


" సెషన్ తర్వాత తక్కువ సమయంలో గాఢమైన ధ్యానం కుదరడం విశేషం "

"ధర్మపురి అనే గ్రామంలో ఓ బ్రాహ్మణ కులంలో ఒక తమ్ముడు మరి ఇద్దరు చెల్లెళ్ళు గల జన్మ చూసుకోవడం 125 సంవత్సరాల వయస్సులో 1947 సంవత్సరం గోదావరీ నదీ స్నానానికి వెళ్ళి సుడిగుండంలో పడి మరణించినట్లుగా అనుభవం కలిగింది. సెషన్ తర్వాత తక్కువ సమయంలో గాఢమైన ధ్యానం కుదరడం విశేషం."

శ్రీకాటిపల్లి.గంగారెడ్డి
మాజీ మండలాధ్యక్షులు,
రాయకల్


" ప్రస్తుతం తీసుకున్న జన్మ ఆఖరి జన్మ అవుతుందని చెప్పడం జరిగింది "

"ముగ్గురు తమ్ముళ్ళతో హరిజన కుటుంబంలో పుట్టి 20 సంవత్సరాల వరకు ఎన్నో కష్టాలు అనుభవించిన జన్మ చూసుకోవడం జరిగింది. 20 సంవత్సరాల వయస్సులో జీవితపరమార్ధం ఏమిటి అని తోటి స్నేహితులను ప్రశ్నిస్తూ, వాదిస్తూ జలపాతంలో పడి మరణించినట్లు తెలిసింది. మరణం తర్వాత ఊర్ధ్వలోకాలకు వెళ్ళి 'ఎందుకు అన్ని కష్టాలు పడుతూ అలా అకస్మికంగా మరణించాను?' అని మాస్టర్‌ను అడగ్గా కేవలం కర్మను అనుభవించేందుకు జన్మించాలని ప్రస్తుతం తీసుకున్న జన్మ ఆఖరి జన్మ అవుతుందని చెప్పడం జరిగింది."

చెన్న సౌజన్య
ఇటిక్యాల


" సన్యాసిగా మోక్షం సాధించడం కంటే సంసారిగా వుంటూ ధ్యానం చేస్తూ మోక్షం సాధించాడానికే ఈ జన్మ "

"కాషాయ వస్త్రాలతో ఒక యువ సన్యాసిగా ఓ గురువు దగ్గర ధ్యానం చేస్తున్నట్లుగా చూడటం... ఆ గురువు ధ్యానం చేస్తున్నట్లుగా చూడటం... ఆ గురువు పత్రిగారే అని తెలియడం... 'సన్యాసిగా మోక్షం సాధించడం కంటే సంసారిగా వుంటూ ధ్యానం చేస్తూ మోక్షం సాధించాడానికే ఈ జన్మ' అని తెలిసింది."

వూటూరి లక్ష్మీ శ్రీధర్


" గాఢమైన ప్రశాంతత పొంది పూర్తిగా నొప్పి తగ్గింది "

"రెండు సంవత్సరాలుగా డిస్ట్ ప్రొలాప్స్ మరి సయాటికా నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న నేను కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రంలో 15 రోజులు ధ్యానం చేయగా 15% తగ్గింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గుణాకర్ సలహా మేరకు డాక్టర్ హరి గారి థెరపీలో పాల్గొన్న మొదటిరోజు గాఢమైన ప్రశాంతత పొంది పూర్తిగా నొప్పి తగ్గింది. 15 రోజులు గడిచినా నొప్పి ఇప్పటికీ తెలియకపోవటం విశేషం."

సోమరాజు
పూనె

Go to top