" భీమాస్ రెసిడెన్సీలో ధ్యానం మరి పాస్ట్‌లైఫ్ థెరపీ వర్క్‌షాప్ "

 

ధ్యాన ఆరోగ్య జగత్ 2012 లో భాగంగా పాస్ట్‌లైఫ్ థెరపిస్ట్ డాక్టర్ హరికుమార్‌చే తిరుపతి స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో భీమాస్ రెసిడెన్సీలో ధ్యానం మరి పాస్ట్‌లైఫ్ థెరపీపై వన్‌డే వర్క్‌షాప్ ఏప్రిల్ 8 న జరిగింది. తిరుపతి, తిరుచానూరు, మదనపల్లి, వాయల్పాడు, కాళహస్తి, నాయుడుపేట, గూడూరు, చెన్నై, రాజంపేట, కోడూరు, రేణిగుంట, మరి చంద్రగిరి పిరమిడ్ మాస్టర్లు వందమంది పాల్గొనగా సుమారు 18 మంది గత జన్మలు, 34 మంది తల్లి గర్భంలోని స్థితిని అనుభవించారు.

"ఇన్ని సంవత్సరాల నా ఆధ్యాత్మిక జీవితంలో అమోఘమైన ప్రశాంతతను అనుభవించడం ఇదే మొదటిసారి. నా శ్రీమతి ఉదయం నుంచి సాయంత్రం వరకు 'జరిగిన సెషన్' లో పూర్తిగా పాల్గొని గాఢమైన ప్రశాంతత పొందింది. ఇటువంటి విజ్ఞాన వినోద భరితమైన స్పిరిచ్యువల్ సెషన్స్‌పై ప్రతినెల వర్క్‌షాప్ నిర్వహించాలని నిశ్చయించుకున్నాను."

భీమాస్ రఘు


" తల్లిగర్భంలో చిన్న శిశువుగా వున్నఅనుభవం అద్వితీయం "


కంచి రఘురాం 

 


"ఒక సైనికుడుగా వున్న జన్మ చూసుకోవడం, ఆ జన్మలో పత్రిసార్ గురువుగా కనబడటం, యుద్ధంలో చనిపోయిన తరువాత ఊర్థ్వ లోకాలలో పత్రీజీని మరి సాయిబాబాను చూడటం జరిగింది."

ఇందిర
బళ్ళారి


"ఆనందమయ జీవితంపై వున్న కొద్ది సమయంలోనే ఎన్నో విషయాలు తెలుసుకోవడం మరి గాఢమైన విశ్రాంతి పొందడం జరిగింది."

భీమాస్ బాలాజి


"ఫ్రాక్చర్ వల్ల మడవడానికి వీలుగా లేని నా కుడికాలు సెషన్ తర్వాత మడవడమే కాకుండా నేలపై కూర్చోగలిగాను."

నాయుడు
తిరుపతి

Go to top