" అద్భుత స్వప్నం "

 

బెంగుళూరు...పిరమిడ్ వ్యాలీ...
ఒకరోజు నాకు వచ్చిన కల...
కలలో... మా అత్తగారు సావిత్రీదేవి కనిపించారు.

"నేను లేనని ఖంగారు పడుతున్నావా?
ఇదిగో...నా హస్తవాసిని నీకు ఇస్తున్నాను."
అని చెప్పి ఆవిడ కుడిచేతిని నా చేతి మీద ఉంచగానే... ఫుల్ వైబ్రేషన్స్ కలిగాయి.

ఆ తర్వాత.
మరో విజన్ ప్రారంభమైంది

"ఇండియా మ్యాప్ మొత్తం సిల్వర్ కలర్‌లో వుంది.
మనుష్యులు కూడా కనిపిస్తున్నారు.

మ్యాప్ మధ్యలోంచి పత్రీజీ తల పైకి ... పైపైకి వచ్చింది.
చుట్టూ కలియజూస్తున్నారు.

ఆయన ముఖం కూడా సిల్వర్ కలర్‌లో వుంది.
ఎంతో దేదీప్యమానంగా వెలుగుతోంది.
మళ్ళీ కాస్సేపటి తర్వాత పత్రీజీ ముఖం గ్లోబులో కనిపిస్తోంది.

పత్రీజీ గ్లోబులో కూడా చుట్టూ చూస్తున్నారు.
ఆ గ్లోబుకి ఓ నిచ్చెన వుంది.
పత్రీజీ ఆ నిచ్చెన ఎక్కి
చిట్టచివరకు వెళ్ళి, ఆ గ్లోబు మీద
'హమ్మయ్య' అని కూర్చున్నారు.
ఒక సిగరెట్ జేబులో నుంచి తీసి హాయిగా వెలిగించారు"

ఆ తర్వాత ఒక మంచం మీద
అత్తగారు కూర్చున్నారు... ఆ మంచం
అలా అలా పై లోకాలకు వెళ్ళిపోయింది.

 

స్వర్ణమాలా పత్రి

Go to top