" అందరికీ ధన్యవాదాలు "

 

నా పేరు "అప్పాజి"

నేను 2011 డిసెంబర్‌లో విశాఖపట్టణం ధ్యానమహాచక్రం-2 కార్యాచరణ కమిటీలో ప్రచార కమిటీ, ఆర్థిక వనరుల కమిటీ బాధ్యతలను తీసుకున్నాను. 2011 జూలై నెల నుండే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలో ధ్యానమహాచక్రం-2 ప్రచారాన్ని ప్రారంభించిన నేను, వర్మరాజు, పాండురంగారావు బృందంతో జగదీశ్వరీ మేడమ్, మురళీగారి బృందంతో కలిసి పనిచేసాను.

ఆగస్టు 15వ తేదీ నుండి ఆర్థిక వనరుల సమీకరణ ప్రారంభించాం. MLA లకు, కార్పొరేటర్లకూ, అధికారులకూ, లయన్స్‌క్లబ్‌ల వారికీ, రోటరీ క్లబ్ వారికీ, భారత వికాస్ పరిషత్తుల వారికీ, పెట్రోల్ బంక్‌ల వారికి, బిల్డర్లకు, జువెలరీ షాపులవద్దకూ, బట్టల షాపులకూ, హోటళ్ళ వారి వద్దకూ, పెద్ద పెద్ద ఆస్పత్రులకూ, గ్రూపులు గ్రూపులగా వెళ్ళి ధ్యానం గురించి చెప్పుతూ అమరావతి ధ్యానమహాచక్రం-1 విశేషాలు చెప్పేవాళ్ళం. ధ్యాన మహాచక్రం-2లో జరిగే పనులను వచ్చి చూడమని ఆహ్వానించేవారం. MLC రత్నకుమారి గారితో కలిసి మేము ఈ ధ్యానప్రచారం చేసాం.

MLC దాడి వీరభద్రరావు గారు కూడా ప్రాంగణానికి విచ్చేసి ధ్యానమహాచక్రం-2 కు కొన్ని సలహాలు ఇచ్చారు. నవంబర్ 15 నుంచి గ్రూపులుగా పిరమిడ్ ట్రస్ట్‌కు చెందిన తొమ్మిది మంది సభ్యులు, విజయలక్ష్మి, సరస్వతి, కిషోర్, RRG లక్ష్మి, కళ్ళు చిదంబరం, బయలుదేరి వెళ్ళి అన్నదాన కార్యక్రమానికి కావలసిన నిధులను సమకూర్చుకోవడం మొదలు పెట్టాం.

సెప్టెంబర్‌లో జగదీశ్వరీ దేవి, ఆశ, రమణమ్మ గార్లతో కలిసి ఉభయ గోదావరి జిల్లాలు తిరిగాం, ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేసే ముందు "కలెక్షన్ ఎక్కువ రావాలి మరి కోటి రూపాయలు మిగిల్చి మెగా పిరమిడ్‌కు ఇవ్వాలి" అని సంకల్పం పెట్టుకునేవాళ్ళం. తటవర్తి వీరరాఘవరావు గారు వారం, ఫోన్లు చేసి "ఆర్థిక వనరులు సమీకరించే వారికి టెన్షన్ ఉంటుంది; మీరు ధీమాగా పనిచేయండి; మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా నిధులు వస్తాయి" అంటూ ప్రోత్సహించేవారు.

ధ్యానమహాచక్రం విశాఖపట్టణానికి ఎనౌన్స్ చేసిన వెంతనే పిరమిడ్ వ్యాలీ ట్రస్టు మెమ్బర్ మురళీ రాజు గారు పత్రీజీ సమక్షంలో లక్షరూపాయలు ఎనౌన్స్ చేసి మా కలెక్షన్‌ల కు శ్రీకారం చుట్టినందుకు వారికి కృతజ్ఞతలు. ధ్యానమహాచక్రం-2 కార్యక్రమానికి వచ్చి విరాళాలు ఇచ్చినవారికీ, రాలేకపోయినా విరాళాలు పంపిన ఎంతో మంది ధ్యానులకూ, శతకోటి వందనాలు.

ధ్యానమహాచక్రం-2లో నాకు ఎక్కువ పని కల్పించి.. నేను ఆనందంగా గడపడానికి అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రీజీకి సహస్ర శతకోటి నమస్సుమాంజలులు!

 

అప్పాజీ
విశాఖపట్టణం
సెల్ : +91 93944 15597

Go to top