" ఇప్పుడు నేను గొప్ప మాస్టర్ని"

 

నా పేరు అన్నపూర్ణ. 2000 సంవత్సరం నుంచి నేను తీవ్ర అనారోగ్యం తో బాధపడుతూ దానికి తోడు 2009 సంవత్సరం నుంచి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను.

రోజుకి 22 నుంచి 25 బిళ్ళలు వాడేదాన్ని. దాని వల్ల నాకు వేరే బాధలు కూడా వచ్చి పిల్లల్ని చూడాలంటేనే కష్టంగా వుండేది. ఇది చాలదంటూ 2010 అక్టోబరు నుంచి చికెన్‌గునియా, మరి మలేరియా వ్యాధులతో కూడా నేను చాలా బాధపడ్డాను. శరీరంలో రక్తశాతం తగ్గిపోయి నీటి శాతం పెరిగిపోయింది. కుడి చేయి, మరి కుడి కాలు పనిచెయ్యడం చాలా కష్టంగా మారడంతో "నేను ఎవ్వరికీ ఉపయోగపడలేక పోతున్నాను" అని బాధ వేసి ఇంక నాకు బ్రతకాలి అనిపించలేదు.

జీవితం మీద విరక్తితో రోజులు వెళ్ళదీస్తున్న నేను 2011 నవంబరు 1వ తేదీ.. ఇంటి నుంచి బయటకు వచ్చి నా స్నేహితుల సహాయంతో శేషు గారిని కలిసి వారి ద్వారా గుంటూరు జిల్లా నెక్కలు ధ్యానమందిరంకు వెళ్ళాను. అక్కడ "శ్రీమతి సావిత్రి దేవి రమణరావు ధ్యాన‌అశ్రయం" లో మూడు రోజులపాటు పూర్తిగా ధ్యానంలో ఉండిపోయాను. ఆ పిరమిడ్ వైబ్రేషన్స్ అమోఘం. కీళ్ళనొప్పులతో కనీసం పదినిమిషాలు కూడా కూర్చోలేని నేను.. అలా ఏకధాటిగా మూడు రోజుల పాటు ధ్యానంలో కూర్చుండి పోయాను. అతి కొద్ది సమయంలోనే నా శరీరంలో రోగాలు చక్కగా తగ్గిపోయి అక్కడ నుంచి ఒంటరిగా ఇంటికి వచ్చాను.

స్వస్థత పడిన శరీరంతో ఉన్న నన్ను చూసి మా వారు మరి మా తోటివారు చాల సంతోషం, మరి ఆశ్చర్యం పొంది ధ్యానం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నారు.

మెల్లమెల్లగా నా ఆరోగ్యం కుదటపడటంతో ఇక నేను రెట్టించిన ఉత్సాహంతో ఇల్లిల్లూ తిరుగుతూ ధ్యానప్రచారం మొదలుపెట్టాను. నా ధ్యానప్రచారం ద్వారా దాదాపు 30 మంది శారీరక, మానసిక మరి ఆత్మపరమైన లాభాలను పొంది ఎంతో సంతోషంతో "కేర్" అనే పేరుతో "చింతపూడి" లో ఒక పిరమిడ్ సెంటర్ కూడా ప్రారంభించుకున్నారు.

ఒకనాడు "ఎవ్వరికీ పనికిరాను" అనుకున్న నన్ను.. విశ్వానికి పనికి వచ్చే ఒక అద్భుతమైన మాస్టర్‌గా తయారు చేసిన ధ్యానానికీ..మరి ఆ ధ్యానాన్ని అందరికీ చేరవేస్తోన్న బ్రహ్మర్షి పత్రీజీకీ ధన్యవాదాలు!

 

V. అన్నపూర్ణ
చీరాల, ప్రకాశం జిల్లా
సెల్ : +91 92474 53060

Go to top