" ధ్యానం సర్వరోగనివారిణి "

 

నా పేరు నాగ మురళీకృష్ణ. నా వంటి మీద అలర్జీ వచ్చి నా చేతులు, కాళ్ళ మీద దద్దుర్లుతో ఎర్రగా మారింది. అవి వచ్చినప్పుడు బాగా చిరాకుగా వుండి ఏ పనీ చేయాలనిపించక పోయేది. దాదాపుగా ఆరు నెలల నుండి నేను మందులు వాడుతున్నాను. కానీ మందులు వాడుతున్నంత సేపు తగ్గిపోయి.. ఏమన్నా పడనవి తింటే మళ్ళీ అలాగే వచ్చేవి. అయితే మేము అలర్జీ టెస్ట్ చేయిస్తే.. "జీవితాంతం మందులు వాడూతున్నంత సేపు తగ్గిపోయి ..ఏమన్నా పడనవి తింటే మళ్ళీ అలాగే వచ్చేవి. అయితే మేము అలర్జీ టెస్ట్ చేయిస్తే.." జీవితాంతం మందులు వాడుతూ వుండాల్సిందే..మరి కొన్ని పదార్థాలు జీవితకాలం తినకుండా వుండాల్సిందే"అని డాక్టర్లు చెప్పారు.

మాకు తెలిసిన వారి ద్వారా "స్వర సంకీర్తన ధ్యానం" గురించి తెలుసుకుని పదిరోజులపాటు హైదరాబాద్, బాలానగర్, చింతల్ లో ఉంటున్న శ్రీమతి అక్కిరాజు విజయలక్ష్మి గారి దగ్గర వారి ఇంటి పై నిర్మించిన "సంగీత ధ్యాన పిరమిడ్" లో.. స్వరసంకీర్తన ధ్యానం చేయడానికి వచ్చాం. మొదటి రోజు ధ్యానం చేసిన తరువాత నాకు చాలమంచి అనుభూతి కలిగి మనస్సు ప్రశాంతంగా అనిపించింది.

రెండవరోజు తరువాత నాలో ఇంకా చక్కటి మానసిక ప్రశాంతత లభించి.. ఆ వ్యాధి గురించి పాజిటివ్‌గా ఆలోచించే విధంగా నా మనస్సుమారిపోయింది.

మూడవరోజు స్వర సంకీర్తన ధ్యానం చేసిన తరువాత నాలోని టెన్షన్ మెల్లగా తగ్గిపోతూ అలర్జీ కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించింది.

నాలుగవ రోజు తరువాత .. ఇక రోజు రోజుకూ నాలో ఏకాగ్రత పెరగడంతో పాటు పాజిటివ్ గా ఆలోచించడం అనేది స్పష్టంగా నాకు నేను గమనించాను. అలర్జీ కూడా దాదాపుగా తగ్గుతూ కనిపించింది.

ఐదవ రోజున మళ్ళీ అలర్జీ ఎక్కువగా కనిపించింది కానీ "ఖచ్చితంగా తగ్గిపోతుంది" అనే నమ్మకం మాత్రం నాలో రోజుకు రోజు పెరుగుతూ వచ్చింది.

ఆరవరోజు కూడా అలాగే ఎక్కువగా అలర్జీ కనిపించింది కానీ తగ్గిపోతుందనే నమ్మకం ఉండటం వలన నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. "పిరమిడ్ శక్తితో నా జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది" అన్న నా పాజిటివ్ నమ్మకాన్ని సడలనీయకుండా నా ధ్యానశక్తి నన్ను స్థిరంగా ఉంచింది. బహుశా ఇది నాకు మాస్టర్స్ పెట్టిన పరీక్ష కాబోలు.

ఇక ఏడవరోజు నుంచి అలర్జీ మళ్ళీ తగ్గడం మొదలై ఎనిమిదవ రోజుకు చక్కటి హీలింగ్ మొదలైంది.

పదకొండవ రోజు వరకు పూర్తిగా ఈ అలర్జీ అనేది నా శరీరం పై కనిపించకుండా పోయింది. ఇది నాదధ్యానసంగీతం యొక్క మహత్యం తప్ప మరేమి కాదు!

ఈ సందర్భంగా మేము ‘బ్రహ్మర్షి పత్రీజీ కి.. మరి విజయలక్ష్మి మేడమ్’ కూ ..హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంత మంచి ప్రక్రియను మాకు అందించి .. ఏ మందులూ వాడకుండానే మాకు ఉన్నటువంటి ఈ బాధను తొలిగించినందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞుడను.

నాతో పాటు కుటుంబ సభ్యులందరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.

ఇక ఇప్పుడు నేను నాకు ఇష్టమైనవి అన్నీ తింటున్నాను మరి నా శరీరానికి పడని పదార్థం అంటూ ఏదీ ఇప్పుడు లేదు. ఎంతో మంది డాక్టర్‌లు కూడా పూర్తిగా నయం చేయలేకపోయిన అలర్జీని కేవలం నా ధ్యానశక్తితో, విజయలక్ష్మి మేడమ్ స్వరసంకీర్తన లో తగ్గించుకోవడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను. "ధ్యానం సర్వరోగ నివారిణి" అన్నది పరమసత్యం.

 

N. నాగ మురళీకృష్ణ
హైదరాబాద్
ఫోన్ : +91 95056 34332

Go to top