" ఒంగోలు జిల్లా జైలులో..ధ్యానశిక్షణ "

 

"ఇప్పుడు నాకు నా జీవితం మీద కోపం లేదు"

 

నా పేరు సతీష్ బాబు. మాది ఒంగోలు, నా వయస్సు ౩౦ సంవత్సరాలు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలొ మాస్టర్స్ డిగ్రీ చేసి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగంచేసుకుంటూ. ఏ కర్మఫలితం వల్లనో తెలియదు కానీ అనుకోని కారణాల వల్ల.. ఈ జైలుకి రావడం జరిగింది.

నా మీద నాకే కోపం. ఎవరిని చూసినా చంపెయ్యాలన్నంత కసి "నా జీవితం ఇలా అయిపోయిందే" అన్న బాధతో ఒక పిచ్చివాడిలా జైలు జీవితం గడుపుతోన్న నా జీవితానికి ధ్యానం ఒక వరం అయ్యింది.

మొదట్లో నా తోటి ఖైదీలందరూ పిరమిడ్ సంస్థ వారి ధ్యాన శిక్షణా తరగతి వెళ్తున్నా.. నాకు పెద్దగా ఇష్టం అనిపించలేదు. ధ్యానం వల్ల వాళ్ళకు కలిగిన అనుభవాలను వాళ్ళు ఆనందంగా వివరిస్తూంటే.. నాకు విన బుద్ధి కూడా కాకపోయేది. ఇలా వుండగా ఒకరోజు మా జైలరు గారు నన్ను పిలిచి.. "ధ్యానం ఎందుకు చేయడం లేదు?" అని అడిగారు.

నేను నిరాసక్తంగా "నాకు ఇష్టం లేదు" అని చెప్పాను. అప్పుడు ఆయన ధ్యానం యొక్క గొప్పదనాన్ని నాకు వివరించి.. ఒక స్నేహితుడిలాగా నన్ను కౌన్సిలింగ్ చేసారు.

అయితే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టగానే నా గత కాలపు జ్ఞాపకాలు నన్ను వేధిస్తూ నన్ను ఇంకా ఆందోళనకు గురిచేసేవి. నేను సొసైటీకి చెందిన అనేక పుస్తకాలు చదవడం మరి బ్రహ్మర్షి పత్రీజీ ఆడియో కేసెట్లను వినడం మొదలుపెట్టాను! చిత్రంగా నా ఆలోచనల సాంద్రత తగ్గిపోయి.. మెల్లిమెల్లిగా నా మనస్సు కుదటపడడం మొదలయ్యింది.

ఇప్పుడు నాకు నా జీవితం మీద కోపం లేదు. "నా కర్మ ఫలితాలే మరి నా ఆలోచనలే ఈ రోజు నా స్థితికి కారణం అయ్యాయి" అని తెలుసుకుని.. నా ఆలోచనా విధానంలోనే సమూల మార్పును తెచ్చుకున్నాను. జైలు జీవితం అన్నది ఒక శిక్షా కాలంలా కాకుండా ఉన్నతమైనా జీవితం గడుపడానికి శిక్షణ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్‌లా మార్చినందుకు జైలరు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ప్రపంచాన్నంతటినీ ధ్యానమయం చేయడం కోసం అహర్నిసలు శ్రమిస్తోన్న బ్రహ్మర్షి పత్రీజీ కి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం!! జైలుకు వచ్చిన తోటి ఖైదీలకు ధ్యాన ప్రచారం చేస్తూ నా పుణ్యం శాతం పెంచుకుంటాను.


"ధ్యానం చేసిన తరువాత నాలో దుఃఖం, దిగులు పోయి చాలా సంతోషంగా వున్నాను"

నా పేరు తిరుపతి స్వామి.

మాది వాసేపల్లిపాడు గ్రామం. నాకు ఇంతకు ముందుగా ధ్యానం గురించి అస్సలు తెలియదు. నేను ఒక కేసులో శిక్షపడి ఒంగోలు జైలుకి వచ్చాను.

"నాగరాజు" అనే ఖైదీ ధ్యానం గురించి చెప్పి అతని అనుభవాలు నాకు తెలియజేసాడు. మరుసటి రోజు నుంచి నేను కూడా ధ్యానం క్లాసుకి వెళ్ళడం జరిగింది.

ధ్యానం చేయకముందు నాకే తెలియని దుఃఖంతో నేను బాధ పడుతూండేవాడిని. ధ్యానం చేసిన తరువాత నాలో దుఃఖం, దిగులు పోయి చాలా సంతోషంగా వున్నాను. ఇంతకు ముందు కళ్ళు, తలనొప్పితో చాలా బాధపడుతున్నాను. ధ్యానం చేస్తూ వుండగా కొన్ని రోజులకు కళ్ళనొప్పి మరి తలనొప్పి తగ్గిపోయింది. టాబ్లెట్స్ కూడా వాడటం మానివేసి సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను.

ఇంతకు ముందు నాకు మాంసాహారం తినే అలవాటు వుంది. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తరువాత మాంసాహారం తినడం మానివేసాను. ఇంకా ఇంకా పాపకూపంలో కూరుకుపోకుండా నన్ను కాపాడిన ధ్యానానికీ మరి మాకు ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన జైలు అధికారి గారికీ ధ్యానంగురించి ప్రపంచ వ్యాప్తంగా తెలియ పరుస్తున్న బ్రహ్మర్షి పత్రీజీ గారికీ నా హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


" ధ్యానం చేసిన తరువాత నా హృదయం శాంతించింది. దాంతో పాటు పూర్తిగా మానసిక ప్రశాంతత కూడా వస్తోం "

నా పేరు కోటిరెడ్డి.

మాది కొనకనమిట్ల మండలం, నాగరాజుకుంట గ్రామం.

నేను స్వతహాగా వ్యవసాయదారుడిని. ఒక కేసులో నేరం మోపబడి ఒంగోలు లోని జిల్లా జైలులో ఖైదీగా ఉంటున్నాను.

నేను జైలుకి వచ్చిన మొదట్లో చాలా ఆందోళనగా వుండేవాడిని. "జీవితం ఇలా అయిపోయింది" అన్న మానసిక ఒత్తిడి వలన చాలా అనారోగ్యం పాలయ్యాను. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా నాకు నడుము విపరీతంగా నెప్పిగా ఉండేది. రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు.

జైలుకు వచ్చిన కొన్ని రోజులకు.. మా జైలర్ గారి దయతో 17-8-2011 వ తేదీ నుంచి ధ్యానం నేర్చుకుంటున్నాను. మొదటిలో మాస్టర్ గారు చెప్పేది ఏమి అర్థం కాలేదు! కానీ.. వారం రోజుల తర్వాత నాకు నడుము నొప్పులు తగ్గిపోవడంతో నాకు ఆశ్చర్యం వేసింది.

ఏ కర్మఫలితం వల్ల నేను ఈ శిక్షను అనుభవించవలసి వస్తోందో తెలిసి.. కర్మ ప్రక్షాళన అవుతున్నందుకు నా హృదయం శాంతించింది. దాంతో పాటు పూర్తిగా మానసిక ప్రశాంతత కూడా వస్తోంది. చక్కటి పుస్తకాలు బ్రహ్మర్షి పత్రీజీ గారి కేసెట్లను వింటూంటే జైలులో నా శిక్షాకాలం.. శిక్షణాకాలంలా అయిపోయింది. బయటికి వెళ్ళిన తరువాత ఇంత గొప్ప ధ్యానం గురించి అందరికీ తెలియజేస్తాను. మాకు ధ్యానం నేర్పించే పిరమిడ్ మాస్టర్లకు మా జైలరు గారికి బ్రహ్మర్షి పత్రీజీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు!


" అనంతమైన లాభాలన్నీ ధ్యానం చేసేవాళ్ళకే "

నా పేరు కూరపాటి శ్రీనివాసరాజు.

మాది అద్దంకి మండలం, దేనువకొండ గ్రామం.. కొందరి మోసపూరిత కుట్రవల్ల నేరం చేయకుండానే నా పై నేరం మోపబడి ఒంగోలులోని జిల్లా జైలులో రెండు నెలల నుంచి వుంటున్నాను.

జైలుకి వచ్చిన మొదటి రోజుల్లో నేను ఎంతో మానసిక వేదనకు గురిఅయ్యేవాడిని. ప్రతి నిమిషం ఆందోళనతో. విపరీతమైన కోపంతో ఉంటూ ఎదుటి వారితో ఆగ్రహంతో మాట్లాడేవాడిని. ఏ చిన్న విషయాన్నైనా పెద్దగా ఊహించుకునేవాడిని.

అలాంటి సమయంలో నాకు గొప్ప సువర్ణ అవకాశంలాగా మా జైలర్ గారు ధ్యానం చేసుకునే అవకాశం కల్పించారు. మొదట్లో పిరమిడ్ సొసైటీ మాస్టర్లు వచ్చి మా జైలులో ధ్యానశిక్షణ కార్యక్రమాలు నిర్వర్తిస్తూంటే.. "వాళ్ళకు ఏం లాభమో?!" అనుకునేవాడిని. మొదటి రెండు రోజులు నాకు ఏమీ అర్థం కాలేదు. 40రోజుల ధ్యానం తరువాత నాకు అర్థం అయ్యింది. "అనంతమైన లాభాలన్నీ ధ్యానం చేసేవాళ్ళకే" అని!

ధ్యానం వల్ల నాకు మొదటిసారిగా మానసిక ప్రశాంతత వచ్చింది. అంతకముందు నాకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా జైలులోని ఆసుపత్రి వెళ్ళి విపరీతంగా మందులు వాడేవాడిని అయితే, ధ్యాన సాధన మొదలుపెట్టిన తరువాత నాకు ఏ అనారోగ్యం లేదు. ఏ మందులు వాడలేదు. ధ్యానం నేర్పించే గురువుగారు శ్రీ T. నాగేశ్వరరావు గారు అద్భుతమైన పుస్తకాలు మాకు అందజేసారు. అవి చదివి నేను మాంసాహారం మానుకున్నాను అందులోని అనర్థాలన్నీ తెలుసుకున్నాను.

ఒకరాయిలాగా జైలుకి వచ్చిన నన్ను ‘శిల్పం’ లా మార్చింది ధ్యానం. ఈ స్వార్థం లేకుండా ధ్యానప్రచారం చేస్తున్న పిరమిడ్ సొసైటీ గురువులకూ, జైలర్ గారికీ, బ్రహ్మర్షి పత్రీజీ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

నాగేశ్వర్ రోవా
ఒంగోలు
ఫోన్ : +91 98481 50760

Go to top