" ధ్యానం చేస్తూ, చేయిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను "

 

నేను నా స్నేహితుడు ‘గోపాల్’ ద్వారా మెడిటేషన్‌లోకి వచ్చాను. నేను మెడీటేషన్ చేస్తున్నకొద్దీ సంకల్ప‌శక్తి పెరుగుతూ వచ్చింది. ఏది అనుకుంటే అది జరుగుతోంది! మొదట్లో నేను 15 నిమిషాలు ధ్యానం చేసేవాడిని. ‘ఆనంద్ అన్న’ పరిచయం అయిన తర్వాత 4 నుంచి 5 గం|| లు ధ్యానం చేస్తున్నాను. ధ్యానంతో ఎన్నోరకాల అనుభవాలు వచ్చాయి. ధ్యానం చేయటం వలన నేను పొందుతున్న ఆనందం వర్ణించలేనిది! ధ్యానం చేయకముందు నాలా చాలా భయం వుండేది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. ధ్యానం చేయటం వలన సరిగ్గా జీవించటం నేర్చుకున్నాను. నేను ధ్యానం చేస్తూ సీనియర్ మాస్టర్స్ అందరినీ కలుస్తూ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను.

మొదట్లోనేను బ్లడ్ బ్యాంక్, అనాధ శరణాలయం వంటి సామాజికసేవ కార్యక్రమాలు చేయాలని అనుకునేవాడిని. అపుడు ‘అనంద్ అన్న’ నాతో "మానవసేవ అన్నది ‘విశుద్ధ చక్రానికి’ సంబంధిచినదే కానీ ధ్యానం చేయటం, చేయించటం అన్నది దానికంటే ఎంతో గొప్పదైన ‘సహస్రారానికి’ సంబంధించినది" అని చెప్పి "మాధవసేవ మానవసేవ" అనే సిడీని వినిపించాడు. ఆ సిడీ విన్న తర్వాత ధ్యానప్రచారం చేయాలని జిజ్ఞాస మొదలైంది. నా బర్త్‌డే రోజున నిజామ్ కాలేజ్‌లో "పైమా మైత్రేయ" మాగజైన్స్ పంచి, అందరికీ ధ్యానం గురించి చెప్పి ధ్యానం చేయించాను. ఈ విధంగా ధ్యానం చేస్తూ, చేయిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను.

 

పవన్, MCA

Go to top