" ధ్యానానికి కాశ్మీరీ తివాచీ! "

 

నా పేరు లక్ష్మి. భర్త పేరు మురళీధర్.. టెలికామ్‌లో జనరల్ మేనేజర్. ఇద్దరు పిల్లలు.. సింధూర, రవిచంద్ర.

ప్రస్తుతం కాశ్మీర్ శ్రీగర్‌లో ఉంటున్నాం! 2001 లో విశాఖపట్టణంలో ఉంటున్నప్పుడు "ధ్యానం చేస్తే పిల్లలకు మెమొరీ పవర్ వస్తుంది." అని "ఒక గంట కోసం వెళ్ళి వద్దాం" అనుకుని నేను, నా భర్త పత్రీజీ క్లాస్‌కి వెళ్ళాం. ఒక గంటకోసం వెళ్ళిన మేం రోజంతా అక్కడే వుండటమేకాక, రెండవరోజు, మూడవరోజు కూడా వెళ్ళాం! పత్రీజీ క్లాస్ చెబుతున్నప్పుడు "అబ్బ! ధ్యానం ఎంత సులభంగా వుంది?! కళ్ళు మూసుకుని హాయిగా కూర్చుని ధ్యానం చేయడమే కదా" అనిపించింది.

సర్ క్లాస్‌లో "మాంసం తినకూడదు" అని చెప్పారు. "అన్నీ బాగానే ఉన్నాయి కానీ ‘మాంసం తినవద్దు’ అని చెబుతున్నారు. అది ఒక్కటే నాకు బాగా లేదు" అనిపించింది. "అబ్బ! మాంసం ఎలా మానాలి? అసలు మానగలనా లేదా?" అని నాకే సందేహంగా ఉండేది. సర్ క్లాస్ విన్న తరువాత ఒకరోజు మాంసం తిన్నాను. తిన్నంతవరకు బాగానే వుంది. తిన్న తరువాత నాకే లోపలి నుంచి ఒక రకమైన ఫీలింగ్. "ఎందుకు తిన్నానా?" అని ఏదో తెలియని బాధ "ఇలా తిని బాధపడే కన్నా కొన్నిరోజులు తినకుండా చూద్దాం" అని మనస్సులో నిర్ణయం తీసుకున్నాను. కొన్నిరోజులు అనుకున్న నేను ఈ రోజు వరకు ముట్టలేదు! ఇక జీవితంలో ముట్టను కూడా!!

మేం 2005 లో కర్నాటక రాష్ట్రం కోలార్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాం. ఒకసారి పత్రిసార్ కోలార్‌కి రావడం అక్కడ ఒక క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది.

2007 జనవరిలో శ్రీనగర్‌కు వెళ్ళాం. జూన్‌లో లూధియానా నుంచి రాజ్‌కుమార్‌గుప్తా, రచనా మేడమ్, కిరణ్ మేడమ్.. హైదరాబాద్ నుంచి పద్మజ మేడమ్, పావని మేడమ్‌లు కూడా శ్రీనగర్‌కి వచ్చారు. తరువాత పోలీస్ సూపరిటెండెంట్ S.P. ఇక్బాల్‌ని కలిసి వాళ్ళకు క్లాస్ చెప్పాం.ఆ తరువాత శ్రీనగర్‌లో ఖీర్‌భవాని టెంపుల్‌లో మేళా జరుగుతూండగా వెళ్ళి అక్కడ అందరికీ పాంప్లెట్స్ పంచాం. అలా పాంప్లెట్స్ పంచుతూ ఉండగా కాశ్మీర్ ముస్లిమ్ "ముజాఫర్" పరిచయం అవ్వడం, తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లోనే రెండుసార్లు మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది! అదేరోజున ఆయన "ఈ ధ్యానం అందరికీ కావాలి" అని ధ్యానప్రచారం మొదలుపెట్టారు! ఆయన స్కూల్‌లోనే పిరమిడ్ సెంటర్ పెట్టడానికి రెడీ అయ్యారు! "ఈ శ్రీనగర్ ఇలాంటి ధ్యానం చాలా అవసరం. కాశ్మీర్‌కి వచ్చి మీరంతా నేర్పించడం నాకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పారు.

అమర్‌నాథ్ యాత్రా విశేషాలు :

అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళే మార్గంలో పహల్‌గామ్ అనే ఒక స్థలంలో బేస్ క్యాంప్ ఒకటి పెట్టాం. అక్కడ యాత్రీకులందరికీ ధ్యానం గురించి చెప్పడం.. ధ్యానం ఎలా చెయ్యాలో నేర్పించడం.. పాంప్లెట్స్ పంచడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యాత్రీకులు, సాధువుల తోటి ధ్యానం చేయించడం, చాలామందికి ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్ రావడం.. ఓ మరపురాని అనుభూతి! ఎందుకంటే ఈ అమర్‌నాథ్ యాత్ర వలన దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రీకులకు ఎంతోమందికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానం తెలిసింది. అమర్‌నాథ్ యాత్ర "ధ్యానభారత్"కు పెద్ద అఛీవ్‌మెంట్!

కాశ్మీర్ ముస్లిమ్.. ముజాఫర్..S.P. కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వాళ్ళ స్కూలును మనకు సెంటర్‌గా ఇచ్చారు! దానిలో పిరమిడ్ ఆఫీస్, లైబ్రెరీ కూడా పెట్టాం! ఆయన కాశ్మీర్ అంతా ధ్యానప్రచారం చేయడం కోసం సహకరిస్తున్నారు! అదేరోజున జమ్మూలో కూడా సెంటర్ పెట్టడం, సెంటర్ ఓపెనింగ్‌కి కూడా వెళ్ళాం! శ్రీనగర్ సెంటర్ ఓపెనింగ్‌కి C.R.P.F. ఆఫీసర్స్, B.S.N.L. ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది!

నా స్వీయ అనుభవం ఏమిటంటే ఈ ధ్యానం మొదలు పెట్టిన తర్వాత నాలో విపరీతమైన ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ యొక్క ఆత్మవిశ్వాసం వల్లనే నేను శ్రీనగర్‌లో ముందడుగు వేయగలుగుతున్నాను. పిరమిడ్ ధ్యానులందరికీ నా అభినందనలు! పత్రీజీకి నా ప్రణామాలు!

 

లక్ష్మి
శ్రీనగర్

Go to top