" జననం మధురం... మరణం మధురం "

 

డిసెంబర్ 21, 2006 సాయంత్రం 4.30 నిమిషాలు.. సెల్‌ఫోన్‌లో నందప్రసాద్ గారు మన జగన్మాత అయిన పత్రి గారి మాత సావిత్రమ్మ గారు తమ భౌతికశరీరాన్ని వదిలి వెళ్ళారు. రేపు అంటే 22-12-06 న అంత్యక్రియలు జరుగుతాయి అనీ, అందరూ ధ్యాన నివాళులు అర్పించాలనీ మెస్సేజ్ పంపించారు. ఈ విషయం ఇల్లందులో వున్న మాస్టర్స్ అందరికీ తెలియజేసాను. 1,000 మంది గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్ధినులతో కలిసి 20 నిమిషాలు ధ్యాన నివాళులు అర్పించాము.

అయితే, నాకు సావిత్రీదేవి పత్రి గారి అంతిమయాత్రలో పాల్గొనాలని కోరిక. ఖమ్మం నుంచి రామక్రిష్ణగారు, ధ్యానరత్న శ్రీనివాసరావు గారు, ఇల్లందు నుంచి తిరుపతయ్య గారు బయలుదేరాం. ఖమ్మం గాయత్రినగర్ ధ్యాన కేంద్రంలో 50 మందితో ఉదయం 4.00 గంటల వరకు ధ్యానం చేసాం. 22 డిసెంబర్, 2006 ఉదయం హైదరాబాద్‌లో పత్రిసార్ ఇంటికి వెళ్ళాం. అందరూ ధ్యానంలో వున్నారు. మేమూ కూడా ధ్యానంలో కూర్చున్నాం. తరువాత పత్రీజీ అందరితో పలకరింపు. మామూలు ధ్యాన కార్యక్రమంలో లాగానే అందరితో జోక్స్ వేస్తూ...

 

" ఓ క్రొత్త ప్రపంచంలో వున్నట్లువుంది "

పత్రిసార్ వచ్చిన మాస్టర్స్ అందరినీ మామూలుగానే పలుకరిస్తున్నారు. అక్కడ ఎవ్వరి కళ్ళల్లో కన్నీళ్ళూ లేవు. వచ్చిన్వారు అంతా ఆ పిరమిడ్ మాతవైపు... తన ధ్యానజగత్ నాటకంలో తన పాత్రను చివరివరకు అద్భుతంగ పోషించే ప్రేక్షకులైన పిరమిడ్ మాస్టర్లను మెప్పించి 'భేష్' అనిపించుకున్న 'గ్రేట్ మాస్టర్' వైపు గర్వంగా తిలకించారు. 11.00 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. ధ్యాన గద్దర్ అయిన శ్రీ రామిరెడ్డి, మహబూబ్‌నగర్ అవిరామంగా చివరివరకు "పిరమిడ్ మాతా అమర్ హై" అంటూ నివాళులు చేస్తూ స్మశానవాటిక చేరి ఓ అర్థగంట స్మశానం ముందు సామూహిక ధ్యానం చేసిన తరువాత అమ్మ భౌతికకాయాన్ని "అగ్నిమాస్టర్"కు అప్పగించాం. అగ్ని మాస్టర్ ఎంతో అప్యాయంగా, ఆనందంగా మాత భౌతికకాయాన్ని తీసుకుని తన పని ముగించారు. ఇంతవరకు ఎవరి కళ్ళలో బాధ లేదు... కన్నీళ్ళు లేవు. అంతా గర్వంగా వున్నారు... జగన్మాత తన పాత్రను అద్భుతంగా పోషించారని.

మేం స్మశానవాటిక గేటు బయటికి వచ్చాం. మరొక స్త్రీ భౌతికకాయపు అంతిమయాత్ర. అంతా ఏడుపులు, పెడబొబ్బలు. అంతా మాములే. అయితే వాళ్ళని చూసి "ఏంటి వీళ్ళు ఏడుస్తున్నారు?" అనుకున్నాను. తరువాత అర్థం అయింది "నేను ఇంతసేపు పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో వున్నాను. అని, మరి వచ్చిన శవ అంతిమయాత్ర పిరమిడ్ మాస్టర్‌ది కాదు కదా అందుకే అలా... అయితే సావిత్రమ్మ గారు షిరిడీ లో నాకు పనులన్నీ తామే దగ్గరుండి చేయిస్తున్నట్లు అనుభవం కలిగింది. అందుకే ఆ వంటలు అంత రుచిగా అందరూ ఆరగించారు. ఈ విధంగా తన బాధ్యత షిరిడీ ధ్యాన యజ్ఞంలో నిర్వహించారు.

 

 

S.వెంకటేశ్వర్లు
ఇల్లందు
ఖమ్మం జిల్లా

Go to top