" పిరమిడ్ మాస్టర్ డా|| గంగారాం(M.S) గారితో మారం ఇంటర్వ్యూ"

 

డా|| గంగారాం కర్నూలు జిల్లా ఆదోని వాస్తవ్యులు. జనరల్ సర్జన్‌గా చేశారు. గత అయిదు సంవత్సరాలుగా తమ ప్రిస్కిప్షన్‌లో ధ్యానాన్ని తప్పనిసరిగా విధిగా చేయమని చెబుతారు. మెడికల్ డాక్టర్లు స్పిరిచ్యువల్ సైంటిస్టులు అయితే, రోగులు అదృష్టవంతులు అవుతారంటున్నారు డా||గంగారాం. జబ్బులు తగ్గుముఖం పట్టడానికి "ధ్యానం దివ్య ఔషధం"! ధ్యానం చేస్తూ వుంటే అతి తక్కువ మందులతోనే ఆరోగ్యం పొందడం సాధ్యమవుతుందని వీరు తమ అనుభవ పూర్వకంగా ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

M.B.B.S డాక్టరు అయిన శ్రీ గంగారాం ధ్యానం వలన తన ప్రాక్టీస్ డాక్టరుగా నాలుగింతలయిందని అటున్నారు. త్రికరణశుద్ధిగా "ధ్యాన వైద్యం" చేసే ఈ మెడికల్ డాక్టర్ ఎన్నో విషయాల్లో తమ అనుభవాన్ని రంగరించి ఇంటర్వ్యూలో వివరించారు.

మారం శివప్రసాద్


మారం : "మీకు ధ్యానం ఎందుకు చేయాలని అనిపించింది?! మీరు ‘మెడికో’ కదా! ఎప్పటినుండి ధ్యానం చేయడం మొదలు పెట్టారు?"

డా||గంగారాం : నాకు చిన్నప్పటి నుండి ‘కాన్షియస్‌నెస్’ గురించి తెలుసుకోవాలని వుండేది. ప్రేమ్‌నాథ్ మాస్టర్ ద్వారానేను ధ్యానంలో ప్రవేశించాను. ముందు సీరియస్‌గా చేయలేదు. అయితే 2004 లో హార్ట్ కంప్లైంట్ వచ్చిన తరువాత నుండి బాగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను.

అప్పటినుండి నేను సీరియస్‌గా ధ్యానం చేయడం ప్రారంభించాను. బైపాస్ సర్జరీ చేయించుకోలేదు. మళ్ళీ 2007 సెప్టెంబరులో ‘అంజియోగ్రామ్’ చేయించుకుంటే, బ్లాక్ అయివున్న మూడు వెసెల్స్‌లో మేజర్ వెసెల్ 75% బ్లాక్ అయివున్నది 30%కి వచ్చిందని తేలింది. ఇక కార్డియాలజీ స్పెషలిస్టులు "సర్జరీ అవసరం లేదు, మందులు వాడితే చాలు" అంటూ "ఫ్రీ ఫ్లో వుంది" అని చెప్పారు.

సీరియస్‌గా ధ్యానం చేయడం వల్లనే ఇది సాధ్యమయింది. దాంతో, బ్రహ్మర్షి పత్రీజీ పట్ల ఎంతో ఆకర్షితుడనయ్యాను.

ప్ర : "జబ్బులు ఎందుకు వస్తాయి?"

జ : 85% జబ్బులు మనస్సు వల్లనే వస్తాయి. మనస్సు కంట్రోల్ వుండే వాళ్ళకు జబ్బులు తక్కువగా వుంటాయి. ధ్యానం దీనికి సరైన మందు. అయితే, దెబ్బలు తగిలితేనో, ఫాక్చర్స్ అవుతేనో వాటికి తప్పక ట్రీట్ చేయవలసి వుంటుంది.

ఇక ‘ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్’ వుంటాయి. ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది బయటినుండి వచ్చే ఫారిన్ బాడీస్ పట్ల! వేరే పదార్థం ఎంటర్ అయిందంటే, మన బాడీలోని సిస్టమ్ దాన్ని తరిమివేస్తుంది!

ప్ర : "అంటే వీటికి ‘ఆంటీ బాడీస్’ తయారుకావా?"

జ : ‘ఆంటీజెస్’ అంటే బయట నుండి వచ్చేది. ‘ఆంటీబొజీస్’ అంటే మన బాడీలో తయారు అయ్యేది. ఈ ఆంటీబాడీ ఆ ఆంటీజెస్ని చుట్టుముట్టి తరిమేస్తుంది. ఇక్కడేమవుతుందంటే అంతఃకలహాల మాదిరి, మన బాడీలో వుండే ప్రొటీన్స్ మానవశరీరంలోనే వుండే "ఆంటీ బాడీస్" ని డిస్ట్రాయ్ చేస్తాయి. మన బాడీలో వుండే "ప్రొటీన్స్" లాంటివి బయటకు వెళ్ళడం వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి.

ప్ర : "మరి ఇలాంటి జబ్బులన్నింటికి పరిష్కారం చేసే మెడిసిన్స్ వున్నాయా? అవి సైడ్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేయకుండా వుంటాయా?"

జ : అన్ని జబ్బులకూ మెడిసిన్స్ లేవు. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వుంటాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వరు. అందుకే 'B' కాంప్లెక్స్ తప్పక ప్రిస్క్రైబ్ చేస్తారు. ‘మెడిటేషన్’ వీటికి చాలా మటుకు పరిష్కారం అని అర్థమవుతుంది.

కాస్మిక్ ఎనర్జీ అన్నది శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్స్ వుంటే అక్కడి నుండి వాటిని తరిమేస్తుంది కదా!

ప్ర : "వైద్య శాస్త్రానికి అందని ఎన్నో విషయాలు వున్నాయి. అలాగే ఖగోళంలోని ఎన్నో విషయాలు కూడా మనిషికి అర్థం కానివి చాలా వున్నాయి. ధ్యానాన్ని వైద్యానికి జోడించి ఎంతోమంది డాక్టర్లు ఇప్పటికీ వైద్యం చేస్తున్నారు. మీరు మీ ‘డాక్టర్స్ అసోయిషేన్స్’ మీటింగ్స్‌లో ఈ విషయం చెప్పవచ్చు కదా! అలాగే మీ ఎక్స్‌పీరియన్స్‌స్‌ని, మీరు చదివిన ఎన్నో పుస్తకాల ద్వారా ఈ విషయంపై మీ క్లారిటీ అండ్ అబ్జర్వేషన్ చెబుతారా?"

జ : "పత్రిసార్" చెప్పారు ఒక మీటింగ్‌లో ఫిజికల్ బాడీ, ఎథిరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, స్పిరిచ్యువల్ బాడీ, నిర్వానిక్ బాడీ... అని ఏడు శరీరాల గురించి చెప్పారు.

వీటిలో రెండింటి గురించి నాకు సైంటిఫిక్ ఆధారం వుంది. సైన్స్ని ఆధ్యాత్మికతతో జోడిస్తే ఎన్నో అద్భుత ఫలితాలు వుంటాయనే నేను అనుకుంటున్నాను. మా మెడికల్ డాక్టర్స్ మీటింగ్స్‌లో నేను తప్పక ప్రెజెంట్ చేస్తాను వీటి గురించి!

ప్ర : "మీరు మీ క్లయింట్స్‌కి ధ్యానాన్ని సజెస్ట్ చేయడాన్ని ఎంతో చాకచక్యంగా చేస్తారని ‘మా ప్రేమనాథ్’ చెప్పారు నాకు ఎంతోమందిని తన దగ్గరికీ, మరి పిరమిడ్‌కూ వెళ్ళమని మీరు సజెస్ట్ చేస్తారని చెప్పాడు."

జ : ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన దాన్ని నేను ఎప్పుడో చదివాను... దాన్ని త్రికరణశుద్ధిగా విశ్వసిస్తాను కూడా. సైన్స్ లేని ఆధ్యాత్మికత కుంటిదనీ, ఆధ్యాత్మికత లేని సైన్స్ గుడ్డిదనీ!

దీన్నే నేను నా వైద్యంలో కూడా ఫాలో అవుతాను. రెండు రకాలుగా. నేను క్లియర్ మైండ్‌తో ఆలోచించి, అవసరమైనంత తక్కువ మోతాదులో మందులు ప్రిస్క్రైబ్ చేసి దానికి జతగా ధ్యానం చేయమని చెపుతాను. చాలా అద్భుత ఫలితాలనే ఇచ్చింది ఈ పద్ధతి.

ఇలాంటివాళ్ళు చక్కగా ధ్యానం చేసి అద్భుత ఫలితాలు పొంది ఇపుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు కూడా!

ప్ర : "ఇంకా కొన్ని ఉదాహరణలు ఇవ్వండి!"

జ : రక్తపు వాంతులు చేసుకొని వచ్చిన ఒక పేషంట్ కూడా, నా సలహా మీద ధ్యానం చేసి ఇప్పుడు మందులు వాడడం మానేశాడు. కేవలం వారు రోజులు మందులు వాడిన తర్వాత, అల్సర్ వున్నా కూడా, ధ్యానం చేసి అల్సర్ పోగొట్టుకున్నాడు.

ప్ర : "చాలా బావుంది సార్! మనస్సును స్థిరం చేసుకుని, ‘నాకు ఇది పోతుంది’ అనుకుంటే జబ్బులు క్లియర్ అవుతాయని మీ అభిప్రాయమా?!"

జ : కొంతమంది హైదరాబాద్ వెళ్ళి నెఫ్రాలజిస్ట్‌ల్ వద్ద, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌ల వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుని, "తగ్గలేదు" అని నా వద్ద కంప్లైంట్ చేసిన వారికి "మ్యూజుక్ మెడిటేషన్" సజెస్ట్ చేశాను. చాలామంది శ్రద్ధగా మ్యూజిక్ మెడిటేషన్ చేసినవారు సంవత్సరం పైగా మందులు వాడకున్నా ఆరోగ్యంగా వున్నారు!

ప్ర : "2012 తరువాత ‘వైద్యాలయాలు’ అన్నీ ‘ధ్యానాలయాలు’ అవుతాయి" అని బ్రహ్మర్షి పత్రీజీ అన్నారు. మీ కామెంట్!

జ : ప్రతి హాస్పిటల్‌లోనూ అమెరికాలో, ఇంగ్లండ్లో తప్పక మెడీటేషన్‌ని చేస్తున్నారు. ఇండీయాలో కూడా "ఇండో అమెరికన్ హాస్పిటల్స్" లో ఆస్టర్నీటిప్ మెడిసిన్ విభాగం వుంది.

రాబోయే రోజుల్లో మరింత, మరింత ఎక్కువవుతుంది. వైద్యంలో ధ్యానాన్ని కలిపి చేయడం, "ధ్యానాన్ని ప్రతి వైద్యుడూ తప్పనిసరిగా ప్రిస్క్రైబ్ చేయాలి" అని నేనాశిస్తున్నాను. ఈ విధంగా 2012 తరువాత "వైద్యాలయాన్నీ ధ్యానాలయాలు" గా అయ్యే అవకాశం వుంది.

ప్ర : "మీరు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలన్నీ తిరిగారు. అన్నీ ప్రాక్టీస్ చేసి చివరికి పిరమిడ్ స్పిరిచ్యూవల్ సొసైటీలో స్థిరపడ్డారు. దీన్ని గురించి మీ అనుభవం చెప్పండి!"

జ : పత్రీజీ ఏ నియమాలు లేని వ్యవస్థను సుస్థిరపరచారు. ఇకడున్న ఒకే నియమం "శాకాహారం భుజించాలి - మాంసాహారం మానెయ్యాలి!" ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది.

పిరమిడ్ సొసైటి కేవలం "శ్వాస మీద ధ్యాస" అని చెపుతోంది. పేషంట్లకు చెప్పడానికి, వారు అమలు చేయడానికి కూడా ఇతర ఏ కండీషన్లు లేని ఈ పద్ధతి చాలా బావుంది!

ప్ర : "మీకు ఆనందం కలిగించిన సందర్భాలు ఏవి?"

జ : పెషంట్లుగా వచ్చినవారు నా సలహాపై ధ్యానం చేస్తూ పిరమిడ్ కాంపౌండ్‌లో కనిపిస్తూ ఆరోగ్యంగా వుంటే నేను పొందుతున్న ఆనందం వెలకట్టలేనిది. ఆదోనిలో నూతనంగా నిర్మించిన "లక్షమ్మ పిరమిడ్" మా ఇంటి ప్రక్కనే వుంది. అందుకని అబ్జర్వ్ చేయడం నాకు ఈజీ!

ప్ర : "మీరొక M.S. జనరల్ సర్జన్! అల్మోస్ట్ రోజుకు ఒకటి తక్కువ లేకుండా సర్జరీలు చేస్తూ వుంటారు. 2004 నుంచి మీరు ఎన్ని సర్జరీలు ధ్యానం చేయంచడం వల్ల ‘ఎవాయిడ్’ చెయ్యగలిగారు?"

జ : చాలానే కేసులు ఆపరేషన్ లేకుండా నేను క్యూర్ చేయగలిగాను ధ్యానం కూడా చేయించడంవల్ల "ఇక తప్పదు అపరేషన్ చేయడం" అన్నప్పుడు, "రిస్కుల్లో పడతారు" అన్నప్పుడు మాత్రమే నేను సర్జరీలు చేస్తున్నాను!

సహజంగా నేను మొదటి నుండీ చాలా బిజీ డాక్టర్ని. మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిన, చేయించడం మొదలుపెట్టిన తర్వాత మరింత బిజీ అయ్యాను!

ఒక స్పిరిచ్యువల్ మాస్టర్ అయిన నేను నా Consciousness విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు.

ప్ర : "మీరు చదివిన పుస్తకాలు, మీరు వాటిద్వారా పొందిన అనుభూతులు?"

జ : స్వామిరామా, యోగానంద పరమహంస పుస్తకాలు, అన్ని పత్రీజీ సిడీలు, పుస్తకాలు చదివాను. యోగానంద పరమహంస వాళ్ళ "యోగదా సత్సంగ్ సొసైటీ" నుండి రెగ్యులర్‌గా లెటర్స్ వస్తూంటాయి. స్పిరిచ్యువాలిటీకీ, సైన్స్‌కీ వున్న గురించి వారిచ్చే రీజనింగ్స్ చాలా బావుంటాయి! స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఓషో, రమణ మహర్షి వీళ్ళ పుస్తకాలు చాలానే చదివాను!

అన్నింటికంటే "ధ్యానాంధ్రప్రదేశ్", "స్పిరిచ్యువల్ ఇండియా" పత్రికలు రెగ్యులర్‌గా రావడం ప్రారంభించిన తర్వాత "పత్రీజీ" రెడీ రెకనర్ లాగా ప్రపంచం మారుమూలల్లో వున్న జ్ఞానాన్నంతా అందిస్తూంటే, ఇంక మరేమి చదవాలని అనిపించడం లేదు నాకు ఈ మధ్య!

ప్ర : "పత్రీజీ లో మీకు నచ్చిన అంశం!"

జ : "పత్రిసార్" మాటల్లో, చేతల్లో స్పష్టత చాలా వుంటుంది! "అహం బ్రహ్మస్మి" అని చెప్పే ఆయన తాను ఖచ్చితంగా "బ్రహ్మం" గానె వుంటారు! అన్నింటికీ ఒకే రామబాణం లాంటి సమాధానం "ధ్యానం -ధ్యానం - ధ్యానం"...ఇది నాకు ఎంతో నచ్చిన విషయం!

ప్రతి ఒక్కరిలో ఆత్మశక్తి వుంటుంది.. ఆ శక్తిలో చలనం కలిగించడానే "ధ్యానయోగ చికిత్స" అంటాం. జగత్తు నిండా ప్రాణశక్తి మనకు ఎప్పుడూ అందుబాటులోనే వుంది. మనస్సులో ఆనందం, తృప్తి లేనప్పుడు దాన్ని అందుకోలేరు. అందుకే అందరూ ధ్యానం చేయాలి.

ప్ర : "ఆధ్యత్మిక శాస్త్రాన్ని కలగలువు చేస్తూ మెడికల్ కోర్స్‌స్‌ని రన్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం వుంటుంది కదా!"

జ : మాడ్రన్ సైకాలజిస్టులకు పైన కనపడే విషయాలే అర్థమవుతాయి. కానీ లోపలుండే విషయం క్లియర్‌గా ఒక స్పిరిచ్యువల్ సైంటిస్ట్ మాత్రమే చెప్పగలుగుతాడు!

మెడిటేషన్ చేసినవాళ్ళు మెడిసిన్స్ చేసి ప్రాక్టీస్ పెడితే అతి తక్కువ మెడిసిన్స్‌తో, అతి ఎక్కువ ధ్యానంతో తప్పక చికిత్స చేయగలుగుతారు.

ప్ర : "ఈ జనవరి 13 న ఆదోనిలో "మహాయోగిని అదోని లక్షమ్మ పిరమిడ్" ను బ్రహ్మర్షి పత్రీజీ ప్రారంభోత్సవం చేశారు కదా! పిరమిడ్కు విజిట్ చేసే సంఖ్య ఎలా వుంది? మీరు ఎలా ఫీలవుతున్నారు పిరమిడ్ కట్టిన తర్వాత?"

జ : ఇప్పుడు మనకు పెద్ద పిరమిడ్ రావడం వల్ల నాకు చాలా సులువు అయ్యింది. ఆదోని పట్టణంలో పిరమిడ్ ప్రారంభోత్సవం అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేటప్పుడు, మరల క్లినిక్ వెళ్ళేటప్పుడు పిరమిడ్ సందర్శిస్తున్న జనసందోహం నాకు ఎంత ఆనందం కలిగిస్తుందో చెప్పలేను! ప్రతిరోజు 200 నుండి 300 మంది ఈ "లక్షమ్మ పిరమిడ్" ను విజిట్ చేస్తున్నారు!

మా ఇంటికి పిరమిడ్ కేవలం 50 గజాల దూరంలో వుంది! ఆ పిరమిడ్ వైబ్రేషన్స్ మా ఇంటికి టచ్ అవుతూనే వున్నాయి!

ప్ర : "చివరగా, మీ కుటుంబం గురించి చెప్పండి!"

జ : నా భార్య అనూరాధ. మా పెద్దమ్మాయి అశ్వని. చిన్నమ్మాయి కృష్ణప్రియ. మా చిన్నమ్మాయికీ, నా భార్యకూ చాలా అనుభవాలు వస్తూంటాయి. మాది పూర్తిగా ధ్యాన కుటుంబం! ప్రస్తుతం మా అందరి జీవితాలు ధ్యానంతో పెనవేసుకొని పోయాయంటే ఆశ్చర్యం లెదేమో!

Go to top