" ధ్యానంలో నా కిడ్నీస్‌కు డయాలిసిస్ జరిగింది "

 

నా పేరు జయలక్ష్మి. నా వయస్సు 45సంవత్సరాలు, మాది చిత్తూరు జిల్లాలోని చిన్నగొట్టిగల్లు గ్రామం. మావారు చంద్రబాబుగారు...LIC ఏజెంటుగా పనిచేస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం నా రెండు కిడ్నీలు చెడిపోవడంతో డాక్టర్‌లు నాకు "డయాలిసిస్ చేయాలి" అన్నారు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి డయాలిసిస్ చేయించారు కానీ నేను ఆ నరకాన్ని అనుభవించలేకపోయాను. కొంతకాలం తర్వాత "మళ్ళీ డయాలిసిస్ చేయాలి.. లేకపోతే ప్రాణానికే ప్రమాదం" అన్నారు. ఆ బాధను భరించలేక నేను చావడానికే సిద్ధపడ్డాను.

ఆ సందర్భంలో మా తోటికోడలు రాజేశ్వరి.. చిత్తూరు పట్టణంలోని లిటిల్ రోస్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ధ్యానశిక్షణా తరగతి ధ్యానం గురించి తెలుసుకుని, ధ్యానంలో జరుగుతున్న అద్భుతాలను గురించి వివరిస్తూ నాకు ధైర్యం చెప్పింది.

చిత్తూరులోని గౌతమబుద్ధా పిరమిడ్ హెల్త్‌కేర్ సెంటర్ కు నన్ను మా వారిని తీసుకుని వెళ్ళింది. ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం యొక్క విశిష్టతను వివరిస్తూ రోజుకు ఎన్ని గంటలు ధ్యానం చేయాలో అలా ఎన్నిరోజులు ధ్యానం చేస్తే నా సమస్య పరిష్కారం అవుతుందో కేర్ సెంటర్ నిర్వాహకులు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ రాధిక, గోపాలక్రిష్ణమూర్తి దంపతులు మాకు వివరించారు.

వారి సూచనల ప్రకారం నేను రోజుకు 12 గంటల చొప్పున 21 రోజులు అక్కడే వుండి ధ్యానం చేసాను. అంతకు ముందు అస్తమానం బెడ్‌పైన పడుకుంటూ రోజులో కనీసం గంటసేపు కూడా కూర్చోలేని నేను.. అన్ని గంటలు ధ్యానంలో కూర్చోగలగడం అద్భుతమే .. ధ్యానంలో నా రెండు కిడ్నీలకు రోజుకు రెండు సార్లు, మూడు సార్లు ఆస్ట్రల్‌గా డయాలిసిస్ జరిగి 21 రోజులలో నేను పూర్తిగాకోలుకోవడం జరిగింది!

ఇది నేను కలలో కూడా ఊహించని పరిణామం.. 21 రోజుల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకుంటే కిడ్నీలు రెండూ నార్మల్‌గా పనిచేస్తున్నాయని తెలుసుకుని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు ... ఎటువంటి మందులు వాడకుండా పూర్తి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో దృఢసంకల్పంతో ధ్యానం చేయడం ద్వారానే నాకు ఇంతచక్కటి ఆరోగ్యం లభించింది.

నాకు ఈ అద్భుత మార్గాన్ని చూపిన మా తోటికోడలు రాజేశ్వరికీ, మరి 21 రోజులు అన్ని సౌకర్యాలు కల్పించి సమాజసేవకోసం అహర్నిశలు శ్రమిస్తూన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధిక గోపాలక్రిష్ణమూర్తి దంపతులకూ ఇంత గొప్ప విద్యను అందరికీ అందుబాటులోనికి తెచ్చిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి జీవితాంతం ఋణపడి వుంటాను.

ఇప్పుడు నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేస్తూ మా ఊరిలో ధ్యానప్రచారం కూడా చేస్తూన్నాను. నన్ను చూసి మా ఊరిలో చాలామంది ధ్యానం చేస్తున్నారు.

ధ్యానంలో ఏదైనా సాధించవచ్చని పూర్తి నమ్మకంతో ప్రతిఒక్కరూ ధ్యానం చేసి తమ సమస్యలను పరిష్కరించు కోవలసినదిగా ప్రతి ఒక్కరికీ నేను మనవి చేస్తున్నాను.

 

జయలక్ష్మి
చిత్తూరు
సెల్ : +91 94902 60533

Go to top