" ధ్యానశక్తితో తగ్గని రోగాలు లేవు "

 

నా పేరు సత్యనారాయణ. నేను గత సంవత్సరం జూన్ 16వ తేదీన మా పట్టణంలో బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన ధ్యానకార్యక్రమంలో పాల్గొని ధ్యానం యొక్క గొప్పదనాన్ని చవిచూసాను. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా ధ్యానసాధన చేస్తూ హాయిగా ఉన్నాను.

నేను ధ్యానంలోకి రాకముందు వెన్నెముకలో విపరీతమైన నొప్పి రావడంతో మేజర్ ఆపరేషన్ చేయించుకున్నాను. లక్షలు ఖర్చుపెట్టినా నొప్పి కొంతవరకే ఉపశమనం కలిగింది. కొన్నాళ్ళు గడిచాక నొప్పిక్రమంగా ఎక్కువవుతూ నేను భరించలేనంతగా కావడంతో మళ్ళీ నేను హాస్పిటల్‌కు వెళ్ళి చూపించుకున్నాను.

డాక్టర్‌లు పరీక్ష చేసి.. మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చెయ్యాలి డబ్బులు తయారు చేసుకోమని మందులు వ్రాసి ఇచ్చారు. ప్రతినెల రెండు వేల రూపాయలకు తగ్గకుండా మూడు పూటలా మందులు మ్రింగేవాడిని!

ఇలాంటి పరిస్థితిలో నేను ధ్యానం చేసి "ధ్యానాంధ్రప్రదేశ్’ పత్రికకు చందాదారుడుగా చేరి అందులో గుంటూరు జిల్లా "నెక్కల్లు" లో వున్న "శ్రీ రమణారావు సావిత్రమ్మ" గార్ల ధ్యాన ఆశ్రమంలో జరుగుతోన్న 41 రోజుల ధ్యానశిక్షణ గురించి చదివాను.

ఆశ్రమంలోని "వెంకటేశ్వర పిరమిడ్" నిర్వాహకులు మరి నెక్కలు పిరమిడ్ మాస్టర్ అబ్బూరి కోటేశ్వరరవు గారికి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాను. 30 రోజులపాటు అక్కడే వుండి రోజుకు 8గం||ల చొప్పున ఆ పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ అపారమైన ధ్యానశక్తిని పొందాను. అప్పటి వరకు గత కొన్నియేళ్ళుగా నన్ను విపరీతంగా బాధిస్తున్న నా వెన్నుపూస నొప్పి క్రమంగా తగ్గుముఖం పట్టింది. 30 రోజులు గడిచేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయి నేను హాయిగా కూర్చోగలుగుతున్నాను.. ఆరోగ్యంగా తిరుగుతూ నా పనులు నేను చేసుకుంటున్నాను. గత కొన్ని యేళ్ళుగా నేను వాడుతోన్న మందులన్ని మానేసాను.

ఇప్పుడు నా వయస్సు అరవై సంవత్సరాలు! నా పరిపూర్ణ ఆరోగ్యాన్ని చూసిన వాళ్ళందరూ "ధ్యానశక్తితో తగ్గని రోగాలు లేవు" అని తెలుసుకుంటూ వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు. ధ్యానప్రచారం ద్వారా ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునేట్లు చేస్తోన్న బ్రహ్మర్షి పత్రీజీ వెంటనే నడుస్తూ.. ధ్యాన-శాకాహార ప్రచారాలతో పుడమితల్లిని పునీతం చేద్దాం.

 

Ch. సత్యనారయణ
ఖమ్మం జిల్లా
సెల్ : +91 98668 33424

Go to top