" విశ్వమంతా ప్రేమమయం కావాలి "

 

నా పేరు అనురాధ. మాది ఖమ్మం జిల్లా, కొత్తగూడెం. 2000 సంవత్సరంలో మా అక్క ఖమ్మం పిరమిడ్ మాస్టర్ " N సరోజ " గారి ద్వారా ధ్యాన పరిచయం అయ్యి అప్పటి నుంచి ప్రతి రోజూ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం గావిస్తూ .. పత్రీజీ మరి ఇతర మాస్టర్ల ద్వారా రామగుండం, కొత్తగూడెం పట్టణాలలో అనేక క్లాసులు నిర్వహించటం జరిగింది.

ధ్యానం వల్ల మొట్టమొదటిగా, నాలో ఉన్న భయం తొలగిపోయింది. గతంలో ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా, ఎవరిదైనా చావును చూసినప్పుడు గానీ నాకు చాలా భయంగా ఉండేది. ఇప్పుడు అలాంటి వాటినన్నింటినీ అధిగమించి, నిర్భయంగా స్టేజీపై వందల మంది మధ్యలో కూడా ధ్యానప్రచారం చేస్తున్నాను. నా స్వీయ అనుభవాలను అందరికీ చెబుతూ అందరినీ ధ్యానులుగా మార్చాలనే పత్రీజీ సంకల్పానికి చేయూతనిస్తూ నా స్వీయ అనుభవాలను అందరికీ చెబుతూ అందరినీ ధ్యానులుగా మార్చాలనే పత్రీజీ సంకల్పానికి చేయూతనిస్తూ నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను.

కొంతకాలంగా నాలో నుంచి నాకు అంతర్వాణి వినబడటం, మరి అందునుంచి మాస్టర్స్ సందేశాలు తీసుకోవటం జరుగుతోంది! ఆటోరైటింగ్ ద్వారా నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో వ్రాయడం, తెలుసుకోవడం చేస్తున్నాను అంతేకాదు .. ఒక సామాన్య గృహిణిగా ఉంటూనే ఒక చిత్రకారిణిగా ఎన్నో రకాల బొమ్మలు గీసాను!

ఇటీవల ఒకరోజు నేను ధ్యానం క్లాసులో ఉన్నప్పుడు .. నా అంతరంగం అంతా నిశ్శబ్దం అయి .. తరువాత ఒక అందమైన కన్ను కన్పించి ఆ కన్ను నుంచి ఒక్కొక్క పుష్పం ఎన్నెన్నో పుష్పాలు వస్తూ వస్తూ వున్నాయి. ఇలా కొన్ని పుష్పాలు వచ్చిన తరువాత, అవన్నీ కలిసి మాలలుగా తయారయ్యాయి. ఆ మాలలు అన్నీ క్లాసులో ఉన్నవారి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంతలో ముగ్ధమనోహర రూపమైన బుద్ధభగవానుడు ప్రత్యక్షమై " నేను కురిపించిన పూల వర్షం అందరికీ పంచి .. విశ్వమంతా ప్రేమతత్వంతో వసుధైక కుటుంబంగా చేయండి " అని సందేశం ఇచ్చారు!

" ధ్యానజగత్ " అనే మహాసంకల్పంతో అందరికీ ప్రేమతత్వాన్ని పంచుతూ విశ్వకళ్యాణం కొసం పాటుపడుతున్నారు పత్రీజీ! వారు నేర్పిన ధ్యానం వల్లే నేను ప్రతిరోజూ, ప్రతిక్షణం పరమానంద భరితమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను.

 

K. అనురాధ
ఖమ్మం జిల్లా
సెల్ : +91 99086 10777

Go to top