" ప్రకృతిని ప్రేమించండి "

 

నా పేరు మనీషా, " నాకు ఎవరంటే ఇష్టమో చెప్పనా ? ఆయన అందరికీ చాలా చాలా ఇష్టం కానీ నాకు మాత్రం ఆయన అంటే మరీ మరీ ఇష్టం! ఆయన ఎవరో కాదు! పత్రి తాతయ్య!!

నేను ధ్యానం చేస్తున్నప్పుడు పత్రి తాతయ్య నా ముందు కూర్చుని కథలు చెపుతున్నట్లు కనిపించింది. కలర్స్ కలర్స్‌గా నా ముందు వెలుగుతున్నట్లుగా ఒక్కొక్క దేవుడు వచ్చి కన్పించి నన్ను చూసి నవ్వి వెళ్ళిపోతూంటారు.

ఒకసారేమైందంటే .. నేను ధ్యానం చేస్తూండగా గులాబీ పువ్వు ఒకటి వచ్చి నాతో .. " నువ్వు నాకు ముద్దు పెట్టావు కదా ! ఫస్ట్ టైమ్ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నా రేకులను తెంపేస్తావని నేను చాలా భయపడ్డాను .. కానీ నువ్వు అలా చేయలేదు. ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా పూలతో ఇలాగే వుండమని చెప్పు. అప్పుడు మిమ్మల్ని చూస్తే మాకు కూడా చాలా సంతోషం వేస్తుంది " అని చెప్పింది.

మీరు కూడా శ్రద్ధగా ధ్యానం చేయండి. ప్రకృతిని ప్రేమించండి .. మరి మా కోసం ఈ భూమిని పచ్చగా ఉంచండి ప్లీజ్!

 

K. మనీషా
5 వ తరగతి
ఏలూరు

Go to top