" ప్రియ పత్రీజీ - మా ఆత్మబంధువు "

 

నా పేరు కమల. మాది బోధన్. మా వారు R. అప్పలనాయుడు, B.Ed., కాలేజీలో ప్రిన్సిపాల్. మా కుటుంబమంతా 2009 సెప్టెంబర్ నుండి పిరమిడ్ ధ్యానులు మరి సంపూర్ణ శాకాహారులుగా మారి ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాం.

ధ్యానంలోకి రాకముందు నాకు చాలా సమస్యలు వుండేవి. " అసలు దేవుడెవరు ? స్వర్గం, నరకం ఉంటాయా ? మనిషి చావు పుట్టుకలు ఎలా జరుగుతున్నాయి ? చనిపోయాక ఏం జరుగుతుంది ? " అని పదే పదే ఆలోచించి .. " ఇవన్నీ తెలుసుకోలేని నిగూఢ రహస్యాలు " అని ఊరుకున్నాను. కానీ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా నా సందేహాలు తీరడం మరి " జీవితంలో ఎదురయ్యే బాధలకూ, కష్టాలకూ అనారోగ్యాలకూ, భయాలకూ మూలకారణం అజ్ఞానమే " అని అర్థమయింది.

ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందనీ, మరి జ్ఞానం వలన ఆనందం వస్తుందనీ, ఇలా నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ పంచాలనీ ‘SMS ’ ల ద్వారా, కరపత్రాల ద్వారా ధ్యానప్రచారం చేస్తున్నాను. పత్రీజీ 63 వ జన్మదినాన్ని పురస్కరించుకుని 41 రోజులు మా " సావిత్రీదేవి పిరమిడ్ కేంద్రం " ద్వారా ఇంటింటికీ ధ్యానం ద్వారా పిరమిడ్ గొప్పతనం తెలియజేస్తూ అంతులేని ఆనందాన్ని పొందాను! ఇంట్లో ధ్యానం చేసినా పిరమిడ్స్ కొనిపెట్టుకున్నా " నేను పిరమిడ్ మాస్టర్‌ని " అన్న విశ్వాసం నాకు కలగలేదు! ఎందుకంటే " నిజమైన పిరమిడ్ మాస్టర్ తాను ధ్యానం చేస్తూ ఆనందం పొందుతూ ధ్యాన ప్రచారం కోసం గడప గడపకూ తిరగాలి " అని పత్రీజీ చెప్పారు.

నా ధ్యాన సాధనకూ, ధ్యాన ప్రాచారానికీ నా భర్త పూర్తిగా సహకరించడం నా అదృష్టం. తాను కూడా వాళ్ళ B.Ed ., కాలేజీలో విద్యార్థులకు ధ్యానం మరి శాకాహారం గురించి ప్రచారం చేయడమేకాక ప్రతి బ్యాచ్ తమ కోర్సు ముగించేసి వెళ్ళేలోపు వాళ్ళను ధ్యానులుగానూ, శాకాహారులుగానూ మార్చిపంపిస్తానని సంకల్పించారు. అందులో భాగంగా మా సెంటర్‌కి వచ్చే సీనియర్ మాస్టర్స్‌తో కాలేజీలో క్లాసు కూడా పెట్టిస్తున్నారు.

అంతకన్నా అద్భుతమైన విషయమేమిటంటే " ఆత్మజ్ఞాన ప్రచారంలో మేటి పత్రిక అయిన మన ధ్యానాంధ్రప్రదేశ్‌కు రాజపోషణ నిమిత్తం రూ||25,000/- ఇచ్చి లోకకళ్యాణానికి మన వంతు చేయూతనిద్దాం " అని చెప్పగానే మా వారు కూడా " సరే " అనడంలో నవంబర్ 10 వ తేదీన బోధన్‌లో పత్రీజీ స్వహస్తాలకు D.D.అందించాము. ఈ అవకాశం మాకు కలగడం మా కుటుంబం చేసుకున్న అదృష్టం!

ఆ అద్భుత క్షణాలను మేం ఎప్పటికీ మర్చిపోలేము, అంత ఆనందాన్ని పత్రీజీ మాకు బహుకరిస్తూ మా పిల్లలిద్దరికీ ముద్దులు పెట్టేశారు! మమ్మల్ని అభినందనలతో ఆత్మీయంగా చూసిన పత్రీజీ చూపుల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం ! షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నిమిషం పాటు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుని " స్వంత లాభం కొంత మానుకుని ఈ మంచి పనిచేయడానికి ప్రోత్సహించింది నువ్వే కదా ! " అన్న భావనతో నన్ను చూశారు. మేం ఆ రోజు అంతులేని ఆనందాన్ని అనుభవించాం.

స్టేజీమీద మాట్లాడే అలవాటులేని నాకు పత్రీజీ మైకు చేతికిచ్చి నా అనుభవాలు చెప్పించి మళ్ళీ మళ్ళీ చప్పట్లు కొట్టించారు. అలా మా నలుగురి చేత చెప్పించి మాకు అంతులేని శక్తినిచ్చారు. ఆ శక్తితో ఇంకా ఎంతో చెయ్యాలనే స్ఫూర్తి కలిగింది. పత్రీజీ ఆశయాలను నెరవేర్చడంతో మా శాయశక్తులా కృషి చేస్తాం .. మరి అది మా ధర్మం, మా బాధ్యత.

7 వ తరగతి చదువుతున్న మా బాబు " అవినాష్ " మరి 5 వ తరగతి చదువుతున్న మా పాప " మౌనిక " లు కూడా ప్రతిరోజూ క్రమం తప్పక గంటసేపు ధ్యానం చేస్తారు. దివ్యచక్షువు అనుభవాలూ, సూక్ష్మశరీరయానాలు చక్కగా చేస్తూ ఆ విశేషాలను మాతో పంచుకుంటూ వాళ్ళ సందేహాలు తీర్చుకుంటూంటారు.

ఇలా ధ్యానంలో ఎన్నో అద్భుత అనుభవాలు మా పిల్లలు కూడా పొందారు. ధ్యానం ద్వారా మా పిల్లల చదువుల్లోనూ, క్రమశిక్షణలోనూ చక్కని మార్పు వచ్చింది. నాకు ఇంతకు ముందు పిల్లల భవిష్యత్తు గురించి భయం, టెన్షన్ వుండేవి కానీ ఇప్పుడు ప్రశాంతంగా నిశ్చితంగా వున్నాను !! ఎందుకంటే "ధ్యానం" అనే " కామధేనువు " ను నేను వాళ్ళకు అందించాను మరి దాంతో వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఇంత గొప్ప ధ్యానాన్ని మాకందించిన మన ప్రియ పత్రీజీకి నా ఆత్మ ప్రణామాలు.

 

కమల కుమారి
బోధన్
సెల్ : +91 94911 04589

Go to top