" మట్టిలోంచి మాణిక్యాలను తీస్తారు పత్రీజీ "

 

నా పేరు రాధ. మాది ఏలూరు; నేనూ, మా వారు సూర్యనారాయణ గారూ 2004 అక్టోబర్ 13 న ఆకివీడులో శ్రీ కొండారావు గారి ద్వారా పత్రీజీని దర్శించడం ; వెంటనే ధ్యానంలోకి రావడం ; మా ఇంటిపైన పిరమిడ్ కట్టడం ; మరి పత్రిసార్ వచ్చి 2004 నవంబర్ 18 న పిరమిడ్ ప్రారంభోత్సవం చేయడం వెంట వెంటనే జరిగాయి.

ధ్యానంలోకి రాకముందు నాకు " బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి " అని డాక్టర్స్ చెప్పారు. ఎప్పుడైతే ధ్యానంలోకి రావడం జరిగిందో 41 రోజులలో నా అనారోగ్యాన్ని ఆపరేషన్ అవసరం లేకుండా ధ్యానంతో పూర్తిగా తగ్గించుకున్నాను ! ఇప్పుడు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తూ .. నా భర్త సహకారంతో మరి మా ధ్యాన పుత్రుడు " బాబాజీ " సహకారంతో విరివిగా ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాను!

ఎంతో మందికి అహింసా తత్వాన్ని తెలియజేస్తూ శాకాహారులుగా మారుస్తూ నా జీవిత చక్రాన్ని తీర్చిదిద్దుకున్నాను. దీని కంతటికీ కారణం మన జగద్గురువు, దైవం ఆప్తమిత్రులు అయిన బ్రహ్మర్షి పత్రీజీయే ! మట్టిలో కూరుకుపోయి వున్న మాణిక్యాలను బయటికి తీసి " నువ్వు గాజుముక్కవు కాదు మాణిక్యానివి " అని మన దివ్యత్వాన్ని మనకు తెలియజేసే మహనీయులు మన బ్రహ్మర్షి పత్రీజీ.

" 2012 కల్లా ధ్యానజగత్ " ధ్యేయంగా 2010 సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు .. 44 రోజులు " శ్రీ లలితా పిరమిడ్ ధ్యాన ఆరోగ్యం కేంద్రం " , అగ్రహారం, ఏలూరులో అఖండ ధ్యానయజ్ఞం నిర్వహించడం జరిగింది. ఎంతో మంది ధ్యానులు ఈ అఖండ ధ్యానంలో పాల్గొని ఎన్నో మంచి అనుభవాలు పొంది తమ ఆరోగ్యాలు సరిచేసుకున్నారు. ఎంతో మంది క్రొత్త వాళ్ళు కూడా వచ్చి ధ్యానం నేర్చుకుని మాంసాహారం మాని వేసారు. ఈ యజ్ఞం జరిగినన్ని రోజులు ఎందరెందరో ఆస్ట్రల్ మాస్టర్స్ మాతోపాటు ఆ పిరమిడ్‌లో ఉన్న అనుభూతిని మేమందరం పొందాము !

ప్రతినెలా పౌర్ణమికి ఐదు రోజులు, అమావాస్యకు ఐదు రోజులు అఖండ ధ్యానం శ్రీలలితా పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రంలో నిర్వహించబడుతుంది. ఇది అందరూ వినియోగించుకుని పౌర్ణమి, అమావాస్యల్లో అధిక విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించి అతిశీఘ్రంగా ఆత్మజ్ఞానులుగా వారిని వారు తీర్చుదిద్దుకోగలరని ఆశిస్తూ ...

 

రాధ
ఏలూరు
ఫోన్ : +91 94902 93289

Go to top